అసలు దేవుడు(God) అంటే ఎవరు, మనం పూజ చేయకపోతే ఏమవుతుంది? అని…చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఆలా అడిగిన వారికి ఎలా సమాధానపరచాలో కూడా ఒక్కోసారి అర్ధం కాదు. అసలు పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియేనట. పూజ అనేది దేవునికి దగ్గర ఉంటూ మనసుతో చేసే ఓ వ్యాయామం.మన తెలివితేటలని, జ్ఞానాన్ని పెంచుకోవడానికి మన మెదడుని మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ.జ్యోతి ప్రజ్వలనం అనేది…. త్రాటకం అనే ఒక యోగ ప్రక్రియట.
ప్రతి రోజు కనీసం మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే… కంటి జబ్బులను అరికట్టవచ్చుట అందుకే మన పెద్ద వారు ప్రతి రోజు దీపారాధన చెయ్యమని చెబుతుంటారు. దీపారాధన తో పాటు ఈదిన ఒక మంత్రోచ్చారణ కనీసం 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదట.అది నాలిక కు ఓ వ్యాయామట . అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుందని అంతేకాకుండా ధారణ శక్తి పెరిగి తద్వారావారి వారి భాష మీద కూడా పట్టు సాధిస్తారని పెద్దలు చెబుతున్నారు.
ప్రస్తుత రోజుల్లో పూజ అంటే చాదస్తం అనుకునేవారు సంఖ్య పెరిగిందనే చెప్పవచ్చు . నేటి తరం చిన్నారులు తప్పుగా అర్ధం చేసుకోకుండా వారికి సరైన అర్ధం మనే వివరించాలి. పూజ అనేది మన ఆరోగ్యానికి మరియు మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పాలి. అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది…
1. మూల విరాట్
దేవాలయం లో మూలవిరాట్ ని ఎక్కడైయితే ఎలక్ట్రిక్ మరియు మాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ని ప్రతిష్టిస్తారు ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అందుకే మనకు దేవాలయానికి వెళ్తే మనసు ఎంతో ప్రశాంతం గ ఉంటుంది.ఈ అనుభూతి ని చాలా మంది పొందే ఉంటారు.
2. ప్రదక్షిణ
గుడిలో ప్రదక్షిణ చేస్తాము ఆ ప్రదక్షిణ దేవుని (God) కి సవ్య దిశ లో చేస్తాము (clockwise direction). ఆలా తిరిగినప్పుడు తిరిగినపుడు ఆ ఎలక్ట్రిక్ , మాగ్నెటిక్ తరంగాల శక్తి మన దేహానికి వస్తుందట. కొంతమంది గుడిలోనే దేవుడు ఉంటాడా అని వాదన కు దిగుతుంటారు..”ఇందు గలదు అందులేడని సందేహం వలదు ఏందేందు వెతికిన అందందే కాలేదు ” అని పురాణాల్లో శ్రీ మహా విష్ణు గురించి ప్రహ్లాళ్ళదుడు తన తండ్రి హిరణ్యకశిపుడు కి చెప్పాడట.
3. ఆభరణాలు
ఆడవారు గుడికి వెళ్ళేటప్పుడు సంప్రదాయం గ నిండుగా ఆభరణాలతో కలకాలాడుతూ దైవ(God) దర్శనానికి వెళ్ళాలి అంటారు పెద్దలు ఎందుకంటే మన సంపదను చూపించడానికి కాదట .. బంగారం అనే లోహానికి ఈ ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ తరంగాలను బాగా గ్రహిస్తాయనట.ఎంత అర్ధం అవుతంగా చెప్పరూ మన పెద్దవారు.
4. కొబ్బరి కాయ
కొబ్బరి కాయ స్వచ్ఛతకు గుర్తట . టెంకాయ కి రెండు భాగాలు పై టెంక భాగం మన అహంకారానికి గుర్తట .. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతంగా పెద్దలు చెబుతున్నారు.
6. గర్భగుడి
గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ గర్భ గుడిలో దేవునికి ఎదురుగా కాక కొంచెం పక్కకి ఒక వైపు కి ఉండమని గుడిలో పూజారులు తరచు చెబుతుంటారు.
7. అభిషేకం
విగ్రహాలు పంచ లోహాలతో తయారుచేస్తారు ఉంటాయి.. వాటికి పాలు,పెరుగు ,తేనె,నెయ్యి వంటి వాటితో ద్రవ్యాలతో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయాని ఆలా దేవునికి అభిషేకాలు చేస్తారట.
8. కర్పూరం
ఇప్పుడు వస్తున్న కర్పూరం బిళ్లలు పొగ తో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.కానీ దైవ(God) హారతి కి పచ్చ కర్పూరం ని ఉపయోగించడం వలన ఎన్నో ఔషధ గుణాలు మనం స్వీకరించవచ్చట. హారతి తీసుకునేటపుడు మనం అందరం ఆ హారతి ని కళ్ళకు అద్దుకుంటాము ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగి కళ్ళకు ఎంతో మేలు చేస్తుందని పెద్ద చెబుతున్నారు.. దీనిని ఆయుర్వదం లో స్వేదకర్మ అని అంటారట.
9. తీర్థం
తీర్ధం అంతే వొట్టి నీరు కాదట . ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారుట.