ప్రస్తుతం చేతిలో మన దగ్గర డబ్బులు ఉంటే ఎక్కువగా బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేయడానికి ముగ్గు చూపుతాం లేదంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం చేస్తాం. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీల్లో కొత్త కొత్త స్కీమ్స్ కూడా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. ఏది ఏమైనా విద్య వైద్యం వివాహం వంటి అవసరాలను తీర్చేలా పెద్ద మొత్తంలో నగదు అందించే పథకాల కోసం మన అందరం ఎదురు చూస్తుంటాం.
ఎల్ఐసి సంస్థ ఆడపిల్లల కోసం ఒక ప్రత్యేకమైన స్కీంను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడపిల్లల విద్య వివాహ ఖర్చులకోసం ఆర్థిక తోడ్పాటు అందించేలా ఈ పాలసీని ఎల్ఐసి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పాలసీ బెనిఫిట్స్ ఏంటి ఫీచర్స్ ఏంటి? మెచ్యూరిటీ అయ్యాక చేతికి ఎంతకి వస్తాయో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.
ఆడపిల్లల ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొత్తగా తీసుకొచ్చిన ఈ పాలసీ పేరు “ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ”.ఈ పాలసీ ఆడపిల్లల కోసం మాత్రమే తీసుకువచ్చింది దేశీయంగానే కాకుండా ఎన్నారైల కు కూడా ఈ పాలసీ వర్తిస్తుంది.
ఈ పాలసీ ముఖ్య లక్షణాలు
1. ఆడపిల్లలకి కనీసం 1 సంవత్సరం వయస్సు ఉండాలి అలాగే ఈ పాలసీలో చేరదలుచుకున్న తల్లిదండ్రుల వయస్సు 18 ఏళ్ల నుండి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి.
2. ఇందులో మినిమం గ్యారెంటీ అమౌంట్ రూ.1 లక్ష రూపాయలు.
3. పాలసీ వ్యవధి 13 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది.
4. ప్రీమియం మొత్తాన్ని నెలకు కానీ, మూడు నెలలకు కానీ, ఆరు నెలలకు, కానీ లేదా సంవత్సరానికి ఒక్కసారి చెల్లించవచ్చు ,పైగా దీనిలో పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
5. పాలసీ లబ్ధిదారు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల రూపాయలు పరిహారం అందిస్తారు, అలాగే సహజ మరణం అయితే వారి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయలు చెల్లిస్తారు.
6. పాలసీదారు మరణించిన తర్వాత ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు పైగా కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం అందిస్తారు.
7. వరుసగా మూడు సంవత్సరాలు ప్రీమియం చెల్లించినట్లయితే లోన్ కూడా తీసుకోవచ్చు దీనిలో పాలసీ వ్యవధికి మూడు సంవత్సరాలకు ముందు వరకు మాత్రమే రిస్క్ కవరేజ్ ఉంటుంది.
ఉదాహరణ
ఈ పాలసీలో రోజుకు రూ.75 రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే 25 సంవత్సరాల తర్వాత రూ.14 లక్షల రూపాయలు రాబడి సొంతం చేసుకోవచ్చు. ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలు తెలియాలన్నా పూర్తి సమాచారం తెలుసుకోవాలన్న ఎల్ఐసి అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు లేదా మీ సమీపంలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్ కు వెళ్లి సంప్రదించండి.