S J
కోలీవుడ్ సూపర్ హిట్ జంట సూర్య,జ్యోతిక విడిపోయారా? అసలు విషయం ఏంటో తెలీదు కానీ తమిళ ఇండస్ట్రీలో పుకార్లు మాత్రం షికారు చేస్తున్నాయి. ప్రేమ బంధాన్ని దాంపత్య బంధంగా మార్చుకున్న జంట సూర్య, జ్యోతిక. కోలీవుడ్ లోకే అందమైన జంటగా వీరికి పేరు. సినిమాలోనూ నిత్య జీవితంలోను ఈ జంటకు ఫ్యాన్స్ క్రేజ్ బాగా ఉంది. వీరిని అభిమానులు కూడా అన్నావదిన అంటూ పిలుస్తుంటారు. ఇంత అన్యోన్యంగా ఉండే జంట ప్రస్తుతం విడిపోయారనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జ్యోతిక తన పిల్లలతో కలిసి ముంబైలో ఉంటోంది. సూర్య ముంబై చెన్నై మధ్య షటిల్ చేస్తున్నాడు. S J
వీరు విడిపోవడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయట. సూర్య-జ్యోతిక వేరింటి కాపురం పై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కుటుంబం విడిపోవడానికి ప్రధాన కారణం జ్యోతికనే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
పుకార్లు రావటానికి కారణం S J
సూర్య-జ్యోతికను వివాహం చేసుకోవటం తన తండ్రి అయిన శివ కుమార్ కు నచ్చలేదట. కొడుకు ఇష్టాన్ని కాదనలేక పెళ్లి చేశాడని టాక్. అయితే పెళ్లికి ముందే శివ కుమార్ జ్యోతికకు ఒక కండీషన్ పెట్టాడట. ఆ కండీషన్ ఏంటంటే పెళ్లి అయిన తర్వాత సినిమాల్లో నటించకూడదట. ఈ కారణంగానే జ్యోతిక కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యిందని.. అయితే కొన్ని ఏళ్లు గడిచిన తరువాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో సూర్య నాన్న శివకుమార్ జీర్ణంచుకోలేకపోయాడట. కుటుంబంలో గొడవల సమయంలో జ్యోతికకు సూర్య కూడా సపోర్ట్ చేశాడట. ఇక ఈ విషయం సూర్య నాన్నకు నచ్చలేదని అంటున్నారు. కుటుంబంలో గొడవలు వచ్చాయని ఈ కారణంతోనే ఇప్పుడు అత్త,మామలతో కాకుండా జ్యోతిక వేరుగా ఉండాలని నిర్ణయం తీసుకుందనీ తమిళ ఇండస్ట్రీ అంటోంది. ఈ కారణంగానే ఆమె ప్రస్తుతం ముంబైలో ఉంటుందట. కానీ ఇప్పటి వరకు వారి కుటుంబం నుంచి ఎటువంటి స్పందన లేదు. రీసెంట్ గా సూర్య-కార్తి ఇద్దరు స్పందించారు.
సూర్య రియాక్షన్ S J
తమపై వచ్చిన పుకార్లపై సూర్య క్లారిటీ ఇచ్చాడు. జ్యోతికా నేనూ ప్రేమించి వివాహం చేసుకున్నాం మేము ఎప్పటికి విడిపోవటం అనేది జరగదు. జ్యోతిక కేవలం పిల్లల చదువు కోసం ముంబై వెళ్లింది. పిల్లలు పెద్ద వాళ్లు అవుతున్నారు. పిల్లల చదువులు పూర్తి కాగానే కచ్చితంగా అందరం కలుస్తాం. అయితే ప్రతి పండుగని మా ఇంట్లోనే జరుపుకుంటాం. మేము ఎప్పుడు విడిపోము కలిసే ఉంటాం అని అన్నాడు.
కార్తి రియాక్షన్
జ్యోతికను నేను నటిగా చూడలేదు. తల్లిగానే చూశాను. తను కూడా మమ్మల్ని తన పిల్లల్లాగే చూసుకుంది. అమ్మ ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. అమ్మ లేని లోటు ఇంటిలో ఉండలేం. ఇప్పటి వరకు కలిసి ఉండడానికి జ్యోతికనే ప్రధాన కారణమని కార్తి చెప్పుకొచ్చాడు. కార్తి మాటలు అందరికీ బాధ కలిగించాయి.
సూర్య-జ్యోతిక మూవీస్
సూర్య-జ్యోతికలకు ఇద్దరు సంతానం దియా(కుతురు) దేవ్(కొడుకు). వీరి ప్రేమ పెళ్లి 11 సెప్టెంబర్ 2006 లో జరిగింది. సూర్య అసలు పేరు శరవణన్. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆ పేరును సూర్యగా మార్చారు. సూర్య-జ్యోతికలు నువ్వు నేను ప్రేమ, సుందరాంగుడు, జూన్ 07, కిడ్నాప్, పూవెల్లవ కెట్టుప్పర్, కాఖా కాఖా, మాయావి, సిల్లును ఒరు కాదల్, ఉయిరిల్ కలంతతు, పెరజగన్, జూన్ ఆర్ సినిమాల్లో నటించారు. వీరి ఇరువురి మధ్య కెమిస్ట్రీయే ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది.