అక్కినేని ఫ్యామిలీకి హిట్ దొరికి చాలా కాలమైపోయింది. సంవత్సరం గ్యాప్ తరువాత కింగ్ నాగార్జున(NAG) పైనల్ గా రెండు కొత్త ప్రాజెక్ట్ ల ని ప్రకటించి అభిమానులను ఉత్సహాపరిచాడు. నాగార్జున 99వ సినిమాకు విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. నా సామిరంగ సినిమా లో హీరోగా, ధనుష్ సినిమా లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏడాది గ్యాప్ ను కవర్ చేస్తూ బిజీ షెడ్యూల్ షూట్ చేస్తున్నారు.
సినిమా టైటిల్ ఫిక్స్ చేసి ఓ వీడియోని రిలీజ్ చేసి అభిమానులకు కొత్త కిక్ ఇచ్చాడు మన్మధుడు నాగార్జున. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులలో జోష్ నింపేందుకు మూవీ టైటిల్ ఎనౌన్స్ చేశాడు నాగ్. అభిమానులను ఆనందాన్ని హైపర్ లోడ్ తో నింపాడు. సినిమా టైటిల్ నా సామిరంగ పేరు అభిమానులకు బాగా నచ్చేసింది.. ఇలా మాస్అపీల్ ఉన్న టైటిల్ అయితే నాగ్ కు సక్సెస్ వస్తుందని అభిమానుల నమ్మకం. గతంలో కూడా సోగ్గాడే చిన్నినాయన పేరు నాగ్ కు బాగా కలిసొచ్చింది.
ఇక బర్త్ డే స్పెషల్ వీడియోలో నాగ్ మాస్ లుక్ లో హాట్ గా కనిపించారు. దీంతో మన్మథుడి క్రేజ్ పెరిగింది. సీన్స్ చూస్తుంటే ఊర మాస్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉంటుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి.
నాసామిరంగా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సంక్రాంతి పండగకు మూవీని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు దర్శక నిర్మాతలు.. సాధారణంగా సంక్రాంతి పండగను నాగ్ఎప్పుడూ మిస్ చేసుకోరు. తన సినిమాలన్నీ దాదాపు సంక్రాంతికే విడుదల చేశారు. ఈసారి కూడా పొంగల్ రేస్ లో నాగ్ మూవీ ఉండబోతోందన్న ఊహే అభిమానులను ఆనందపరుస్తోంది. దీంతో కింగ్ ఫ్యాన్స్ లో పట్టలేని ఆనందం కనిపిస్తోంది..
డైరక్టర్ గా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ:
బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నవిజయ్ బిన్నీ నా సామిరంగ సినిమాను డైరక్ట్ చేస్తున్నారు.అస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ ఈసినిమాకు కథ అందించారు.అయితే నాగ్ సరసన హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇంకాసస్పెన్స్ కొనసాగుతోంది.
ధనుష్ సరసన నాగార్జున: (NAG)
99 వ చిత్రంగా నాసామిరంగ లో నటిస్తున్న నాగ్ తన వందో సినిమాను మాత్రం స్పెషల్ రోల్ పాత్ర పోషిస్తున్నాడు. తమిళ హీరో ధనుష్ హీరోగా వస్తున్న మూవీలో నాగార్జున ఓ స్పెషల్ రోల్ లో అలరించనున్నాడు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనుంది. ఇందులో నాగార్జున ది కీలకమైన రోల్. ధనుష్ హీరోగా,రష్మీక మందనా హీరోయిన్ గా, తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా నటించనున్నారు.
మన్మథుడు రీ రిలీజ్:
తమ అభిమాన హీరోని తెర పై చూసి చాలా కాలమైందనే లోటును తీర్చడానికి నాగార్జన బర్త్ డే రోజయిన,ఈరోజు మన్మథుడు సినిమాను రీ రిలీజ్ చేశారు. నాగ్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి ఇప్పటికీ తగ్గని క్రేజ్ ఉంది.