డయాబెటిస్ ఇప్పుడు ఇదే అతి ప్రమాదకరమైన స్లో పాయిజన్ లాంటి వ్యాధి ఇటీవల కాలంలో మధుమేహం ప్రధాన సమస్యగా మారింది వయసు సంబంధం లేకుండా చాలా మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు సాధారణంగా జీవనశైలి సరిగా లేకపోవడం, స్థూలకాయం ఎక్కువ ఒత్తిడికి లోనవ్వడం వంటి కారణాలు వస్తుందని వైద్యులు చెబుతున్నారు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం పడతారు అని వైద్యులు.బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి అంటే డయాబెటిస్ ట్రీట్మెంట్ లో వైద్యులు కొంతమందికి టాబ్లెట్లను సూచిస్తారు. టాబ్లెట్లతో కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాకపోతే వారికి ఇన్సులిన్ కూడా సూచిస్తూ ఉంటారు.
టాబ్లెట్లు అయితే రోజుకి రెండుసార్లు లేదా మూడుసార్లు తీసుకోవాల్సిందిగా వైద్యులు చెబుతుంటారు అలాగే ఇన్సులిన్ వాడే వారికి కూడా రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తారు. కొద్ది మందికి ఇన్సులిన్ రోజుకి రెండుసార్లు తీసుకున్న వారికి బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ లో ఉండదు అటువంటి వారికి మూడవసారి కూడా వేసుకోవాల్సిందిగా సూచిస్తారు. అటువంటి వారి బాధ అంతా ఇంతా కాదని చెప్పవచ్చు ఎందుకంటే ఇన్సులిన్ అనేది ఇంజక్షన్ అంత పెద్ద సూదిలా కాకపోయినా చిన్న సూదితో తీసుకోవాల్సి ఉంటుంది.
ఎంత చిన్న సూది అయినా సరే ప్రతిరోజు అలా ఆ సూదితో పొడుచుకుని ఇన్సులిన్ తీసుకోవడం అనేది చాలా నొప్పితో కూడుకున్న విషయం కొంతమంది దీని వలన మానసిక ఆందోళనకు కూడా గురవుతుంటారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ టాబ్లెట్స్ తో కంట్రోల్ కాకపోవడంతో మరి ఏ దారి లేక వైద్యులు కూడా ఈ విధానాన్ని పాటించాలని చెబుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్ బాధితులు ఇకపై బాధాకరమైన ఇంజక్షన్లు తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆస్ట్రేలియాకు చెందిన ఆర్.ఎం.ఐ.టి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇన్సులిన్ అండ్ అదర్ ప్రోటీన్ డ్రగ్స్ ను డెలివరీ చేసే విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు అది ఏంటి అంటే
ఇన్సులిన్ ఇంజక్షన్లకు ప్రత్యామ్నాయంగా టాబ్లెట్స్ రూపంలో ఇన్సులిన్ డెవలప్ చేశారు. దీనివలన మధుమేహ బాధితులు నొప్పిలేని ప్రత్యామ్యాయాన్ని వారికి ట్రీట్మెంట్ గా అందించగలం అని చెప్పారు. కొత్తగా డెవలప్ చేసిన ఈ టాబ్లెట్స్ క్యాప్సూల్ రూపంలో ఉంటుందని ఇది ఫ్రీ క్లినికల్ స్టడీస్ లో ఎఫెక్టివ్ గా పని చేశాయని పరిశోధకులు చెబుతున్నారు. మేము గేమ్ చేంజింగ్ ఓరల్ క్యాప్సూళ్లను డెవలప్ చేసాము ఇది బాధాకరమైన ఇన్సులిన్ ఇంజక్షన్లు అవసరాన్ని నివారించడానికి కొత్త ఆవిష్కరణ అవుతుంది అంటున్నారు ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ షార్లెట్.
మరో పరిశోధకుడు జామి స్ట్రేచెన్ మాట్లాడుతూ.. ఈ క్యాప్సూల్స్ చిన్న ప్రేగుల్లోని హయ్యర్ పి హెచ్ లెవెల్స్ లో కరిగిపోయేలా ప్రేరేపించడం ద్వారా ఇది పనిచేస్తుందని తెలిపారు. ఈ పెయిన్ ఫ్రీ క్యాప్సూల్ భవిష్యత్తులో ఇన్సులిన్ ఇన్సులిన్ స్థానాన్ని భర్తీ చేస్తుందని అంతేకాకుండా ఇది త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు