divorce
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ భార్యకు విడాకులిస్తున్నాడా?? ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పాతికేళ్ల వైవాహిక జీవితాన్ని కూడా సంతోషంగా గడిపింది. అయితే తాజాగా వీళ్లిద్దరూ విడిపోతున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో అయితే ఈ వార్త వేగంగా వ్యాపిస్తోంది. పాతికేళ్ల వైవాహిక బంధాన్ని విజయ్ వదులుకుంటారా?, భార్యతో విడాకులు తీసుకుంటారన్న వార్తలపై విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ స్పందించలేదు.
డైవోర్స్ పై కార్లీటి ఇచ్చిన జనని: divorce
విజయ్- సంగీత విడిపోవడంపై వచ్చిన పుకార్లుకు ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు. తాజాగా లియో మూవీలో నటించిన జనని ఆ పుకార్లుకు చెక్ పెట్టేసింది. జనని రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..విజయ్- సంగీతపై వచ్చిన వార్తలను సోషల్ మీడియా వాళ్లు ఎందుకు అలా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడింది. వీరు విడిపోవటం లేదంటూ అందరికి క్లారిటీ ఇచ్చింది. ఇక ఈమె క్లారీటి ఇవ్వటంతో ప్రతి ఒక్కరు విజయ్- సంగీత రూమర్ ను కల్పితం అని అనుకుంటున్నారు. విజయ్ ను సంగీతాను దగ్గర నుండి చూసిన జనని ఈ వార్తలను కొట్టిపారేసింది. వీరు ఎప్పటికి విడిపోరు . ఈ జంట అందరికీ ఇన్ స్పిరేషన్ అంటూ మాట్లాడింది. జనని క్లారిటీ ఇవ్వకపోతే ఈ పుకార్లు ఇంకొంచెం ఊపుందుకునేవి.
విజయ్ నాకు అన్న లాంటి వాడు
వాస్తవానికి విజయ్ తో కలసి నటించే అవకాశం వస్తే చాలనుకున్నాని లయోలో నటించే అదృష్టం కలిగిందని సహనటి జనని అంటోంది. విజయ్ తో కలసి కూర్చుని టైమ్ స్పెండ్ చేయడం చాలా బాగుంటుందని తనను చెల్లిలా భావించి మాట్లాడాడని జనని చెప్పుకొచ్చింది .విజయ్ భార్య సంగీతా, నేను శ్రీలంకలోని జాఫ్నాలోనే పుట్టాం. నేను తమిళ్ మాట్లాడితే తనకు సంగీతే గుర్తొస్తుందని విజయ్ అంటుంటాడని అంది. దీన్ని బట్టి చూస్తే విజయ్ ,జనని మధ్య ఎలాంటి బంధమూ లేదని, విజయ్ భార్య సంగీతతో పొరపొచ్చాలు లేని జీవితమే గడుపుతున్నాడని అర్ధమవుతోంది. divorce
ఇద్దరి ప్రేమ చిగురించిందిలా..
సంగీత విజయ్ కి వీరాభిమాని. లండన్ లో స్థిరపడ్డ తమిళ కుటుంబం అమ్మాయి. హీరో విజయ్ సినిమాలను ఎక్కువ చూస్తుంది. 1996 లో లండన్ నుంచి చెన్నై వచ్చిన సంగీత విజయ్ ని కలవడానికి విశ్వప్రయత్నలు చేసింది. చివరకు విజయ్ ను మిట్ అయింది. ఆ విషయం విని విజయ్ షాక్ అయ్యాడట. ఓ హీరోను చూసేందుకు లండన్ నుంచి చెన్నైకి వచ్చారా అని ఆశ్చర్యపోయాడట. అలా అంత దూరం నుంచి వచ్చినందుకు విజయ్ తన ఇంటికి భోజనానికి ఆహ్వానం కూడా ప లికాడట.. ఇంక అప్పటి నుంచి సంగీత విజయ్ వాళ్ల ఇంటికి రావటం అందరితో కలిసిపోవటం బాగా మాట్లాడటంతో…. విజయ్ తల్లితంద్రుడులు ఆమెను మా అబ్బాయిని పెళ్లిచేసుకుంటావా అని అడిగారట. విజయ్ అంటే ఇష్టం ఉండటంతో సంగీత ఒకే చెప్పింది. వీరి పెళ్లి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు జేసన్ సంజయ్,కుమారై శాషా. ఇలా వీరి దంపత్యా జీవితం చాలా అన్యోన్యంగా సాగుతోంది. ఇంత గట్టి బంధం ఉన్న వీరిద్దరూ విడిపోవడం అనేది ఒట్టి రూమరేననిపిస్తోంది. divorce