మొన్నదాయాదులను మట్టి కరిపించారు..నిన్నలంక సేనను దారుణంగా ఓడించారు. అందుకే ఈసారి వన్డే(oneday) ర్యాంకింగ్స్ లో టీమిండియా కు చెందిన ఐదుగురు ఆటగాళ్లు చోటు సంపాదించారు. టాప్ బ్యాట్స్ మెన్ జాబితాలో ముగ్గురు ఆటగాళ్లు ఉండగా, బౌలర్ల జాబితాలో ఇద్దరు భారత ఆటగాళ్లు ఉన్నారు. ఆసియా కప్‌లో అదరగొడుతూ, ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ముఖ్యంగా విరాట్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్లు. టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. దీంతో మొత్తంగా వన్డే బ్యాటర్స్ జాబితాలో ముగ్గురు భారత్ నుంచి ఉన్నారు. బౌలింగ్ లో ఇద్దరు ఉన్నారు.
శ్రీలంక వేదికగా జరుగుతోన్న ఆసియా కప్‌లో టీమిండియా ప్లేయర్లు సత్తా చాటారు. దీంతో తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ల కొత్త ర్యాంకింగ్ జాబితాలోనూ తమ సత్తా చూపించారు. కొత్త ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే, మరోవైపు టీం ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన కెరీర్లోనే బెస్ట్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆసియా కప్‌లో నేపాల్, పాకిస్థాన్‌లపై హాఫ్ సెంచరీలు సాధించిన గిల్.. ఇప్పుడు వన్డే ర్యాంకింగ్స్‌లో మూడోవ స్థానం నుంచి రెండవ స్థానానికి ఎగబాకాడు. అలాగే గతేడాది టాప్ 10లో చివరి స్థానంలో కనిపించిన విరాట్ కోహ్లీ ఈసారి రెండు స్థానాలు ఎగబాకాడు. అలాగే రోహిత్ శర్మ కూడా టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడంలో 11వ స్థానం నుంచి 9వ స్థానంకి చేరుకున్నాడు.
ఐసీసీ బౌలర్ల టాప్ 10 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియాకు చెందిన ఇద్దరు బౌలర్లు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏడో స్థానంలో నిలిచాడు.. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లను, శ్రీలంకపై నాలుగు వికెట్లు కుల్ దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఎడమచేతి వాటం స్పిన్నర్ గా పది వ ర్యాంక్ కి చేరగలిగాడు. కాగా, టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తన తొమ్మిదోవ స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబూషేన్ అగ్రస్థానంలో ఉన్నాడు. కమిన్స్ బౌలింగ్ విభాగంలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో బ్యాటింగ్ విభాగంలో లో ఇద్దరు భారత ఆటగాళ్లున్నారు. రిషభ్ పంత్ ఆరో స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ పదో స్థానంలో నిలిచాడు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉండగా అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు.
ఐసిసి వన్డే(oneday) ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ బ్యాట్స్ మెన్ జాబితా ఇదే…
టాప్ టెన్ | ఆటగాడు | పాయింట్లు |
1 | బాబర్ ఆజామ్ (పాకిస్తాన్) | 863 |
2 | శుభమన్ గిల్ (భారత్) | 759 |
3 | వాన్ డర్ డస్సెన్ (సౌతాఫ్తికా) | 745 |
4 | డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) | 739 |
5 | ఇమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్) | 735 |
6 | హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) | 726 |
7 | క్వింటన్ డికాకి (సౌతాఫ్రికా) | 721 |
8 | విరాట్ కోహ్లీ (భారత్) | 715 |
9 | రోహిత్ శర్మ (భారత్) | 707 |
10 | ఫఖర్ జమాన్ (పాకిస్థాన్) | 705 |