KIWI
కివీ.. నేటికాలంలో ఈ పండు తెలియని వారు ఉండరు.ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో కివీ ఒకటి. ఇది విదేశాల్లో పండిన పంటైనా భారతదేశంలో ఈ పండుకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం తినే అన్ని పండ్లులో కంటే కివీ పండ్లులో అధికంగా పొషక విలువలు ఉంటాయి. అందుకే కివీ పండుని పండ్లలో రారాజు అని అంటారు.ఈ పండు చూడడానికి సపోట లా కనిపిస్తుంది. కానీ కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది.కోసి చూస్తే నలుపు రంగు గింజలతో ఆకుపచ్చ లేదా పసుపు పచ్చని రంగు గుజ్జుని కలిగి ఉంటుంది. ఈ పండులో అద్బుతమైన న్యూట్రియన్స్ ఉంటాయి.ఈ పండ్లు పులుపు, తీపి రుచులను కలిగి ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం గ్రీన్ కలర్లో ఉండే కివీ పండ్లును ఎక్కువగా వాడుతోంది. ఇవైతే ఏడాదంతా అందుబాటులో ఉంటాయి.ప్రస్తుత కాలంలో పండ్లుకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మనం మన ఆరోగ్యం కోసం తీసుకునే ఆహారంలో ఎక్కువ పోషక పదార్ధాలు ఉండేలా తీసుకుంటుంటాం. కానీ అవన్నీ ఒకే పండులో ఉంటే దానిని మించిన పోషకాహారం ఇంకేముంటుంది. అలాంటిదే కివీప్రూట్ కూడా. కివీని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు.
పోషకాలు పుష్కలం (KIWI)
కివీ ప్రూట్ ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ కివీ ఫ్రూట్ వల్ల మనకు చాలా ఉపయోగాలున్నాయి.అందులో విటమిన్ బి,విటమిన్ సి, విటమిన్ఈ, విటమిన్ కె,కాల్షియం,పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్,జింక్,నియాసిన్,బీటా కెరోటిన్,ప్రోటీన్,ఫైబర్ మొదలైన పోషకాలు పుష్కలంగా నిండి ఉంటాయి.అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కివీ పండ్లలో నిండి ఉంటాయి.
సకల సమస్యలకూ చెక్ పెట్టే కివీ
ఆరోగ్య పరంగా కివీ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ సిస్టం ను బూస్ట్ చేయడానికి, రక్తహీనత సమస్యను తరిమి కొట్టడానికి, బిపిని కంట్రోల్ చేయడానికి కివీ ఉపయోగపడుతుంది. ఎముకలకు సంభంధించిన సమస్యలను తగ్గేలా చేస్తుంది, చర్మ క్యాన్సర్ నుండి ఉపశమనం పొందొచ్చు, కంటి చూపుకు సంబంధించి సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది, ప్లేట్ లెట్స్ ను పెంచడానికి కివీ బాగా హెల్ప్ చేస్తుంది. షూగర్ వ్యాధితో భాధపడే వారు కివీ పండ్లు తీసుకుంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి కూడా కివీ పండ్లు ఎంతగానో సహాయపడతాయి.
డెంగ్యూ పేషెంట్స్ కి వరం
కివీ పండుని ఎక్కువగా మన దేశంలో డెంగ్యూ జ్వరం వచ్చినపుడు తినడం మొదలు పెట్టారు. ఎందుకంటే డెంగ్యూ జ్వరం వచ్చినపుడు మన శరీరంలోని ప్లేట్లెట్స్ సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. కివీ పండు కి శరీరం లో ప్లేట్లెట్స్ సంఖ్య పెంచే గుణం అధికంగా ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ డెంగ్యూ జ్వరం వచ్చినపుడు కివీ పండు ని తినమని చెబుతుంటారు. కివీ పండు లో నారింజ మరియు నిమ్మకాయల కంటే రెట్టింపు విటమిన్ సి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచపు వాణిజ్య పంటల్లో కివీ ఫ్రూట్ కూడా అత్యంత ముఖ్యమైన పంటగా మారిపోయింది. కివీ పండ్లు ఎక్కువగా అడవులు, పర్వతాలు, కొండల్లో పండుతాయి. ఎక్కువగా చల్లని ప్రదేశం లో ఈ పండు పండుతుంది. కివీ పండు ని ఎక్కువగా న్యూజిలాండ్,ఆస్ట్రేలియా మరియు చైనా దేశాలలో పండిస్తారు. దీన్ని చైనీస్ గూస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. మన దేశంలో కివీ సాగు అంతగా లేకపొవడంతో న్యూజిలాండ్, చైనా నుండి దిగుమతి చేసుకుంటుంది.