నటనకు అద్భుతమైన నిర్వచనం మన కమల్ హాసన్.. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోతారు. ఆపాత్రకు తగ్గట్లు ఒదిగి పోతారు. నటనను అంత సీరియస్ గా తీసుకుంటారు కాబట్టే ఓ స్వాతిముత్యం, ఓ సాగర సంగమం, భారతీయుడు, దశావతారం లాంటి సినిమాలు మనకు పరిచయమయ్యాయి.
పాత్రలో ఒదిగి ఉండటం కోసం ఎలాంటి రిస్క్ నైనా భరించే స్వభావం కమల్ సొంతం. భారతీయుడు పేరుతో అద్భుతమైన సినిమాను అందించిన కమల్ ఇపుడు దాని సీక్వెల్ కోసం తిండి కూడా మానేశారట.
ముసలి గెటప్ కోసం కమల్ హాసన్ ప్రొస్థటిక్ మేకప్ వేసుకుంటున్నారు. ఆ మేకప్ వేసుకుని తీసేటప్పటి వరకు కమల్ ఏమీ తినకుండా ఉంటున్నారట. ఎందుకంటే తినేటప్పుడు మేకప్ పాడయ్యే అవకాశం ఉంది. దీంతో కేవలం ద్రవ పదార్థాల మీదనే ఆధారపడుతున్నారని సినిమా రైటర్ చెప్పారు. బి.జయ మోహన్ ఈ సినిమాకు రైటర్‌గా వర్క్ చేస్తున్నారు.
ఇప్పటికీ గుర్తుండిపోయిన భారతీయుడు
కమల్ కేరీర్లోకే ది బెస్ట్ అయిన భారతీయుడు సినిమా విడుదలై 26 ఏళ్లు అవుతోంది. కానీ ఆమూవీ ఇచ్చిన వైబ్స్ మాత్రం ఇంకా తగ్గలేదనే చెప్పాలి. ఇప్పుడు మళ్లీ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో భారతియుడు సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్ 2 షూటింగ్ జరుగుతోంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షుటింగ్ ఆ మధ్య మధ్యలోనే ఆగిపోయింది..కానీ ఇప్పుడు మళ్లీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సేనాపతి పాత్ర – కమల్
భారతీయుడులో లంచగొండులపై తిరగబడ్డ సేనాపతి పాత్ర ఇండియన్ 2 లోనూ కనిపిస్తుంది. అందులో ఆయన తండ్రి పాత్రను కూడా చూపించనున్నారు. 1920 నేపథ్యంలో సాగే కథకు ఇప్పటికీ కథకు లింకు పెడుతూ సన్నివేశాలుంటాయని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సేనాపతి పాత్రకు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అనే విషయాలను ఇండియన్ 2లో చూపించబోతున్నారని జయకుమార్ తెలిపారు.
సినిమా నిర్మాణం కాస్త ఆలస్యమైనా చిత్రంపై మాత్రం సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వ్యాపారంలోనూ ఈ చిత్రం కొత్త రికార్డులు నమోదు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. మూవీ బడ్జెట్ రూ 200 కోట్లని సమాచారం. అయితే సినిమా ఆడియో హక్కులను ఇంతకు ముందే సరిగమ సంస్థ రూ.23 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.తాజాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను కూడా నెట్ ఫ్లిక్ సంస్థ రూ. 220 కోట్లకు పొందినట్లు తాజా సమాచారం.
నిజానికి ఇండియన్ 2 సినిమా ఎప్పుడో విడులద కావాల్సింది. నిర్మాతలకు, శంకర్‌కు మధ్య వచ్చిన బడ్జెట్ సమస్యలు , కరోనా లాంటి కారణాలతో మధ్యలోనే సినిమా షూటింగ్ ఆగిపోయింది.ఇటీవలే శంకర్ ఈ సినిమాను మళ్లీ స్టార్ట్ చేశారు. నెలలో 12 రోజులు రామ్ చరణ్ తో మరో మూవీ చేస్తున్నాఈ సినిమాకు సమయాన్ని కేటాయిస్తు శంకర్ మరో 12 రోజుల సమయాని ఇండియన్ 2కి కేటాయిస్తున్నారు.పక్కా ప్లానింగ్‌తో రెండు సినిమాలను అనుకున్న టైమ్ కే పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోండగా సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోండగా, అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇటీవలే విడుదలైన విక్రమ్, జైలర్, జవాన్ లాంటికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి సక్సెస్ సొంతం చేసుకున్నాడు.అగ్రశ్రేణి చిత్ర నిర్మాణ బృందంతో రూపొందుతున్నఇండియన్-2 సినిమా సంక్రాంతి సినిమాల బరిలో నిలబడుతోంది. ఈవిషయాని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించేసింది.