సాధారణంగా మనం బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు వచ్చి అడుక్కుంటూ ఉంటారు . తమ ఇంట్లో ఆరోగ్యం బాగోలేదని, ఎక్కడో గుడి శుభ్రం చేస్తున్నామని డబ్బులు అడుగుతుంటారు. అయితే విమానంలో ఇంత అడిగే వారిని ఎప్పుడైనా చూశారా? పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల తన తోటి ప్రయాణికులను విమానంలో విరాళాలు అడిగాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి లేచి విరాళాలు అడిగాడు. “మేము మదర్సా నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నాము. మీరు డబ్బు ఇవ్వాలనుకుంటే మా దగ్గరకు రావలసిన అవసరం లేదు. నేను ని దగ్గరకు వస్తాను. నేను అడుక్కోవడం లేదు. దయచేసి సహాయం చేయండి” అని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఓ పాకిస్థానీ వ్యక్తి విమానంలో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
పాపులారిటీ కోసమే ఆ వ్యక్తి ఇలా చేశాడని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పాకిస్థానీ యూట్యూబర్ అక్తర్ లావా అని, రాజకీయ నాయకుడు మరియు వ్యాపారవేత్త అయిన లావా తన పాపులారిటీని పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నాడని కొందరు భావిస్తున్నారు. అయితే, ఈ వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని లక్షల మంది వీక్షించారు.