నెల్లూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఇండియన్ నేషనల్ లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షమి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఈరోజు తెల్లవారు జామున ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు షమిని అరెస్ట్ చేసేందుకు వచ్చారు. దీంతో ఆయన సన్నిహితులు, అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో వారిని పోలీసులు చెదరగొడుతున్నారు.
విమర్శించడంతో…
ఇండియన్ నేషనల్ లీగ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సయ్యద్ షమి ఇటీవల నెల్లూరు పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వచ్చారని చెబుతున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ షమి కుటుంబ సభ్యులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.