Keerthi Suresh
టాలీవుడ్ మహానటి కీర్తి సురేశ్ తాజాగా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. తెలుగు లో నేను- శైలజ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మహానటి సినిమాలో సావిత్ర పాత్రలో ఒదిగిపోయి అందరి దగ్గర ప్రసంశలు అందుకుంది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ వరస సినిమాలతో నటిస్తూ అందరిని మెప్పిస్తుంది. ఆ మధ్య వరస ప్లాప్ లతో సతమతం అయినా తెలుగులో నాని సరసన ‘దసరా’ మూవీలో నటించి హిట్ ను అందుకుంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ తో జతకట్టిన ‘మామన్నవ్’ చిత్రం హిట్ ను అందుకుంది. మొన్నటి వరకూ ప్లాప్ లతో కొనసాగిన…. మూవీ కెరీర్ లో మళ్లీ వేగం పుంజుకుంది. ఇప్పుడు చేతి నిండా నాలుగైదు మూవీలలో నటిస్తూ బిజీగా గడుపుతుంది ఈ మహానటి. హిందీ మూవీలోకి, హిందీ వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.
జయం రవి జోడిగా Keerthi Suresh
‘సైరన్’ సినిమాతో మన ముందుకు వస్తుంది ఈ బ్యూటి. కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ని బట్టి సినిమాలో జయం రవి నేరస్థుడుగా కనిపించనున్నాడని….. ఇక ఆయనను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ రోల్ ను కీర్తి సురేశ్ షోషిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలో జయం రవి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
బాలీవుడ్ లోకి ఎంట్రీ
మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాను దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నాడు. వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్, వామికా హీరోయిన్లు గా నటిస్తున్నారట. అట్లీ దర్శకత్వంలోని తమిళ హిట్ మూవీ ‘తేరి’ ని హిందీ రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కబోతుందనే సమాచారం. మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభంమైందని మన అందరికి తెలుసు.
కన్నివేదిని మూవీలో హీరోయిన్ గా Keerthi Suresh
‘కన్నివేదిని’ సినిమాలో కీర్తి సురేష్ ఒక జర్నలిస్ట్ గా ఎదగాలని ఆకాంక్షించే మీడియా విద్యార్థిగా కనిపించబోతుందట. దీనికి నూతన దర్శకుడు గణేష్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉమెన్ సెంట్రిక్ టెక్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుందట. రామ్, హరి అనే చిత్రనిర్మాతలు అసిస్టెంట్లు గా పనిచేస్తున్నారు. వీజే రక్షణ్ కీర్తి స్నేహితురాలిగా, విసారనై ఫేమ్, అజయ్ ఘోష్, నమితా కృష్ణమూర్తి కన్నివేదిని మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కె చంద్రు- కీర్తి సురేష్ న్యూ మూవీ
కె.చందు దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘రివోవర్లర్ రీటా’. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ బి వహిస్తున్నాడు.
సుమన్- కీర్తి సురేష్ న్యూ మూవీ Keerthi Suresh
సుమన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రఘతాత’. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సమాజంలో మార్పు కోసం ఓ మహిళ ఇంట్లో ప్రారంభించిన విప్లవం గురించి కథ రానుందట.
వెబ్ సిరీస్ లో తన సత్తా చూపించబోతున్న కీర్తి సురేశ్
అటు సినిమాలు, బిజినేస్ లో బిజీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ అమ్మడు వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్ లో పీరియాడిక్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ రానుంది. ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘అక్క’ అనే టైటిల్ ప్రాజెక్ట్ తో ఈ వెబ్ సిరీస్ రానుంది. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ధర్మరాజ్ శెట్టి డెబ్యూ డైరెక్టర్ ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నాడు.