జనసేన అధినేత పవన్ కల్యాణ్ (PK) తీరుపై ఆ పార్టీ నేతలు సంతృప్తిగా ఉన్నా.. కామన్ పబ్లిక్ మాత్రం సంతృప్తిగాలేరు..కారణం ఆయన రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొన్ని అంశాలపైనే నోరువిప్పి హడావుడి చేయడం మరికొన్ని అంశాలను చూసీ చూడనట్లు వదిలేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలను,జగన్ను టార్గెట్ చేస్తూ దారుణమైన విమర్శలకు పాల్పడే పవన్ అవినీతికి కేరాఫ్ జగన్ సర్కార్ అని ఫైర్ అయిపోతూ ఉంటారు.తెగ ఆవేశపడుతుంటారు. అసలు జగన్ గురించి విమర్శించమంటే పవన్లో కలిగే వీరావేశం అంతా ఇంతా కాదు.. అవినీతిని ఎక్కడున్నా కూకటి వేళ్లతో పెకలించాలి. జగన్ సర్కార్ ను ఇంటికి పంపనిదే నిద్రపోను అంటూ వారాహీ పై నుంచి ఆవేశ పూరిత ప్రసంగాలు చేశారు పవర్ స్టార్. నిజమే..జగన్ సర్కార్ అవినీతిని ఎండగట్టాల్సిందే..తాను 14 ఏళ్లు పోరాటం చేసినా తమ పార్టీకి ఉనికి కూడా లేకుండా పోవడం సీఎం అభ్యర్ధి, పైగా ఓ పార్టీ నాయకుడుగా ఉన్న పవన్ ను బాధిస్తుండొచ్చు..ప్రత్యర్ధి మీద కసిని కూడా పెంచుతూ ఉండొచ్చు.. అదే సమయంలో ఒకవైపే చూడు..రెండో వైపు చూడకు అన్న బాలయ్య డైలాగ్ లాగా కేవలం వైసీపీని మాత్రమే విమర్శిస్తూ జనాలకి బోర్ కొట్టిస్తున్నారు జన సేనాని.
బాబు అవినీతి ఆరోపణలపై మౌనమేల? (PK)
అవినీతిపై పవన్ ది సెలక్టివ్ పోరేనంటున్నారు వైసీపీ అభిమానులు.. కారణం చంద్రబాబు పై అవినీతి ఆరోపణలు వెలుగు చూసి అప్పుడే ఐదారు రోజులవుతోంది. అమరావతి నిర్మాణాలలో స్కాం జరిగిందని సాక్ష్యాధారాలతో సహా ఐటీ,ఆర్థిక శాఖలే నోటీసులిచ్చాయి. దాదాపు 118 కోట్ల విలువైన సొమ్ము చేతులు మారేందుకు చంద్రబాబే కర్త,కర్మ,క్రియఅనిప్రాధమిక విచారణలో తేలిందటూ ఐటీ అధికారులు కూడా శెలవిచ్చారు.
రాష్ట్రంలో ఈ రెండు మూడు రోజుల్లో అతిపెద్ద సంచలన వార్త ఏదైనా ఉందీ అంటే అది చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలే. దీనిపై పవన్ కల్యాణ్ అసలు స్పందించకుండా, మౌనం దాల్చడం విచిత్రం.. పుంగనూరులో టీడీపీ శ్రేణులకు పోలీసుల కు మధ్య జరిగిన ఘర్షణ ఓ పోలీస్ కళ్లు పోడానికి కారణమైంది. పోలీసు అన్నా, జవాన్ అన్నా తనకు గౌరవం ఎక్కువ అనే పవన్ పుంగనూరు ఘర్షణల్లో టీడీపీని తప్పుబట్టే సాహసం కూడా చేయలేకపోయారు. పోలీసులకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చి తానొక రూట్ లో పట్టణంలోకి ప్రవేశించి ఘర్షణకు మూలకారకుడైన బాబు తీరును తప్పుబట్టలేదు.ఇలా ఏవిషయం చూసినా పవన్ చంద్రబాబుకి అనుకూలంగానే వ్యవహరిస్తారు.
దెబ్బ తిన్నా అదే పంథా.. ఇక మారరా?
చంద్రబాబును సమర్ధిస్తున్నట్లు నేరుగా చెప్పరు..కానీ ప్రతీ విషయంలోనూ చంద్రబాబుకు అనుకూలంగానే పవన్ వైఖరి,తీరు ఉంటుంది.టీడీపీతో చేతులు కలుపుతామని బాహాటంగా చెప్పరు..కానీ ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వం అని మాత్రం అంటుంటారు.. గత ఎన్నికల్లో ఇలాటి వైఖరి తీసుకోవడమే పవన్ పుట్టి ముంచింది. రెండు చోట్ల పోటీ చేసినా ఎక్కడా గెలవకపోడానికి ఇదే కారణం.అయినా మళ్లీ అదే పంథా కొనసాగిస్తున్నారు.. తెలుగు దేశాన్నేసమర్ధించేటట్టయితే ఇక పార్టీ ఎందుకు?టీడీపీలోనే జాయిన్ అయిపోవచ్చుగా? పోనీ సైద్ధాంతిక విభేదాలున్నాయనుకుంటే ఆవిభేదాలేంటో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా పవన్ చెప్పగలిగారా?13 ఏళ్ల పార్టీ ప్రయాణంలో ఏనాడైనా చంద్రబాబు తప్పులను ఒక్కసారైన బాహాటంగా విమర్శించారా? ఇందుకు కదా వైసీపీవాళ్లు దత్తపుత్రుడు అని విమర్శలు చేసేది.
ఒక వైపే చూపెందుకు?
నికార్సయిన నాయకుడంటే చంద్రబాబు అయినా, జగన్ అయినా అవినీతి జరిగితే ఖండించాల్సిందే.తీవ్రంగా విమర్శించాల్సిందే.కానీ పవన్ (PK) మాత్రం ఒకవైపే చూస్తుంటారు.. ఆయనకు జగన్ ప్రభుత్వంలో అన్నీలోపాలే కనిపిస్తాయి.ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి నిర్ణయం కనపడదు.అదే సమయంలో చంద్రబాబు పాలనలో ఒక్కటంటే ఒక్కటి తప్పు కూడా కనపడదు.ఇదెక్కడి తీరు? పారదర్శక రాజకీయాలు చేస్తామని చెప్పే జనసేనాని ఇంత పార్శ్వ,పక్షపాత దృష్టితో వ్యవహరించడం ఏంటన్నది తటస్థులు సంధిస్తున్నప్రశ్న.
(PK)
చంద్రబాబును సమర్ధించదలచుకుంటే ఆ పని ఓపెన్ గానే పవన్ ఎందుకు చేయరన్నది తటస్థుల ప్రశ్న.. ఇద్దరూ కలసి ఎన్నికలకు వెళితే తప్పేముంది? భావ సారూప్యత, సైద్ధాంతిక సారూప్యత కుదిరితే ఇద్దరూ కలసి పోటీ చేయడంలో తప్పు లేదు.. పోనీ అని చంద్రబాబు పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఫేక్ అనికూడా కొట్టి పారేయరు.ఇలా.. కనిపించీ, కనిపించకుండా, వినిపించీ వినిపించకుండా పవన్ చేస్తున్న రాజకీయాలు చూసే ప్యాకేజ్ స్టార్.. అందుకే మాట్లాడటంలేదు అన్న ఆరోపణలు బలపడుతున్నాయి.రాజకీయాలంటే వైరిపక్షాన్ని సమయం, సందర్భం లేకుండా అంశాలకు అతీతంగా తెగ తిట్టి పోయడం కాదు.. ఎవరు తప్పు చేసినా తప్పని చెప్పగలగాలి.రాజకీయ నాయకుడంటే అన్ని అంశాలపైనా తన అభిప్రాయాలను చెప్పగలగాలి.. ఇలాంటి అవగాహనలేని పాలిటిక్స్ ఇంకెన్నాళ్లు పవన్?