(IND vs PAK)
శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ కు ముహూర్తం దగ్గర పడింది.అదే భారత, పాకిస్థాన్ వన్డే మ్యాచ్. ఈనెల పదిన శ్రీలంక లోని కొలంబోలో జరిగే వన్డే మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మొన్నజరిగిన భారత, పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఇరు జట్లలోనూ టెన్షన్ నెలకొంది. వరస విజయాలతో పటిష్టంగా ఉన్న పాకిస్థాన్ జట్టు భారత్ తో ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇండియా పాకిస్తాన్లో తలపడిన గత 5 వన్డేలు పరిశీలిస్తే ఇండియా 4 విజయాలు, పాకిస్తాన్ 1 విజయం సాధించాయి.
టీమ్ ఇండియా చెత్త ఫీల్డింగ్ (IND vs PAK)
ఆసియా కప్‌లో టీమిండియా చెత్త ప్రదర్శన మరోసారి బయటపడింది. (IND vs PAK) పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ లో విఫలమైన మన స్టార్ ఆటగాళ్లు, నేపాల్ తో జరిగిన మ్యాచ్‌లో చెత్త ఫీల్డింగ్‌తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు.
ఏకంగా మూడు క్యాచ్‌లను వదిలిపెట్టడంతో బౌలర్లు ఒత్తిడికి గురై పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 104 పరుగులకే ఆలౌటైన నేపాల్.. టీమిండియాపై మాత్రం 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసే అవకాశం రాని ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్ లేకపోవడంతో నేపాల్ మ్యాచ్‌లో చెత్త ఫీల్డింగ్‌తో విమర్శలు ఎదుర్కొంట్టున్నారు.
ఇండియన్ టీమ్‌కు సవాల్ విసిరిన పాక్ కెప్టెన్….. (IND vs PAK)
బంగ్లాదేశ్ పై ఘన విజయం తర్వాత ఆత్మవిశ్వాసంతో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మంచి పెర్ఫార్మెన్స్ తో ఇండియాకు గట్టి కౌంటర్ ఇస్తామంటున్నాడు.బంగ్లాదేశ్ ను పాకిస్థాన్ 7 వికెట్లతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండియాపై కూడా గెలిస్తే పాకిస్థాన్ తన ఫైనల్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంటుంది.
విజయాలతో బాబర్ ఆజమ్ సేన…..
ఇక గత కొద్దికాలంగా విజయాలతో బాబర్ ఆజమ్ సేన పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో ఫఖర్-ఇమామ్ జోడి నుంచి ఏడవ నెంబర్ వరకూ పాకిస్తాన్ బలంగా ఉందనే చెప్పాలి. అటు బౌలింగ్‌లో కూడా షాహిన్ ఆఫ్రిది, నసీమ్ షా, రవూఫ్‌తో పాటు స్పిన్నర్లలో షాదాబ్, నవాజ్ ఉన్నారు. అందుకే నిజంగానే హై వోల్టేజ్ కానుంది.వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆసియా కప్ నిర్వాహకులకు మ్యాచ్ ల నిర్వహణ కష్టంగా మారుతోంది.
శ్రీలంక ఆసియా కప్‌లో సూపర్-4 దశలో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్, ఇండియా, బంగ్లాదేశ్.తొలి మ్యాచ్ బుధవారం పాకిస్థాన్‌లో జరిగింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఈనెల 9న తదుపరి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్ నుంచి లంకకు వెళ్లేందుకు సమయం కావాలి. అందుకే ఒకరోజు ప్రయాణానికి, మరో రోజు విశ్రాంతికి కాబట్టి రెండు రోజుల పాటు ఆసియాకప్‌లో మ్యాచ్ జరగటంలేదు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. గ్రూప్ దశలో అద్భుత ప్రదర్శన కనబర్చిన శ్రీలంక సూపర్-4లో ఎలా రాణిస్తుందో చూడాలి.