టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్: ది సెకండ్ కేస్’. విశ్వక్ నటించిన ‘హిట్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శైలేష్ కొలనా దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయిక. ఇందులో సుహాస్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ఇందులో అత్యంత కీలక పాత్ర పోషించిన పోలీస్ డాగ్ మ్యాక్స్ ఇటీవల మరణించింది. ఈ విషయాన్ని శేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
తాజాగా అడివి శేష్ ట్విటర్లో మాట్లాడుతూ.. ‘టిక్ ఫీవర్‌తో సాషా చనిపోయిందని మీకు తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. హిట్ సినిమా 2లో మ్యాక్స్ పాత్రను పోషించిన ఈ కుక్క.. హాస్పిటల్ లో చూసినప్పుడు కోలుకుంటాడని అనుకున్నాం. కానీ, చివరకు పరిస్థితి విషమించింది. ఇది రాస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగడం లేదు. చాలా కష్టతరమైన షూటింగ్ సమయంలో మాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. జంతువులలో ఛాంపియన్‌గా ఉన్న సాషా శిక్షకులు/యజమాని ఆనంద్‌కు నా ప్రగాఢ సానుభూతి. హిట్ 2 చిత్ర దర్శకుడు శైలేష్ కొలను కూడా సాషాతో ఉన్న చిత్రాలను ట్విట్టర్లో పంచుకున్నారు. అంతేకాదు, ‘విరిగిన హృదయంతో ఈ వార్తను మీతో పంచుకుంటున్నాను. ప్రియమైన మాక్స్ ఇప్పుడే కన్నుమూశారు. పది రోజులుగా ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతోంది.
బెజ్లియమ్కు చెందిన క్రూరమైన జాతి అయినప్పటికీ, నేను కలుసుకున్న అత్యంత సున్నితమైన జంతువులలో సాషా ఒకటి. ప్రియమైన మాక్స్ మేము నిన్ను కోల్పోతున్నాము. మీరు లేకుంటే హిట్ 2 ఇలా ఉండేది కాదు’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఇదిలా ఉంటే సాషా హిట్ 2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ అడివి శేష్ కి పెట్ గా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో విలన్ చేతిలో పట్టుబడినప్పుడు ఈ కుక్క ఎంట్రీ ఇచ్చి భీకరంగా పోరాడుతుంది. ఈ దృశ్యాలు ఇప్పుడు అందరికీ గుర్తున్నాయి. అదే సమయంలో, సాషా ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరుకుంటున్నారు.