బొప్పాయి పండు (PAPPAYA) … ఇది తెలియని వారు ఎవరూ ఉండరు. చాలా మంది దీనిని ఎక్కువగా ఇష్టపడరు. కానీ ఇది ఆరోగ్యనికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా అడవారి ఆరోగ్యం కాపాడుకోవడంలో బొప్పాయి అమ్మలాంటిదని అంటారు. ఈ పండులోవున్నన్ని విటమిన్లు, పోషకాలు మరెందులోను లేవు. ఈ పండుని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలనైనా దరి చేరనివ్వదు. శరీరంలోని మలినాలను తోలగించడంలో మంచి గుణాన్ని చూపిస్తుంది. దీనిని వారానికి ఒకసారైనా తినడం మన ఆరోగ్యనికి చాలా మంచిది.
బొప్పాయిలోని పోషకాలు (PAPPAYA)
బొప్పాయి పండులో కాలరీలు తక్కువగానూ, కొవ్వుపదార్థాలు, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉంటాయి.వీటితో పాటుగా విటమిన్ బి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ డి కూడా కలిగి ఉంటుంది. ఇంకా దీనిలో పొటాషియం, మినరల్స్, ప్లేవనాయిడ్స్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి పొషకాలు కూడా ఉంటాయి. బొప్పాయి పండు తినడం వల్ల ప్లేట్ లేట్స్ వేగంగా పెరుగుతాయి. అందుకే బొప్పాయిని ఇమ్యునిటీ బూష్టర్ అని కూడా అంటారు.
బొప్పాయి పండు ఉపయోగాలు
ఆహారంలో తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కరోనా కష్టకాలంలో ఈ పండు ఇమ్యునిటి బూస్టర్ గా బాగా ఉపయోగపడింది. ఈ పండు అన్నీ కాలాల్లో దొరుకుతుంది. రోజు భోజనం తరువాత దీన్ని తింటే మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పొట్ట ప్రేగుల్లో ఉండే అనేక రకాల విష వ్యర్ధాలను తొలగిస్తుంది. దీనిని తినడం వల్ల కళ్లు చల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి. బీపీ, షూగర్ ఉన్నవాళ్లు కూడా బొప్పాయిని తింటే చాలా మంచిది. దీనిని తినడం వల్ల ఎర్ర రక్తణాలు పెరుగుతాయి.వైరల్ ఫీవర్ లు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఇది మనల్ని కాపాడుతుంది. ఈ పండు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. బొప్పాయి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె సంబంధిత కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా పని చేసేలా చేస్తుంది. ఎముకల గట్టిదనానికి కూడా బాగా మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల నోటి సంబంధ సమస్యల నుండి ఉపశమనం దొరుకుతుంది. దంతాలు, చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి.. నోటి పూత, తెల్లటి మచ్చలు, పెదాల పగుళ్ళు వంటివి రాకుండా చేస్తాయి. బొప్పాయిని ప్రెగ్నెన్సీ తో ఉన్నవారు అస్సలు తినకూడదు. దీని వలన విపరీతమైన వేడి చేస్తుంది. అందువలన ప్రెగ్నెన్సీ మహిళలు తింటే చాలా గర్భస్రావం అయ్యే అవకాశాలుంటాయి.
బొప్పాయితో బ్యూటీ స్కిన్ (PAPPAYA)
బొప్పాయిని మన ఆహారంలో తీసుకోవడం వల్ల మన చర్మ సౌందర్యనికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల మన స్కిన్ సున్నితంగా, మృదువుగా, కోమలంగా మారడానికి మంచిగా ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యంతో పాటుగా జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. బొప్పాయితో ఫేస్ మాస్క్ వేసుకున్న, హెయిర్ మాస్క్ వేసుకున్న ముఖం మరియు జుట్టు ఎంతో అందంగా, నిగారింపుగా కనిపిస్తాయి. చుండ్రుని తగ్గిస్తుంది. ఇది చర్మన్ని కాంతివంతంగా చేసి చర్మం ముడతలను తగ్గిస్తుంది. ఈ పండు ముక్కలను తినడం వల్ల బరువు తగ్గుతారు.