తెలుగు లో 2019 లో దొరసాని సినిమా Movie తో సినిరంగంలో అడుగుపెట్టిన శివాత్మిక తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇండస్ట్రిలో తన కంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుని ఎంతగానో క్రేజ్ సంపాదించింది. తొలి సినిమాతోనే ఉత్తమ డిబట్ ఫిలిం హిరోయిన్ అవార్డును సొంతం చేసుకుంది ఈ గుమ్మ. నటన లో తల్లిదండ్రులకు తగ్గ కుతూరిగా రంగమార్తాండ సినిమాలో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ప్రకాశ్ రాజ్ కుతూరిగా అత్యద్భుతంగా నటించింది.. ఆ సినిమాలో చెలాకీ అయిన కూతురుగా నటించిన శివాత్మిక తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కొలీవుడ్ వైపు ద్రుష్టి సారించింది. ఇప్పటికే శివాత్మికకు తమిళంలో అభిమానులు పెరుగుతున్నారు.
శివాత్మిక, అర్జున్ దాస్ జోడి … Movie
ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మొదటి సినిమాపెద్దగా క్లిక్ కాకపోయినా శివాత్మిక నటనకు మంచి గుర్తింపు వచ్చింది.. కోలీవుడ్ లో ఈ భామకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. కోలీవుడ్ లో ఇప్పుడామెను మరో అవకాశం వరించింది. తమిళ సిని ఇండస్ట్రిలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొంది, హీరోగా నటిస్తున్న అర్జున్ దాస్ సరసన శివాత్మిక హీరోయిన్ గా జతకడుతోంది. జెంబ్రియో పిక్చర్స్ బ్యానరు పై సుధా సుకుమార్ నిర్మించే ఈ చిత్రంలో కాళి వెంకట్ , నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిల నేరంగలిల్ సిల మణిదర్ గల్ ఫేం కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమలతో ప్రారంభించారు.
ఈ సందర్బంగా హీరో అర్జున్ దాస్ మాట్లాడుతూ ఈ సినిమా ఎంతో ఆసక్తికరంగా, ప్రేక్షకులకు ఆకట్టుకుటుందన్నారు. నాజర్ వంటి పెద్ద నటుడితో కలిసి పని చేయబోతున్నాను. సంగీత దర్శకుడు ఇమ్మాన్ అభిమానిని నేను..ఆయన సంగీతం అందించడం ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు మదురై వచ్చి కథ చెప్పారు. కథ విన్న వేంటనే నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. దర్శకుడిపై భారం వేసి ఆయనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదారిస్తారని భావిస్తున్నాను. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరాభిమానం దక్కాలని కోరుతున్నాను అన్నాడు అర్జున్ దాస్.. అర్జున్ దాస్ సరసన శివాత్మిక మంచి జోడిగా నిలిచే అవకాశముంది.
కుటుంబం
జీవిత, రాజశేఖర్ కుమార్తెలయిన శివానీ, శివాత్మిక తండ్రి బాటలోనే డాక్టర్ చదివి, ఆ తర్వాత యాక్టర్లుగా మారారు.. పెద్ద హీరోలు, హిట్ సినిమాల్లో నటించకపోయినా హీరో కూతురు అనే ట్యాగ్ లైన్ తోఅవకాశాలు దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
సోషల్ మీడియాలో…
అందం, అభినయానికి తోడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఫాలోయింగ్ తో క్రేజ్ పొందుతోంది ఈ స్టార్ కిడ్. మోడల్ డ్రెస్సులు, మిని డ్రెస్ లతో అందాలను చూపిస్తూ,కత్తుల్లాంటి చూపులతో కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది శివాత్మిక. స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి మూడేళ్లు అవుతుంది. తమ నటన తో తల్లిదండ్రలకు తగ్గ కూతురు అనే ముద్ర వేసుకున్నది శివాత్మిక . అర్జున్ దాస్ తో మూవీ శివాత్మికకు కలిసొస్తే.. ఇక ఇప్పట్లో తెలుగు ఇండస్ట్రీవైపు ఈ ముద్దుగుమ్మచూసే అవకాశం లేదు. Movie