ఇప్పుడు అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్య వయస్సు తో నిమిత్తం లేకుండా అందరికి వచ్చేసింది. అసిడిటీ (Acidity) ని ఎసిడిటీ అని కూడా అంటారు. కడుపు లో అధిక మోతాదు లో ఆమ్లలాల విడుదలైనప్పుడు శరీరం లో ఈ సమస్య తలెత్తుతుందట. ఈ అసిడిటీ వలన కడుపు లో అల్సర్, గ్యాస్ట్రిక్,అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయట. అసలు అసిడిటీ కి కారణాలేంటో ఇప్పుడు తెలుస్కుందాం..
అసిడిటీ కి కారణం..?
మునుపటి రోజుల కంటే ప్రస్తుతం అసిడిటీ (Acidity) సమస్య ఎక్కువ గా కనిపిస్తోంది. అందుకు మనమే కారణం.అవును మన ఆహారపు అలవాట్లు కాలం తో పాటు మారిపోవడమే ఈ అసిడిటీ కి ముఖ్య కారణం. ఇప్పుడుప్రతి ఒకరు ఉద్యోగ రీత్యా లేదా మరొక కారణం చేస్తానో వేళ కు ఆహరం తీసుకోకపోవడం,శరీరానికి అవసరమైన మేర వ్యాయామం లేకపోవడం, మద్యపానం, ఒత్తిడి, ధూమపానం వాళ్ళ అసిడిటీ వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. వీటితో పాటు పరమితి కి మించి మాంసాహారం, మసాలాలు, నూనె తీసుకోవడం వలన అసిడిటీ సమస్య వస్తోందట.
వేళ కు ఆహరం తినకపోవడం తో కడుపు కాళీ గా ఉండటం వలన గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుందట.ఈ గ్యాస్ట్రిక్ సమస్య వలన జీర్ణ ప్రక్రియ ఆలస్యం అయ్యి కడుపు లో ఆమ్లలాలు ఎక్కువ గ ఉత్పత్తి అవుతుందట. అయితే సాధారణంగా ఈ ఆమ్లలాలను మూత్రపిండాలు శరీరం లో నుండి తొలగిస్తాయట. కానీ అధిక మొత్తం లో ఆసిడ్ లు ఉత్పత్తి అయ్యినప్పుడు పొట్టకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయట.ఈ అసిడిటీ కి పరిష్కారం లేదా అంటే దేనికి మందులు ఉన్నాయి కాకపోతే ఇంటి చిట్కాలతో నే అసిడిటీ ని తగ్గించుకోవచ్చట.
అసిడిటీ ని ఎలా నివారచవచ్చంటే…
అసిడిటీ కి కారణమయ్యే ఆహారాలను మానేయాలి..
అసిడిటీ ని కలిగించే ఆహార పదార్థాలు అంటే మసాలాలు , కాఫీ, కార్బోనేటేడ్ పానీయాలు అంటే శీతల పానీయాలు వంటివి తీసుకోకుండా ఉంటెయ్ క్రమంగా అసిడిటీ (Acidity) సమస్య తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
నిద్ర:
గృహిణులకు కానీ లేదా మనం ఇంట్లో ఉన్నపుడు కానీ భోజనం చేసిన తరువుత కొంతసేపు నిద్రపోవడం చాలా మందికి లావాటు గ ఉంటుంది అయితే ఈ అలవాటు వలన కూడా అసిడిటీ (Acidity) వచ్చే ప్రదం ఉందట. కాబ్బటి భోజనం చేసిన వెంటనే కాకుండా కనీసం 2 గంటలు తరువాత నిద్రించవచ్చని చెబుతున్నారు.
స్థూలకాయం:
మనం గమనింస్తే సాధారణంగా లావు గా ఉన్న వారికి శరీరం అంతకి కన్నా పొట్ట భాగం అధికంగా కనిపిస్తుంది.వారికి పొట్ట లో కొవ్వు పోతి కడుపు పై ఒత్తిడి తీసుకువచ్చి గ్యాస్ట్రిక్ సమస్య మొదలయ్యి ఆ తరువాత అది క్రమంగా అసిడిటీ (Acidity) కి దారితీస్తుందని అని వైద్యులు చెబుతున్నారు.కాబ్బటి బరువు తగ్గేందుకు ప్రయత్నించాలట.
ఇంటి చిట్కాలు..
అసిడిటీ భాదిస్తునప్పుడు పూర్తిగా మందుల మీద ఆధారపడకుండా ఇలా కొన్ని చిట్కాలు పాటిస్తే చాలట..
పండ్లు..
అసిడిటీ వచిన్నపుడు అరటిపండు,ఆపిల్ తినడం మంచిదట ఎందుకంటే అరటిపండు,ఆపిల్ లో సహజంగా Antacids ఉన్నందున acid reflux ని తగ్గించడమే కాకుండా చాతి లో మంట ను అసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుందట.
కొబ్బరి నీరు..
కొబ్బరి నీళ్లు ఒక్క అసిడిటీ కె కాదు మన శరీరం లో వేడి ని కూడా తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లలో ని ఫైబర్ పొట్టలో ని ఆసిడ్ యూథపతిని తగ్గించి అసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుందట.
ఈ చిట్కాలు అన్ని అసిడిటీ ప్రభావం తగ్గించడానికి అసలు అసిడిటీ రాకుండా ఉండాలంటే కచ్చితం గా ఈ జాగ్రత్తలు తీస్కోవాలంటున్నారు డాక్టర్లు
అసిడిటీ రాకుండా జాగ్రత్తలు
రోజు మన శరీరానికి సరిపడా నిద్రపోవాలట అంటే కనీసం 6 నుంచి 7 గంటలు నిద్ర ఆరోగ్యం అని కాబ్బటి నిద్రలేమి సమస్య లేకపోతే ఎక్కువసేపు నిద్రపోకుండా మేలుకొని ఉండటం వలన కూడా అసిడిటీ బారినపడే ప్రమాదం ఉందట. మనం తీసుకునే ఆహారాన్ని బాలన్స్ చేయాలట అంతే ఒకేసారి ఆహారాన్ని తినకూడదట. మనం తినే ఆహారాన్ని 6 భాగాలూ గ చేస్కుని తీస్కుంటే అసిడిటీ సమస్య ని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.