పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ NTR31. ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ పాన్ వర్డల్ లో ఉండబోతుందని అంచనాలు వేస్తున్నారు ఫ్యాన్స్ .
ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ NTR31
NTR31 ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొస్తున్నాడు. నీల్ సినిమాలు మాములుగానే భారీగా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటాయి….. ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. గతంలోనే ఎన్టీఆర్ బర్త్ డే రోజునే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. రక్తంతో తడిచిన నేల మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఆయన నేల… ఆయన వారసత్వం మాత్రమే గుర్తుంటాయి…అతని రక్తం కాదు అంటూ రాసుకొచ్చాడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ బర్త్ డే రోజునా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అదిపోయే ట్వీస్ట్ ఇచ్చాడు. రీసెంట్ మూవీ స్టోరి ని లీక్ చేశాడు ప్రశాంత్ నీల్. ఈ అప్డేట్ తో ప్రేక్షకుల ఆనందానికి హద్దులు లేవు.
NTR31 షూటింగ్ 18 దేశాల్లో జరగబోతుందట
ప్రశాంత్ నీల్ డ్రీమ్ ఇండియా ప్రాజెక్ట్ ను ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రశాంత్ నీల్ NTR31 షూటింగ్ ని ఏకంగా 18 దేశాల్లో ప్లాన్ చేసాడట. దాదాపుగా సినిమా మొత్తన్ని ఓవర్సీస్ లోనే జరేగుతుందని సమచారం. ఇక ఫ్యాన్స్ మాత్రం ఈ అప్డేట్ లతో సినిమాను ఎప్పుడు థియేటర్ లో చూడాలంటు తెగ అతృతగా ఎదురుచూస్తున్నారు.
న్యూక్లియర్ డిజాస్టర్ తో కథాంశంతో NTR31మూవీ
కంప్లీట్ ఓవర్సీస్ షూటింగ్ తో పాటు NTR31 మరొక న్యూ అప్డేట్ ను తీసుకొని వచ్చాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ నేపథ్యంలో ఉండనుందట. ఉక్రెయిన్ లోని కీవ్ ప్రాంతంలో 37 ఏళ్లె క్రితం అంటే 26 ఏప్రిల్ 1986న న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది. ఈ డిజాస్టర్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. చెర్నోబిల్ నేపథ్యంలోనే ఈ కథని రాసుకున్నాడట ప్రశాంత్ నీల్. ఈ అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు.
అమితా బచ్చన్ విలన్ గా రాబోతున్నాడా?
ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ తను మరణించేలోపు అమితాబ్ బచ్చన్ తో ఒక సినిమా చేయాలనేది తన డ్రీం అని చెప్పుకొచ్చాడు. తన సినిమాలో విలన్ గా అమితాబ్ ను చూపించాలనేది ప్రశాంత్ కోరిక అని మాట్లాడాడు. తన కోరిక ఎప్పుడు నెరవేర్చుకోబోతున్నాడో చెప్పలేదు. NTR31మూవీ ప్రశాంత్ నీల్ డ్రీం ప్రాజెక్ట్ గా రానుంది. ఇక ఎన్టీఆర్ మూవీలో అమితాబ్ ను విలన్ గా చూపించమని….. మీ కోరిక, డ్రీం ప్రాజెక్ట్ రెండు నెరవెరుతాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారట. ఇక ప్రేక్షకుల కోరిక నెరవెరితే మాత్రం ఎన్టీఆర్ హీరోగా, అమితాబ్ ను విలన్ గా NTR31 మూవీ చూడొచ్చునేమో..