NANI
సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ సిని కెరీర్ లో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. నటించిన ప్రతి సినిమా నుంచి మంచి పేరును, హిట్ లను కూడా దక్కించుకున్నాడు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ కథలతో ఏ డైరెక్టర్ వచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకునే స్క్రిప్ట్ లతో ప్రతి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు నాని. ఇక డిసెంబర్ 7వ తేదిన హాయ్ నాన్న సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. నాని చేతి నిండా సినిమాలతో బిజీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఏకంగా ఐదుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నాడని సమాచారం.
సరిపోలేదా శనివారం NS31 మూవీ: NANI
త్వరలో నాని సరిపోలేదా శనివారం మూవీ షూటింగ్ లో బిజీ కాబోతున్నాడు. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను, నాని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మొత్తం సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో వీడియో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. నాని ఫస్ట్ లుక్ లో చేతికి ఉన్న సంకెళ్లను తెచ్చుకుంటూ రౌద్రంగా కనిపిస్తాడు. ఈ సినిమాలో సూర్య పాత్రలో నాని కనిపించబోతున్నాడు. టీజర్, నాని ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీజర్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మూవీ మీద అంచనాలను పెంచారు మేకర్స్. నాని జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. నాని హీరోగా నటిస్తున్న 31వ సినిమా సరిపోలేదా శనివారం. ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ గా డీవీవీ దానయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
శ్రీకాంత్ ఓదెల మూవీలో బిజీ
శ్రీకాంత్ ఓదెల కాంబోలో నాని మరొక మూవీ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో దసరా మూవీ వచ్చింది. సింగరేణి నేపథ్యంతలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వందకోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక శ్రీకాంత్ తదుపరి సినిమా కూడా నానితోనే చేయబోతున్నానని అనౌన్స్ చేశాడు.
నాని సిబి చక్రవర్తి కాంబో న్యూ మూవీ: NANI
సరిపోలేదా శనివారం సినిమా తరువాత తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి ప్రాజెక్టు ఒకటి మొదలు కాబోతోందట. హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి మొదలు పెట్టే ఛాన్స్ ఉందట.
సైంధవ్ మూవీ డైరెక్టర్ తో నాని మూవీ:
సైంధవ డైరెక్టర్ హిట్-3 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడు. హిట్-3 సినిమాకు శైలేష్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించబోతున్నాడు. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ జనవరి లేదా ఫిబ్రవరిలో రావచ్చు ఏమో వేచి చూడాలి.
బయటకు అనౌన్స్ చేయని మరొక రెండు మూవీస్: NANI
ఇలా చేతి నిండా వరస సినిమాలతో బిజీగా ఉన్న నాని ఇంకొక రెండు సినిమాలను అనౌన్స్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఈ సినిమా పేర్లను బయటకి రాకుండా నాని టీమ్ చాలా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది.