తన పుట్టిన రోజును అభిమానులకు పండగ రోజు చేశాడు పవర్ స్టార్ PSPK . సెప్టెంబర్ 2 అంటే పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే డే. అభిమానులు కేక్ కట్ చేసి పవన్ చిత్రానికి పాలభిషేకాలు చేస్తూ, పండగ చేసుకునే రోజు ఈ రోజు. పవన్ బర్త్ డే సందర్బంగా ఒకే రోజు మూడు సర్ ప్త్రెజ్ లతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు నిర్మాతలు. పవన్ నటించే మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒకేసారి ఇవ్వడం సంచలనంగా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరి హరవీరమల్లు సినిమాల షూటింగ్ లతో దూసుకుపోతున్నాడు పవన్. అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు కావడంతో పవన్ సినిమాల్లో మిగతా హీరోలకంటే వెనకపడ్డాడు. పైగా భిన్నమైన కథాంశాలను ఎంచుకోవడంతో అందరికన్నా తక్కువ మూవీస్ చేశాడు పవన్. కెరీర్ లో ఇప్పటి వరకూ కనీసం 30 సినిమాలు కూడా పూర్తి కాలేదు.
ఓజీ…. PSPK
ఓజీ గ్లింప్స్ లో పవన్ చురకత్తులాంటి చూపుతో, వేటాడే సింహలా, ఆకలిగొన్నపులి లా, జింకను వేటాడి చంపిన చిరుతలా కనిపించాడు. అభిమానులకు పూనకాలు వచ్చే రేంజ్ లో హంగ్రీ చీతా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఒకే సారి మూడు సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు పవర్ స్టార్.
పోతుంటే గ్లింప్స్ మొత్తం వేటాడే సింహం బరిలో దిగితే ఎలా ఉంటది అలా కనిపించాడు పవన్.ఆయన లుక్స్, చీతా లాంటి కళ్లు, ఒక్కొక్కరిని నరుక్కుంటూ పోతున్నట్లుగా రక్తపాతాన్ని ఎక్కువ చూపించారు.. ఇప్పటి వరకు చూడని పవన్ విశ్వరూపాన్ని ఇందులో చూపించాడు దర్శకుడు సుజిత్. చిరుత వేట ను తలపించేదిగా ఉంది పవన్ యాక్టింగ్. పవన్ లుక్స్, వయలెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు ఊహించని రేంజ్ లో ఎంతో పవర్ ప్యాక్ తో ప్రేక్షకులను గుక్క తిప్పుకోనివ్వకుండా చేశాయ్.
ఓజీ కథాంశం ఇదేనా !
1990 నాటి ముంబయి మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపోందుతోంది. పదేళ్ల క్రితం ముంబై లో వచ్చిన తుఫాన్ గుర్తుందా..అది మట్టి , చెట్లతో పాటు సగం ఊరును ఊడ్చేసింది. కానీ వాడు నరికిన రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుపాన్ కడగలేకపోయింది. ఇట్ వజ్ ఏ ఫ్రీకింగ్ బ్లడ్ పాత్ అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే సాలా సైతన్ అంటూ పవన్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ అదరహో అనిపించింది. పవన్ ఎలివేషన్ కి తమన్ అందించిన మ్యూజిక్ బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో ఉన్నాయి. ఈ రోజు పవన్ లుక్ సోషల్ మీడియాని రికార్డు స్థాయిలో షేక్ చేస్తుంది. ఓజీ గ్లింప్స్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. గ్లింప్స్ విడుదల చేసిన 20 నిమిషాల్లోనే 200 కె వ్యూస్ ని సొంతం చేసుకుంది.
ఇది ఇక్కడితో ఆగదు.మరో రికార్డ్ ఖాయం అంటూ సంబరాలు చేసుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్.
సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రలో మాస్ యాక్షన్ తో పవన్ అందరిని అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిగా నటించనుంది.
సినిమాకు ఆర్ ఆర్ ఆర్ దానయ్య డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు.
హరి హర వీరమల్లు PSPK
హరి హర వీరమల్లు సినిమా నుంచి ఈ రోజు ఒక పోస్టర్ రిలీజ్ అయ్యింది.
హరిహర వీరమల్లు సినిమాలో పవన్ లుక్స్ ఓ పోరాట యోధుడిగా పవర్ పుల్ లుక్ లో కనిపిస్తున్నాడు.. 17వ శతాబ్దం నాటి మొఘల్ ఎంపైర్ నేపథ్యంలో కుతుబ్ షాహీలకు సంబంధించిన చారిత్రక కథాంశంతో ఈ సినిమా రానుంది.
మొఘలులకు వ్యతిరేకంగా పోరాడిన రాబిన్ హుడ్ లాంటి ఓ పోరాట యోధుడి కథతో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తోంది.