బాలీవుడ్ భామ జాన్వీ(Janhvi) గురించి తెలియనివాళ్లుండరు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో 2018 ధడక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటిసినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసుకుంది. అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురుగా జాన్వీ కపూర్ తక్కువ సినిమాలలో నటించినా స్టార్ హీరోయిన్ గా హవా నడిపిస్తోంది . గ్లామర్ బ్యూటీ, ఫిట్నెస్ ఫ్రీక్ అయిన జాన్వీ తన బాడీ ఫిట్ గా ఉండేందుకు తీసుకునే కేర్ మామూలుగా ఉండదు. నటిగా తన పరిధిని పెంచుకునే ప్రయత్నంలో కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు కూడా రెడీ అంటుందీ బ్యూటీ.
జాన్వీగురించి ఇప్పుడెందుకు చెప్పుకోవాలంటే ఈ అందాల సుందరి తెలుగులోకీ ఎంట్రీ ఇస్తున్నందుకే..జాన్వీ ఎంట్రీ అంటే మామూలుగా ఉండదుగా మరి.. అందుకే అగ్ర తారలతోనే సినిమాలు చేసేందుకు ఒప్పుకుంది జాన్వీ.. జూనియర్ఎన్టీఆర్, రామ్ చరణ్, అక్కినేని అఖిల్ ఈ ముగ్గురితోనూ వరుస పెట్టున సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది శ్రీదేవి కూతురు.
ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ సినిమా దేవర షూటింగ్ లో బిజీగా ఉంది జాన్వీ. దేవర సెట్స్ పై ఉండగానే మిగిలిన రెండు సినిమా అవకాశాలు వచ్చినట్లు సమాచారం. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర మాస్ యాక్షన్ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన జాన్వీ ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది.
చెర్రితో జాన్వీ (Janhvi)
దేవర మూవీ తర్వాత జాన్వీ చేసే మరో మూవీ పవర్ స్టార్ రామ్ చరణ్ తో.. ఈ సినిమాలో డైరెక్టర్ బుచ్చిబాబు జాన్వీ కోసం ప్రత్యేకంగా ఒక పాత్ర రాశారని తెలుస్తోంది. జాన్వీ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై సంతకం చేసే అవకాశం ఉంది. ఈ మూవీ దాదాపు కన్ఫర్మ్ అయ్యింది..ఇక వివరాలు వెల్లడించడమే తరువాయి. వీరిద్దరే కాదు..అక్కినేని బుల్లోడు అఖిల్ తో కూడా జాన్వీ జతకట్టనుంది. ధీర అనే టైటిల్ కూడా ఈ మూవీకి సెట్ చేసినట్లు తెలుస్తోంది. సాహోకి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన అనిల్ కుమార్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరక్టర్ గా ఆయనకు ఇది డెబ్యూ మూవీ కానుంది.
తమిళ సినిమాలంటే ఆసక్తి
సౌత్ ఇండస్ట్రీపై కన్నేసిన జాన్వీ కపూర్ కి కోలీవుడ్ కూడా నటించాలని అనుకుంటోంది. అందులో భాగంగా తమిళ చిత్రాలను ఎక్కువగా చూస్తుందట జాన్వీ కపూర్.
జాన్వీకి బోనీకపూర్ కండిషన్ (Janhvi)
ఈ క్రమంలో ఆమె తండ్రి ఒక కండీషన్ పెట్టాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో ధనుష్ కు జంటగా నటించరాదన్నదే ఆ కండిషన్. హీరో విజయ్ లేదా అజిత్ సినిమాల ద్వారా కోలీవుడ్ కి పరిచయం చేయాలని బోనీకపూర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ధనుష్ సరసన నటించొద్దని ఎందుకు అన్నారన్నది ఆశ్చర్యం కలిగించే అంశం.
భారీ హిట్స్ లేవు…
బాలీవుడ్ లో జాన్వీ కపూర్ ఇప్పటి వరకూ 10 కి పైగా సినిమాల్లో నటించినా ఏ సినిమా కూడా సరైన హిట్ అందుకోలేదు. ధడక్ తప్పించి గొప్ప సినిమాలేం లేవనే చెప్పాలి. మరి టాలీవుడ్ లో అయిన హిట్ సినిమాను తన ఖాతా లో వేసుకుంటుందో లేదో చూద్దాం!!!