ఇస్రో (ISRO) వరస విజయాలతో అంతరిక్ష కేంద్రంపైనే అందరి దృష్టి పడుతోంది. ప్రపంచ దేశాలకు దీటుగా అంతరిక్ష రంగంలో భారత్ సత్తాను చాటిన మన సైంటిస్టులు ఎంత సింపుల్ గా ఉంటారో తెలుసా? అంతరిక్షాన్ని జయించిన మన ఇస్రో సిబ్బంది వాస్తవ జీవితంలో మాత్ర చాలా చాలా సింపుల్ గా ఉంటారు.
నేటితరం టెక్నాలజీ నిపుణులు, బీటెక్ చదివిన గ్రాడ్యుయేట్లు స్టైలిష్ గా ఉండటం సహజం.కానీ ఇస్రో సిబ్బంది సింప్లిసిటీకి పెట్టింది పేరు. చూడటానికి పెద్ద స్మార్ట్ గా కనపడరు..కానీ స్మార్ట్ వర్క్ లో దిట్టలు..
హిందూ ధర్మాన్ని పాటిస్తారు… (ISRO)
సంస్క్రుతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సనాతన హిందూ ధర్మానికి దగ్గరగా ఉంటారు. మహిళా సైంటిస్టులు, ఇతర కీలక హోదాల్లో ఉన్న మహిళలు మోడ్రన్ గా ఉండరు.. వారి మనసు మోడ్రన్..కానీ వారి కట్టు,బొట్టు, తీరుమాత్రం సనాతనం.. ఉపగ్రహంలోని పేలోడ్స్ ను డిజైన్ చేసేంత మేధావి తనం ఉన్నా ఆ మహిళా అధికారులు సంప్రదాయబద్ధంగా చీరలు ధరిస్తారు. నుదుటన బొట్టు పెట్టుకుంటారు.. జడలో పూలు పెట్టుకుంటారు. మగవారైతే షర్టు, ప్యాంటు టక్ చేసుకుని ఉన్నా నుదుటన బొట్టు ఉంటుంది చాలా మందికి. విశ్వ రహస్యాల ఛేదనలో వారి మెదడు పరుగులు తీస్తున్నా వారు నమ్మినది, నమ్ముతున్నది మాత్రం సనాతనవాదమే.
ప్రయోగానికి ముందు పూజలు (ISRO)
అంతెందుకు? ఉపగ్రహ ప్రయోగానికి ముందు దానికి పూజలు చేసి, దాని నమూనాను తిరుమల శ్రీవారికి చూపించి గానీ ప్రయోగించరు. మన ఇస్రో సిబ్బంది అంత సెంటిమెంట్స్ కలిగిన వారు. ఇస్రో కంట్రోల్ సెంటర్ లోకి అడుగుపెట్టేముందు విధిగా పూజలు చేసి అడుగు పెడతారు. ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే ఆ క్రెడిట్ కూడా వారు తీసుకోనంత నిస్వార్ధపరులు . దేవుడి దయ, భగవంతుడి కృప.. దేశ ప్రజల మనో వాంఛ అని కామెంట్ చేస్తారే తప్ప ఏకపక్షంగా విజయం మాదేనని డచ్చాలు కొట్టుకోరు. ఇస్రోలో ఇప్పుడున్న సైంటిస్టులు పాత తరానికి చెందిన వారు.
ఆధునిక ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన వారు కాదు..సోషల్ మీడియాప్లాట్ ఫామ్స్ లో క్రియాశీలకంగా ఉండటమూ వారికి పెద్దగా తెలీదు. అందరూ గ్రామీణ భారత దేశం నేపధ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి మెరిట్ లో సీటు, ఉద్యోగం సంపాదించిన మెరికలే. ఇప్పటి తరం ఖరీదైన, మోడ్రన్ ఎక్విప్ మెంట్ కలిగిన కాలేజీలనుంచి వచ్చామని, కాలేజీల రేటింగ్స్ కూడా చెప్పుకుంటారు. కానీ ఆర్యభట్ట ఉపగ్రహం ప్రయోగించిన సైంటిస్టులకు ఇలాంటి వాతావరణం ఆనాడు లేదు.
ఇవాల్టి తరం వారి ముందు దిగదుడుపే
ఐఐటీలనుంచి ఎంటెక్ లు, ఇస్రో స్పాన్సర్ షిప్ ప్రోగ్రాముల ద్వారా ఈక్యాంపస్ లోకి అడుగు పెట్టిన నేటి తరం వారు ఈ పాతతరాన్నిచూసి అవాక్కు అవ్వాల్సిందే.
పాతతరం అంతా స్మార్ట్ ఇంజనీర్లు, వృత్తిపరంగా నిష్ణాతులు, అతి తక్కువ బడ్జెట్ తో హైఎండ్ టెక్నాలజీని బిల్డ్ చేయగల సమర్ధులు.
వీరికి జీతాలు విదేశాల్లో వారితో పోల్చితే తక్కువే.. సమయం వేళలూ ఎక్కువే..
అయినా మొక్కవోని దీక్షతో గంటల తరబడి పనిలో నిమగ్నం కాగల ఓపిక , సంయమనం వీరి సొంతం.
వరస విజయాల్ని చవిచూస్తున్న ఈసిబ్బంది తీరు, తెన్ను ఎలా ఉంటారు అన్నది చాలా మందిని వేధించే ప్రశ్న.. ఇస్రో (ISRO) సిబ్బంది చాలా సింపుల్ గా ఉంటారు.
ఉపగ్రహాన్ని సురక్షితంగా అంతరిక్షంలోకి పంపేవరకూ వీరు చేసేది యజ్నమే.. దాని కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు.
కానీ ఒక విజయం వచ్చాక వారిలోకలిగే జోష్ మాత్రం ఇంతా అంతా కాదు..
ఇంత డెడికేషన్ తో మోటి వేషన్ తో పనిచేసే వీరికి ఉత్సాహం కలిగించేవి ఏ అంతరిక్షం నుంచో ఊడిపడే సందేశాలు కావు..
తమడైలీ రొటీన్ నుంచి రిఫ్రెష్ కావడానికి ఫిల్టర్ కాఫీ, ఓ మసాలాదోశె చాలు వీరికి అంటే నమ్ముతారా?