SRK
లారెన్స్ బిష్ణోయ్.. ఈ పేరుచెబితే ఎంతటి వారన్నా వణికిపోవాల్సిందే.. జైల్లో ఉన్నా బయట సెలబ్రిటీలు భయపడుతున్నారంటే ఇతగాడి క్రిమినల్ గ్యాంగ్ ఎంతలా విస్తరించిందో అర్ధం చేసుకోవచ్చు..కరుడు గట్టిన ఈగ్యాంగ్ ఇతర రౌడీ గ్యాంగులతో తలపడుతూ నిత్యం సామాజిక హింసను ప్రేరేపిస్తుంటుంది. ప్రధాని నుంచి సెలబ్రిటీల వరకూ అందరికీ డెత్ త్రెట్స్ జారీ చేయగల ఖతర్నాక్ గ్యాంగు ఇది.బాలీవుడ్ సెలబ్రిటీలయితే బిష్ణోయ్ గ్యాంగ్ పేరు చెబితే వణకాల్సిందే.. ఈ మధ్యనే ప్రధాని మోడీని కూడా ఈ గ్యాంగ్ హెచ్చరించింది. ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు చంపేస్తామంటూ ఫోన్లు చేస్తూ కలవర పెడుతోంది బిష్ణోయ్ గ్యాంగ్.
హిందూమతం ఫాలోవర్ అయిన బిష్ణోయ్ బాలీవుడ్ ను తన బెదరింపులతో వణికిస్తుంటాడు. ఖాన్ల త్రయం నుంచి అమితాబ్ వరకూ ఎవ్వరినీ ఈ కరుడు గట్టిన ముఠా వదిలిపెట్టలేదు. అందరూ వీరికి భయపడిన వారే.. తాజాగా పఠాన్, జవాన్ సినిమాలు సూపర్ డూపర్ హిట్లు కావడంతో బాలీవుడ్ సెన్సేషన్ గా మారిన బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ ను లారెన్స్ గ్యాంగ్ బెదిరించింది. దాంతోమహారాష్ట్ర పోలీసులకు షారూక్ కంప్లయింట్ ఇచ్చాడు. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీని మంజూరు చేసింది. మరో నటుడు సల్మాన్ ఖాన్ ఇప్పటికే వైప్లస్ సెక్యూరిటీలో ఉన్నాడు.
వై ప్లస్ సెక్యూరిటీ అంటే … SRK
షారూక్ ను ఇక నుంచి నిరంతరం ఆరుగురు సాయుధ బాడీగార్డులు వెన్నంటి ఉంటారు. గతంలో ఇద్దరు బాడీ గార్డులు మాత్రమే ఉండేవారు. ఇకపై ఆరుగురు సాయుధులు ఆయన వెన్నంటే ఉంటారు. అయితే వీరి ఖర్చును మాత్రం షారూఖ్ భరించాల్సిందే.. వాస్తవానికి బాలీవుడ్ కు క్రిమినల్ గ్యాంగుల బెదిరింపులు చాలా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే షారూక్ భయపడలేదు. దశాబ్దం క్రితం ఓ షూటింగ్ స్పాట్ కు వచ్చిన క్రిమినల్ గ్యాంగ్స్ తక్షణం షూటింగ్ ఆపేయాలని , అడిగినంత మొత్తం ఇవ్వాలని లేకుంటే కాల్చేస్తామనీ బెదిరించింది. వారి బెదిరింపులకు కొంచెం కూడా షారూక్ బెదరలేదు.. నేన పఠాన్ వంశస్తుడిని. భయం నా బ్లడ్ లోనేలేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఎదురు తిరిగాడు. అప్పటినుంచి బాలీవుడ్ ను శాసిస్తున్న ఖాన్ త్రయం గ్యాంగ్ స్టర్ల టార్గెట్ గా మారారు.
ఎవరీ బిష్ణోయ్
పంజాబ్ లోని అబోహర్ ప్రాంతానికి చెందిన లారెన్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ అధ్యక్షుడు కూడా. పుట్టిన తేదీ, వయసుపై సరైన వివరాలు లేవు.. హిందూయీజంను ఫాలో అవుతాడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్.. వీరు బిష్ణోయ్ తెగకు చెందిన వారు. చిన్నప్పుడు సచ్ ఖండ్ కాన్వెంట్ లో చదివిన లారెన్స్ ఆ తర్వాత చండీగఢ్ లోని డీఏవీ కాలేజ్ లో చదివాడు. లీడర్ అవ్వాలన్న తపన ఎక్కువ. కాలేజీ ఎన్నికల వివాదాల్లో తలదూర్చేవాడు. అప్పట్లోనే ప్రత్యర్ధులతో గొడవలు పడ్డాడు.
హిందూ మతం ఫాలో అవుతున్నా పెళ్లి గిళ్లి సెంటిమెంట్లు లేవు.. ఒక గాళ్ ఫ్రెండ్ మాత్రం ఉండేది. మొదట్లో సమాజ సేవ చేస్తూ ఉండే బిష్ణోయ్ ఆతర్వాత గ్యాంగుల వెంట తిరుగుతూ చెడుదోవ తొక్కాడు. పంజాబ్ క్రిమినల్ గ్యాంగ్స్ లో తలదూర్చి ఆరితేరిన గ్యాంగ్ స్టర్ గా మారాడు.లారెన్స్ షార్ప్ షూటర్ కూడా.. భగత్ సింగ్ వీరాభిమాని కావడంతో గడ్డం పెంచుకుంటాడు.. లారెన్స్ సన్నిహితులు అతగాడిని ముద్దుగా డాన్ అని పిలుచుకుంటారు.
పేరుకే భగత్ సింగ్ ఫాలోయర్…
స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ ఫాలోయర్ నని చెప్పుకునే లారెన్స్ అనేక నేరాలకు పాల్పడ్డాడు.బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడటం అప్పట్లో సంచలనం రేపింది. అయితే కృష్ణ జింకలను తాము ప్రేమిస్తామని, వాటిని భగవస్వరూపంగా భావిస్తామని చెప్పే బిష్ణోయ్ సల్మాన్ తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశాడని కామెంట్ చేశాడు.. 2018లో సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటూ బెదిరించాడు.అప్పటినుంచి సల్మాన్ కూడా వై ప్లస్ సెక్యూరిటీలోనే ఉన్నాడు.వీళ్లే కాదు కరణ్ జోహార్, హనీసింగ్ ఇలా ప్రముఖులను బెదిరించి వసూళ్లకు పాల్పడటం రివాజుగా మారింది.
జైలు నుంచే ఆపరేషన్… SRK
బిష్ణోయ్ ప్రస్తుతం రాజస్థాన్ జైల్ లో ఉన్నాడు.ఫేమస్ పంజాబీ పాప్ సింగర్ సిద్దు మూసేవాలను లారెన్స్ గ్యాంగ్ కు చెందిన వారే గత ఏడాది హత్య చేశారు. లారెన్స్ గ్యాంగ్ కు కెనడాలో ఉన్న గ్యాంగ్ స్టర్లతో కూడా రిలేషన్స్ ఉన్నాయి. లారెన్స్ కు సన్నిహితుడైన గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్ స్టర్ సిద్దు మూసేవాలాను చంపేశానని అప్పట్లో ప్రకటించాడు.
(SRK)