టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ హ్యపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తనదైన శైలీలో తెలుగు ప్రేక్షలను అలరిస్తున్నాడు ఈ యువ హీరో. తన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఈ మధ్యకాలంలో కార్తికేయ-2 సినిమాతో మన ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో హిట్ ను అందుకున్నాడు. హిట్ అందుకున్న నిఖిల్ తరువాత స్పై తో వచ్చి నిరాశను మిగిల్చడు. ఇక ఇప్పుడు చేతినిండ సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు ఈ యువ హీరో. ప్రస్తుతం మన ముందకు స్వయంభూ, ఇండియన్ హౌస్, కార్తికేయ-3 సినిమాలతో మన ముందుకు రానున్నాడు. లెటెస్ట్ గా ఈ యువ హీరో ఓ శుభ వార్తను తీసుకొని వచ్చాడు. ఈ వార్తతో అందరూ సంతోషపడుతున్నారు. అసలు ఏంటి ఆ వార్త?
నిఖిల్- పల్లవి తల్లితండ్రులు కాబోతున్నారా?
14 మే 2020 పల్లవి వర్మ, నిఖిల్ వీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వీరిది ప్రేమ వివాహం. నిఖిల్ పల్లవి ఇద్దరూ స్నేహితులు. కరోన టైంలో వీరి పెళ్లి నిబంధనలను పాటిస్తూ కొద్ది మంది బంధువులతో వీరి పెళ్లి జరిగింది. టాలీవుడ్ కమెడియన్ హర్ష ఇంట దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ వేడుకలో కొంతమంది సెలబ్రేటీస్, బంధుమిత్రలు హజరైయారు. ఆ పార్టీకి నిఖిల్, పల్లవి కూడా అటెండ్ అయ్యారు. వీరిద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ప్రతి ఒక్కరు అభినందనలంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఆ ఫోటోలు అంత శుభవార్త ఏమ్ ఉంది? విషయానికి వస్తే నిఖిల్ పల్లవి దిగిన ఫోటోల్లో పల్లవి బేబీ బంప్ తో కనిపించిందట. ఆమె ప్రేగన్సీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫోటోలను చూసిన ప్రేక్షకులు మాత్రం పల్లవి ప్రేగన్సీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మూడు సంవత్సరాల తరువాత శుభవార్త చెప్పారంటూ శుభాకాంక్షలు చేబుతున్నారు.
సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్ :
తనదైన స్టాల్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు నిఖిల్. తన కెరీర్ లో కార్తికేయ-2 సినిమాతో ప్రేక్షకులను బాగా దెగ్గరైయాడు.ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం నిఖిల్ 20వ సినిమా స్వయంభూ మూవీ టైటిల్ తో మన ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నిఖిల్ వారియర్ గా కనిపించబోతున్నాడు.సోషియో ఫాంటసీ డ్రామతో వందల ఏళ్ళ క్రితం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనుంది. పాతాళభైరవి, భైరవ దీపం సినిమా తరహాలో ఈ మూవీ రానుందట.
ఈ సినిమా కోసం నిఖిల్ చాలా కష్టపడుతున్నాడట. దాదాపుడా మూడు నెలల పాటు నిఖిల్ యుద్ధ విద్యలకు శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. కర్రసాము విద్యను అభ్యసిస్తున్నాడట నిఖిల్. ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక నిఖిల్ జోడిగా సంయుక్తామీనన్ నటిస్తుంది. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రానుంది.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు నిఖిల్.