మానవ ఆరోగ్యానికి హానికలిగించే ప్లాస్టిక్ వాటర్ క్యాన్లు……(plastic)
(plastic)
నీరు మనిషికి ప్రధాన జీవనాధారం. పూర్వ కాలంలో నీళ్లను కుండలో ఉంచి తాగేవారు. ఆ తర్వాత స్టీల్ బిందెలు
వచ్చాయి. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది. ప్రస్తుతం మనం ఎటు వెళ్లినా నీళ్లను ప్లాస్టిక్ బాటిళ్లో తీసుకెళ్తున్నాం. ఇంట్లో
ఉన్న కూడా బాటిళ్లనే వాడుతున్నాం. అయితే ఇలా ప్లాస్లిక్ బాటిల్స్‌లోని నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత
మంచిదికాదని విష్లేషకులు చెబుతున్నారు. వాటర్ క్యాన్ల నీరు తాగడం అన్నది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం
మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పు వుంటుంది అని నిపుణులు అంటున్నారు.
ఇప్పుడు తాగునీటీ అవసరాలకోసం 20 లీటర్ వాటర్ క్యాన్ లపై గ్రామస్ధాయి నుండి పట్టణస్ధాయి వరకు ప్రజలు
అధారపడుతున్నారు. ప్లాస్టిక్ ఒక పాలిమర్ అని ఇందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరైడ్ ఉంటాయని గుర్తు
చేస్తున్నారు. ఇవి కాకుండా ప్లాస్టిక్‌లో బీపీ అనే రసాయనం ఉంటుందట. ఇది మన శరీరానికి చాలా హానికరమని
హెచ్చరిస్తున్నారు.
వాటర్ క్యాన్లులో నీరు వాడడం వల్ల…. (plastic)
ప్లాస్టిక్ వాటర్ క్యాన్లను ఉపయోగించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా జీర్ణ
సమస్యలు, హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్ మరియు PCOS వంటి పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఈ నీరు తాగడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది. ప్లాస్టిక్ నుండి వెలువడే
రసాయనాలు శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్ధకు భంగం కలిగిస్తాయి. ప్లాస్టిక్ వాటర్ క్యాన్లకు సూర్యరశ్మి వేడి
తగలటం వల్ల డయాక్సిన్ అనే హానికరమైన టాక్సిన్ విడుదల అవుతుంది, దీనిని తీసుకోవడం వల్ల రొమ్ము
క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
కాలేయ క్యాన్సర్, స్పెర్మ్ కౌంట్ తగ్గటం…
ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో థాలేట్స్ అనే రసాయనం ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటిలోని నీటిని తీసుకోవడం వల్ల
కాలేయ క్యాన్సర్ ,స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. క్యాన్సర్ కు కారణమవుతుంది. రక్తప్రవాహంలోకి ప్రవేశించగల BPA
వంటి పదార్థాలు కణాలకు హాని కలిగించడానికి చాలా సమయం పట్టవచ్చని కొన్ని అధ్యయనాలు
సూచిస్తున్నాయి. మధుమేహం, ఊబకాయం, సంతానోత్పత్తి సమస్యలు, బాలికల్లో యుక్త వయసులో అనేక
ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో నీటిని నిల్వ ఉంచుకోవడం, తాగడం మానుకోవాలి.
హానికలిగించే బిస్ఫినాల్ అనే రసాయనం… (plastic)
ప్లాస్టిక్ వాటర్ క్యాన్లు బిస్ఫినాల్ A BPA అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఈస్ట్రోజెన్ పై ప్రభావాన్ని
చూపిస్తుంది. మధుమేహం, ఊబకాయం, సంతానోత్పత్తి సమస్యలు, బాలికలలో యుక్తవయస్సులో అనేక ఆరోగ్య
సమస్యలకు కారణమవుతుంది. అందుకే ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో నీటిని నిల్వ ఉంచుకోవడం, త్రాగడం మానుకోవడం
మంచిది. ఈ నీటిని తాగడం వల్ల తక్కువ వయసులోనే మోకాళ్ల నొప్పులు వస్తాయట.
పర్యావరణంపై ప్లాస్టిక్ ప్రభావం…
ప్లాస్టిక్ శతాబ్దాలుగా విచ్ఛిన్నం కాకుండా ఉండే లక్షణం కలిగి ఉండటం వల్ల పర్యావరణానికి హానికరంగా మారింది.
నీటి నిల్వ కోసం ఉపయోగిస్తున్న ఈ కంటైనర్లను పాతవిగా మారటం వల్ల వ్యర్ధాలుగా పారేస్తున్నారు. ఇవన్నీ జల
జీవావరణ వ్యవస్థలు కాలుష్యం కావటానికి కారణమవుతున్నాయి. వన్యప్రాణులు , సహజ సమతుల్యతకు
ముప్పు గా మారుతున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను వెదజల్లుతున్నాయి.
ఈ ప్రమాదాల నుంచి మనం గట్టేక్కలాంటే…
మామూలు ఏ నీరైనా సరే దానిని కాచి చల్లార్చి రాగి పాత్రల్లో కానీ, కుండలో పోసి ఆ నీరు తాగితే మంచిదని
చెబుతున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా రాగి పాత్రలు వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
తప్పనిసరిగా ప్లాస్టిక్ బాటిళ్లు ఉపయోగించుకోవాల్సి వస్తే ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్‌ను వాడాలని
నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలోని అన్నీ జీవిక్రియలకు నీరే ఆధారం.