(spy)
నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్న పాత్రలతో, కథాంశాలతో సిని ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అలా ఆయన చేసిన ప్రయోగం ‘బింబిసార’. ఈ సినిమా కళ్యాణ్ రామ్‌కు తిరుగులేని విజయం అందించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ 65.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసార మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్‌తో అదే ఏడాది ఆరంభం లో ‘అమిగోస్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘ డెవిల్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కి అందిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ కు సంబంధించిన అప్ డేట్ ను గురువారం సాయంత్రం 4:05 నిమిషాలకు ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ క్రియేట్ చేసింది.
దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా బ్రిటీషర్ల ముసుగేసుకుని కల్యాణ్ రామ్ ఎందుకు పని చేశాడనే కథనంతో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామా బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నఈ సినిమా నవంబర్ 24న థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు చిత్ర బృందం.
పీరియాడిక్ స్పై(spy) థ్రిల్లర్
పీరియాడిక్ స్పై(spy) థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీషర్లకు సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించింది. కళ్యాణ్ రామ్ న్యూ లుక్స్ లో చాలా కొత్తగా కనిపించాడు.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ తో సంయుక్త మీనన్ చేస్తున్నరెండో సినిమా ఇది.
రీసెంట్ గా ఈ భామ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు మేకర్స్. ఆ పోస్టర్ లో సంయుక్త నిండైన చీర లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా మెరిసింది.
డైరక్టర్ పేరు మార్పు
నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ సినిమా మొదలైంది. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు కూడా పోస్టర్ మీద నవీన్ మేడారం పేరు ఉంది. కానీ ఇప్పుడు ఆయనకి బదులుగా దర్శకుడిగా అభిషేక్ నామా పేరు వచ్చింది. నవీన్ మేడారం పేరు తొలగింపుపై ఆరా తీస్తే.. డెవిల్ ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర బృందంకి, దర్శకుడికి మధ్య విభేధాలు వచ్చినట్లు నిర్మాణ వర్గాలు వెల్లడించాయి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని ఆ తర్వాత నవీన్ మేడారాన్ని తొలగించి ఆ స్థానంలో అభిషేక్ నామాను తీసుకున్నట్లు తెలుస్తోంది. డెవిల్ కంటే ముందు అభిషేక్ పిశ్చర్స్ సంస్థలో బాబు బాగా బిజీ అనే సినిమా చేశారు నవీన్ మేడారం. అభిషేక్ నామా, నవీన్ మేడారం మధ్య డెవిల్ కి ముందే పరిచయాలు ఉన్నాయి. మరి డెవిల్ సమయంలో ఏం జరిగింది అనేది ప్రశ్నగా మిలిగిపోయింది. ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వచ్చి చెబితే తప్ప తెలియదు.