పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(PSPK) ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు.. ఏపీలో ఇంత బిజీయస్ట్ లీడర్ కమ్ యాక్టర్ ఎవరు లేరని చెప్పోచ్చు. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ క్రేజ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పవలిసిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు సినిమాలలో నటిస్తున్నాడు. పవన్ నటిస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న సినిమా ఓజీ అనే చెప్పాలి. రీసెంట్ గా ఓజీ మూవీ అప్డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.లేటెస్ట్ గా ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్న రవిచంద్రన్, మ్యూజిక్ డైరక్టర్ తమన్ తో కలిసి ఒక ఫోటోని షేర్ చేశారు మూవీ బృందం.
ఓజీ నుంచి అతి త్వరలోనే న్యూస్ రాబోతుంది అంటూ లీక్ ఇచ్చారు మేకర్స్…దీంతో ఈ సారి ఏం ప్లాన్ చేస్తున్నారో ఎప్పుడు అప్డేట్ ఇస్తారో అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓజీ మొదటి 50 శాతం షూటింగ్ చాలా త్వరగా పూర్తి కాగా ఆ తర్వాత పవన్ రాజకీయ టూర్ నేపథ్యంలో వాయిదా పడింది. ఇక ఈ మధ్యనే మళ్లీ షూట్ స్టార్ట్ చేసి శరవేగంగా జరుగుతుంది. ఓజీ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది.
పవర్ ఫుల్ రోల్ లో పవన్ (PSPK)
ఇప్పటికే రిలీజ్ అయినా ఓజీ సినిమా గ్లింప్స్ లో పవన్ గ్యాంగ్ స్టర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నట్లు అర్థం అయింది. గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న పవన్ గురించి ఫ్యాన్స్ కు అంచనాలు పెంచేశారు మేకర్స్. రిలీజ్ అయిన్ గ్లింప్స్ కి అర్జున్ దాస్ వాయిస్ అందించాడు.
ఈ ఒక్క డైలాగ్ చాలు…
1990 నాటి ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపోందుతోంది. పదేళ్ల క్రితం బాంబేయ్ లో వచ్చిన తుఫాన్ గుర్తుందా… అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరును ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుఘల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుఫాన్ కడగలేకపోయింది….ఇట్ వజ్ ఏ ఫ్రీకింగ్ బ్లడ్ పాత్ అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే సాలా సైతన్ అంటూ పవన్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ తో అందరికి పునకాలు వచ్చాయి. ఓజీ గ్లింప్స్ తో అందరికి మూవీ ధియేటర్స్ కి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
గ్లింప్స్ లో పవన్ లుక్స్
గ్లింప్స్ లో చురకత్తులాంటి చూపులతో వేటాడే సింహంలా కనిపించాడు పవన్(PSPK). టీజర్ తో పవన్ అభిమానులకు పూనకాలు వచ్చే రేంజ్ లో హంగ్రీ చీతా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఓజీ నుంచి రిలీజ్ అయిన్ గ్లింప్స్ ఫ్యాన్స్ కి ఇంకా కళ్లముందు కనిపిస్తున్నాయి. ఓజీ గ్లింప్స్ తో మూవీ మీద అంచనాలు భారీగా పెట్టుకున్నారు పవన్ ఫ్యాన్స్. గ్లింప్స్ లో డైరక్టర్ సుజీత్ పవన్ ని ఏ లెవల్లో చూపిస్తున్నాడో అర్ధం అవుతుంది.