వంట చేయాలి అంటే మనకందరికీ ముందు గా గుర్తొచ్చేది వంట నూనె అందులో ఎన్నో రకాల నూనెలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో రుచికరమైన వంటకాలు తయారు చేయడం కోసం నూనెను విపరీతంగా వాడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఏ వంటకం చేయాలన్నా ఆయిల్ తప్పనిసరిగా ఉండాల్సిందే, పొయ్యి వెలిగించాల్సిందే కదా. కానీ ఓ వ్యక్తి పొయ్యి వెలిగించకుండా.. నూనె ఉపయోగించకుండా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 2వేలకు పైగా వంటకాలు తయారు చేస్తున్నాడు. అది ఎలాగంటే..
“తమిళనాడు రాష్ట్రం కొయంబతుర్ కు చెందిన పడయాళ్ శివకుమార్ నమ్మాళ్వార్ భక్తుడు అంతే కాదు పూర్తి శాఖాహారి కూడా . ఈయనకు చిన్నప్పటి నుంచే వంటచేయడం అంటే చాలా ఇష్టం. నమాళ్వార్ .. కృత్రిమ పదార్థాలు వాడిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని సహజ పద్ధతిలో చేసిని ఫుడ్‌నే తింటారట . ఆయన బాటలోనే శివ పయనిస్తున్నాడు. ఇందుకోసం అతడు తంజావూర్, తిరుచ్చి, శివకాశి, కుంభకోణం ప్రాంతాల్లో పొయ్యితో పనిలేకుండా వంటలు వండేవారట.
పొయ్యి లేకుండ..నూనె వాడకుండా ..
ఈ సంగతి తెలుసుకున్న శివ.. వారి దగ్గరకు వెళ్లి ఏడాది పాటు శిక్షణ తీసుకుని, 30 రకాల వంటకాలు నూనె లేకుండా వాడటం నేర్చుకున్నాడు . తన పరిశోధనల ద్వారా శివ ప్రస్తుతం పొయ్యి వెలగకుండా, నూనె వాడకుండా సుమారు 2 వేల రకాల వంటకాలు కనిపెట్టాడు. ఇటీవలే కోయంబత్తూర్‌లో “పడయల్ నో ఆయిల్.. నో బాయిల్” అనే పేరు ఓ రెస్టారెంట్ కూడా ప్రారంభించాడు. ఆకు కూరలు, బియ్యం, పప్పు, సాంబార్, రసం, ధాన్యాలతో పాటు అనేక రకాల వంటకాలు చేస్తున్నాడు.
పొయ్యి లేకుండా శివ ఎలా వంట చేస్తాడంటే.. బియ్యాన్ని ఉడికించకుండా కొబ్బరి పాలలో నానబెట్టి తినడానికి వీలుగా తయారు చేస్తాడు. ఇక సాంబార్ విషయానికొస్తే.. పప్పును బాగా రుబ్బి అందులో బాదం, జీడిపప్పు మిక్స్ చేస్తాడు. ఈయన రెస్టారెంట్ కి రోజు కు 75 మంది వస్తారు. అయితే శివకుమార్ ఈ విద్యను ఇప్పటి వరకు 10వేల మందికి నేర్పించాడు. 2019లో 300 మంది విద్యార్థులతో 3గంటల 30నిమిషాల సమయంలో 300 రకాల వంటకాలని తయారు చేయించాడు. దీంతో శివకుమార్ పేరిట ఓ ప్రపంచ రికార్డు నమోదయ్యింది.”
Follow Us On : YouTube , Google News