ఆప్ ఎంపీని పెళ్ళి చేసుకున్న బ్యూటీ క్వీన్ పరిణితీ (Parinithi) చోప్రా ప్రస్తుతం అత్తవారింట అడుగు పెట్టిన మూమెంట్స్ ను హాయిగా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి తర్వాత జరిగే ప్రతీ ఈవెంట్ ను మినిట్ టు మినిట్ సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులకు పండగ చేస్తోంది. కొన్నాళ్లక్రితం రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలెస్ లో పరిమితమైన బంధుగణం, స్నేహితుల మధ్య ఈ జంట ఒక్కటయ్యింది. పెళ్లి వేడుకను అట్టహాసంగా నిర్వహించారు.తాజాగా పరిణీతి తన అత్తగారి ఇంట కాలు పెట్టిన వీడయోను షేర్ చేసింది. కొత్త కోడలు గృహ ప్రవేశం సందర్భంగా అక్కడి ఆచార వ్యవహారాలను కూడా పరిణతి ఆ వీడియోలో చూపించింది. కొత్త జంటను బంధుగణం ఆటపట్టిస్తూ , ఎన్నో వేడుకలను నిర్వహించారు.
ఆనంద క్షణాలను షేర్ చేసిన పరిణితి (Parinithi)
ఆ ఆనందాల క్షణాలను షేర్ చేసిన పరిణీతి కొత్త కోడలు తల్లి జీవితంలో ఆనందాన్ని తెచ్చే వెలుగు.. ఇంతటి అద్భతమైన స్వాగతాన్ని నేను ఎప్పుడు చూడలేదు… నాకు ఇష్టమైన ధోల్, డెకర్ ని ప్లాన్ చేసి ఎంతగానో ఉత్సహపరిచారంటూ పేర్కొంది. చద్దా కుటుంబం నన్ను రాణిలా చూస్తున్నారంటూ వీడియో కింద తన అభిప్రాయాన్ని షేర్ చేసింది.
చిలిపి చేష్టలు.. కొంటె ప్రశ్నలు
కొత్త జంటను ఆట పట్టిస్తూ ఎన్నో చిలిపి ప్రశ్నలు అడిగి వాటికి కొంటె జవాబులు చెప్పించారు బంధుగణం. నువ్వు డెసిషన్ మేకర్ వా ట్రైనీవా అన్న ప్రశ్నకు తాను ట్రైనీనేనంటూ వినయంగా రిప్లయ్ ఇచ్చింది పరిణీతి. మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పారు అనే ప్రశ్నకి పరిణితి తానే ముందు ప్రపోజ్ చేశాను అని చెప్పింది. పెళ్లి తర్వాత పరిణీతికి జీవితంలో సహయం చేస్తు ప్రోత్సహిస్తావా లేక తనతో పోటీ పడతావా అంటూ రాఘవ్ ని అడిగారు. నేను మొదట సహయం చేస్తాను.. ఆ తర్వాత ప్రోత్సహిస్తాను ..తరువాత తనతో పోటి పడతాను అన్నాడు చడ్డా. ఇద్దరిలో ఎవరు నవ్విస్తూ ఉంటారు అనే దానికి ఇద్దరి సమాధానం ఒకటే వచ్చింది. ఇంకెవరు? పరిణితినే అని.. పరిణితితో ఇప్పుడు నువ్వు చద్దా కి సొంతం అయ్యావు అన్నాడు రాఘవ్. నేను రాజుకి రాణిగా ప్రపంచంలోనే అత్యుత్తమ కుటుంబంలోకి కోడలి గా అడుగు పెట్టాను అంది పరిణీతి. కొత్త జంట హంగామా అందరినీ ఆకట్టుకుంది.
స్పెషల్ థ్యాంక్స్ (Parinithi)
బంధుమిత్రులకు వారి ఫ్యాన్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కొత్త జంట ఒక నోట్ ను అందరితో పంచుకున్నారు. మీరు చూపించిన ప్రేమకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ కామెంట్లకు మేము స్పందించే అవకాశం లేకపోవచ్చు…… మా కష్ట జీవితంలో కూడా మాకు మీరు ఎంతో సపోర్ట్ చేశారు. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నాం అని రాశారు.
పెళ్లి ఫోటోకి క్యాప్షన్
వివాహ బంధంతో ఒక్కటైన పరిణితి-రాఘవ్ చద్దా వారి మొదటి వివాహ ఫోటోలను ఇన్ స్ట్రాలో షేర్ చేశారు. చాలా కాలంగా ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము చివరకు మిస్టర్ అండ్ మిసెస్ గా మారాము… ఒకరు లేకుండా మరొకరం జీవించలేం అని క్యాప్షన్ పెట్టారు. వీరి పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రస్తుతం ఈ జంట బాలీవుడ్ ట్రెండింగ్ కపుల్ గా మారారు. (Parinithi)