రావణాసురుడు రాక్షస కుటుంబానికి చెందిన అసుర దంపతులైన విశ్రవసు, కైకేసిల కుమారుడు. రావణాసురుడిని “రాక్షస రాజు” అని కూడా అంటారు. ఈయన గొప్ప శివ భక్తుడు. నిరంతరం శివ ఆరాధన చేస్తూ ఆ మహా శివుని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేస్తూ మహా శివుని నుంచి గొప్ప వరాలను పొందాడు. రామాయణం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది రాముడు,సీత,లక్ష్మణుడు, రావణాసురుడు.రామాయణంలో రాముని సద్గుణాలు ఎంత గొప్పగా చెప్పబడ్డాయో రావణాసురుని గొప్పతనం గురించి ఆయన ధైర్య పరాక్రమాల గురించి, ఆయన జ్ఞానం గురించి, ఆయన ప్రవర్తన గురించి, ఆయన భక్తి గురించి కూడా అంతే గొప్పగా చెప్పబడ్డాయి. ఈ రాక్షస రాజు అయిన రావణాసురుడు లంక నగరాన్ని పాలించేవాడు.రావణాసురుడిని రావణుడు అని రావణబ్రహ్మ, అని దశకంఠుడని, లంకేశ్వరుడు అని, లంకాధిపతి అనే పేర్లు కూడా ఉన్నాయి.
గొప్ప పండితుడు..
రావణాసురుని 10 తలలు 10 లక్షణాలను సూచిస్తాయని పురాణాలు చెబుతున్నాయి వాటిలో ఆరు శాస్త్రాలు 4 వేదాలుగా సూచిస్తాయని చెప్పారు.అంతేకాదు రావణాసురుడు గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన తన నరాలని తంత్రులుగా వీణా వాదాన్ని చేసి పరమశివుని మెప్పించిన గొప్ప సంగీత కోవిదుడు తపస్వి అని కూడా అంటారు. గ్రహాల గతులను సైతం మార్చగల మహా శక్తివంతుడైన రావణాసురుడు మహామహులకే అంతుచిక్కని వేదాలకు భాష్యాన్ని రచించారు.
రావణాసురుడు అనగానే మనకు మొదటిగా గుర్తుచేది ఆయన పది తలలు ఆయనకి పది తలలు ఉన్న కారణం చేత ఆయనని దశకంఠుడు అని కూడా పిలుస్తారు. రావణుడికి ఆ పది తలలు పుట్టుకతోనే వచ్చాయి అనుకుంటే పొరపాటే అలాగని ఆయనకు ఎవరూ 10 తలలు ఉండాలని వరం కూడా ఇవ్వలేదు మరి రావణాసురుడికి ఈ పది తలలు ఎలా వచ్చాయి అందుకు కారణమేంటి రావణుడి 10 తలలపై విభిన్న కథనాలు వివిధ రామాయణాల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి మరి ఆ కథనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం
1. వాల్మీకి రామాయణం
వాల్మీకి రామాయణంలో రావణుడు కామరూప విద్యలు పది తలలు ఏర్పడ్డాయని చెబుతున్నాయి. ఈ పది తలలకు తోడుగా 20 చేతులు కూడా వస్తాయట రావణుడు ఎప్పుడు పదితలతో ఉండడట ఆయనకు కావలసిన సమయంలో అంటే కేవలం యుద్ధం చేసేటప్పుడు గానీ అతని కోపోద్రి కూడా ఆయన సమయంలో గానీ ఈ పది తలల రూపాన్ని వాడుతుండేవాడని పురాణాలు చెబుతున్నాయి.
2. విచిత్ర రామాయణం
ఒకానొక రోజు విశ్వ వసు దాంపత్య సుఖాన్ని అనుభవించాలని కోరికతో తన భార్య కైక సిజంతకు వెళ్తాడు అప్పటికే కైకసి 11 మార్లు రుతుమతి అయినట్లు విశ్వాసులకి తెలుస్తుంది ఆమె ద్వారా 11 మంది కుమారులను కణాలని అతని భావిస్తాడు కానీ కైక సీతనకు ఇద్దరు కుమారుడు చాలని తన భర్త విశ్వాసికి చెబుతుంది తన మాట తన కోరిక ఎలాగైనా తీరాలని పది తలలున్న రావణుడిని పదవ కుమారుడిగా 11 వాడిగా కుంభకోణుడని కుంభకర్ణుడికి జన్మనిచ్చారని విచిత్ర రామాయణం కథనం.
3. కటోర శివ దీక్ష
ఒకసారి రావణుడు కఠోర శివదీక్ష చేపట్టాడు మహా శివుని ప్రసన్నం చేసుకునీ వరం పొందేందుకు తపస్సు చేశాడు. శివుడు ఎంతకీ ప్రత్యక్షం అవ్వకపోవడంతో తన శిరస్సునే బలిగా చేసి హోమ గుండంలో తన తల ను నరికి త్యాగం చేశాడు. అతడు తపస్శక్తి వల్ల అతడు తల తిరిగి యధా స్థానానికి వచ్చింది అలా పదిసార్లు తనతలను తానే నరికి శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు అతడు త్యాగానికి శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు ఆ సందర్భంలో అతడికి పది తలలను 20 చేతులను ప్రసాదించాడు ఇది అతను కోరుకున్నప్పుడల్లా వచ్చే వరంగా ఇచ్చాడు అందుకే రావణుడిని దశమొగుడు దశకంఠుడు దశగ్రీవుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు
4. భక్త ప్రహ్లాద
ఈ పై మూడు కథనులే కాకుండా మరో కథనం కూడా ఉందని చెప్పవచ్చు అది ఏమిటి అంటే శ్రీమహావిష్ణువు భక్తడు ప్రహ్లాదుడు నీ తన తండ్రి అయిన హిరణ్యకశిపుడు నుంచి కాపాడేందుకు నరసింహ అవతారంలో ఉద్భవించారు. ఆ నరసింహ అవతారం హిరణ్యకశిపుని చంపేందుకే సంహరించే సమయంలో అకస్మాత్తుగా పుట్టి 20 కోళ్లతో నన్ను ఒక్కడిని చంపడం కూడా ఓ పౌరుషమేనా అని ఆక్షేపించాడట హిరణ్యకశిపుడు అప్పుడు శ్రీమహావిష్ణువు తర్వాత జన్మలో నీకు 10 తలలు 20 చేతులు ప్రసాదిస్తాను నేను మానవుడిగా అవతరించి అప్పుడు సంహరిస్తాను అని విష్ణుమూర్తి అన్నాడని మరో కథ ప్రచారంలో ఉంది
10 తలలు దేనికి సంకేతం ?
రావణాసున్ని 10 తలలు ఆధ్యాత్మికంగా ఒక సంకేతాన్ని కూడా సూచిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అదేంటంటే మనసుకు లోబడి అయిదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మొత్తం పది ఇంద్రియాలు ఉంటాయట ఈ పది ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం ఆధ్యాత్మిక సాధనకు బలమవుతుందట. ఈ పది ఇంద్రియాలు వేటిని సూచిస్తాయి అంటే
- కామం
- క్రోధం
- దురాశ
- మొహం
- మదం
- అసూయ
- అహంకారం
- చిత్తశుద్ధి
- హృదయం
- బుద్ధి
ఈ పది ఇంద్రియాలకు లోబడిన వాడే రావణాసురుడట, అందుకే విపరీతమైన భావాలు కలిగి ఉన్నవాడు సుఖశాంతులతో ఉన్నట్టు ఎక్కడ చెప్పబడలేదు . రావణుడు 64 రకాల జ్ఞానాలలో నిష్ణాతుడైన వాటిని ఆచరణలో పెట్టకపోవడంతో అతని కలలు ఏ మాత్రం అతనికి ఉపయోగపడలేదు .సకల సంపదలు కలిగి ఉన్న ఉన్నదానితో తృప్తి చెందకపోవడం, మితిమీరిన కోరికల వల్ల ఏది అనుభవించలేకపోయాడు. అతను తన భావాలకు బానిస అయ్యాడు అది చివరికి అతని మరణానికి దారితీసింది.అంతటి అపార శాస్త్ర పరిజ్ఞానం వైద్య విజ్ఞానం మంత్రవిద్య ఉన్నప్పటికీ రాముడు చేతిలో మరణం పొందాడు. మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు అది ఎటువంటి ప్రయోజనాన్ని అందించదనే విషయాన్ని కూడా సూచిస్తుంది.