విశాలి కొత్తూరి పేరి
కథ (story)
చిన్నప్పుడు మా మామ్మ ఒక కథ (story) చెప్పేది. పూర్వం ఒకడు దేవుడి కోసం తపస్సు చేశాడుట, తీరా దేవుడు ప్రత్యక్షమయ్యాక రోజూ తలంటు, వారం భోజనం అడగాల్సిన వాడు “రోజూ భోజనం, వార తలంటు” కావాలని అడిగాడుట. దేవుడు “తథాస్తు” అనేసి వెళ్ళిపోయాడు. ఇదిగో అప్పటి నుంచి మనకి ఇలా రోజు రోజూ వంటలు మొదలయ్యాయి అని చెప్పేది. అసలు ఆ వరం అడిగేవాడు “వార భోజనం, నిత్య తలంటు “అడిగి ఉంటే ఎంత బాగుండేది! ఇలా రోజురోజూ వంట బాధ తప్పేది.
వంట లేకపోతే ఇన్ని కూరగాయలవసరం లేదు, ఇన్ని పప్పు దినుసుల అవసరం లేదు. తలంటైతే తలకి నూనె, షాంపు, కుంకుడు కాయలు, మొదలైన వాడకాలే ఎక్కువ ఉంటాయి. బ్లూ హార్పిక్ కన్నా, రెడ్ హార్పిక్ అవసరమే ఎక్కువ ఉంటుంది.
ముఖ్యంగా రోజూ పొద్దుటే లేచి బ్రేక్ ఫాస్ట్, తరవాత లంచ్, సాయంకాలానికి స్నాక్స్, రాత్రికి మళ్ళీ భోజనం.. ఇన్ని వండే బాధ తప్పేది. అదే నిత్య తలంటైతే పొద్దుటే చిన్నగా తలంటి, మళ్ళీ సాయంత్రం మరో మారు తలంటి…. అహా.. భలే.
నేను ఎప్పుడైనా మంగళవారం నెత్తి మీద నుంచి పోసుకుంటే మాకు తెలిసినావిడ అనేది “వరసగా నాలుగు మంగళవారాలు తలంటుకుంటే ఐదో వారం పుట్టుక్కుమంటావు (పాపి చిరాయువు ఏమీ అవ్వలేదు మనకి) ” అని. ఇప్పుడు ఆవిడ “వరసగా నాలుగు వారాలు రోజూ భోజనం చేస్తే ఐదో వారం పుట్టుక్కుమంటారు” అనేదేమో!
ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఇన్ని వెరైటీలు వండి పెడుతున్నారు కదా, అదే తలంటు రోజులైతే.. “వదినా… వాళ్ళు ఎంత గొప్పవాళ్ళనుకున్నావు? ఎన్ని వెరైటీలు పెట్టారనుకున్నావు? కుంకుడు కాయలు, షాంపూలు, షీకాకాయలు, షీకాయి సబ్బు, అదేదో ఆయుర్వేదం షాపూట.. బహ్లే ఉందనుకో” అని ఒకావిడ అంటే…
“ఆ అన్నీ పెట్టి ఏం లాభం ముష్టి వాళ్ళల్లా మనమే తీసుకోవాలి. మొన్నీ మధ్య మా మరిది కూతురు పెళ్ళి చేశారు. ఎంత సంప్రదాయంగా చేసారో తెలుసా? వచ్చినవారందరికీ వాళ్ళే దగ్గరుండి తలకి నూనె రాశారు, వాళ్ళకి ఏ షాంపు కావాలంటే ఆ షాంపు, కుంకుడు కాయలు కావాలంటే కుంకుడు కాయలు వాడి, దగ్గరుండీ మరీ తలంటారు. తలంటాక తల్లో పేలు కూడా వాళ్ళే స్వయంగా చూశారు తెలుసా? ఇది మర్యాదంటే” అని ఇంకో వదిన గారు అంటారు.
ఇక ప్రభుత్వాలు “రెండు రూపాయిలకే కిలో కుంకుడు కాయలు, కిలో షికాయ్ కాయలు. అర లీటర్ షాంపూ ఇస్తాము మాకు వోటు వేస్తే” అంటూ ప్రచారం చేస్తారు.
ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగు పరచాలంటే బీర్లు, మొదలైనవాటితో తలంటుకోండి అంటూ ప్రకటనలు వస్తాయి.
పక్కింట్లో, ఎదిరింట్లో అరుగు మీద కూర్చునే ఇంతులు “దీనికి ఈ మధ్య షోకులు ఎక్కువయ్యాయి రోజూ భో చేసేస్తోందిట, పొట్ట నొప్పి వస్తే తెలుస్తుంది పెద్దలు ఎందుకు చెబుతున్నారో అని . (షోకులెక్కువయ్యాయి రోజూ షాంపు చేస్తుంది.. ఉన్న నాలుగు వెంట్రుకలు ఊడితే తెలుస్తుంది” అనేవారు)
ఇవన్నీ బాగున్నాయి కానీ కొత్త కొత్త వంటకాలు చేసేవారు, డైటింగ్ టిప్స్ చెప్పేవారు ఏవయ్యిపోతారు?
వాళ్ళు కూడా…
- నెత్తికి కొబ్బరి నూనే మంచిది, మరేది వాడకండి మన తాత ముత్తాతలు ముత్తవ్వలు అదే వాడేవారు. మీరు కూడా కొబ్బరి నూనే రాసుకొని, నీళ్ళతో స్నానం చేయండి అంతే చాలు… అని ఒకరు.
- “రోజూ పొద్దుట రెండు టమాటాలతో, మధ్యాహ్నము కొబ్బరి కాయ గుజ్జుతో, సాయంత్రం ఆకుకూరతో తలంటుకోండి నిగనిగలాడే కురులు మీవే” అంటూ ఒకరు…
- ఈ ఆకుకూరల్లో, కూరగాయల్లో బలమేమీ లేదు రోజూ కోడిగుడ్డు ఇంకా మాంసం ముద్దలు నెత్తికి పట్టించుకొని స్నానం చేయండి (ఎవ్వరూ మీ దగ్గరకు రారు).. అని ఇంకోకరు.
- మట్టి కుండలో కుంకుడు కాయలు నానబెట్టి మరునాడు ఆ కుంకుడు కాయలతో తలంటుకోండి. మట్టి పాత్రలో వాడే షాంపు, కుంకుడుకాయలే శ్రేష్టము … అంటూ మరొకరు…
ఇలా చెప్పేవాళ్ళు చెబుతూనే ఉంటారు.
వీధికి నాలుగు బ్యూటీ సెలూన్లు వచ్చేస్తాయి… “వాళ్ళింట్లో ఇల్లాలికి ఎంత బద్ధకమో తెలుసా? రోజూ బ్యూటీ సెలూన్ తలంటుకుంటారు అందరూ, ఇంట్లో చేయడానికి బద్ధకం… ” అనేవాళ్ళూ ఉంటారు.
ఏ మాటకామాట తిండి లేకుండా ఉంటే ఇన్ని రకాలు వండే వాళ్ళము కాము, ఇన్ని రకాలు వండకపోతే సింక్ లో ఇన్ని గిన్నెలొచ్చేవి కావు, అసలు ఇంట్లో ఇన్ని గిన్నెలుండేవి కావు, ఈ కడిగే బాధ తప్పేది కదా! లెక్కల్లో రికరింగ్ యూనిట్ గా అలా వస్తూనే ఉంటాయి ఈ అంట్లు అదేంటో! పందిపిల్లలు, చిన్నపిల్లలు స్నానం చేయించాక బురదలో పొర్లుతూ ఉన్నట్లు, కడిగిన వెంటనే సింక్ లో తేలుతూ “ఏయ్ నేనిక్కడున్నాను… మిస్ యూ” అంటూ ఉంటాయి గ్లాస్ లు, చెంచాలు.
ఆ వరం కోరుకునేవాడు ఎందుకు కంగారు పడాలి.. హ్మ్మ్… హతవిధి… మనమెందుకు ఇన్నిసార్లు అంట్లు కడగాలి… ఎవరో జ్వాలను రగిలించారు.. వేరెవరో దానికి బలి అయినారు.. చిన్నప్పుడు మా మామ్మ ఒక కథ చెప్పేది.పూర్వం ఒకడు దేవుడి కోసం తపస్సు చేశాడుట, తీరా దేవుడు ప్రత్యక్షమయ్యాక రోజూ తలంటు, వారం భోజనం అడగాల్సిన వాడు “రోజూ భోజనం, వార తలంటు” కావాలని అడిగాడుట. దేవుడు “తథాస్తు” అనేసి వెళ్ళిపోయాడు. ఇదిగో అప్పటి నుంచి మనకి ఇలా రోజు రోజూ వంటలు మొదలయ్యాయి అని చెప్పేది.
అసలు ఆ వరం అడిగేవాడు “వార భోజనం, నిత్య తలంటి” అడిగి ఉంటే ఎంత బాగుండేది! ఇలా రోజురోజూ వంట బాధ తప్పేది.
వంట లేకపోతే ఇన్ని కూరగాయలవసరం లేదు, ఇన్ని పప్పు దినుసుల అవసరం లేదు. తలంటైతే తలకి నూనె, షాంపు, కుంకుడు కాయలు, మొదలైన వాడకాలే ఎక్కువ ఉంటాయి. బ్లూ హార్పిక్ కన్నా, రెడ్ హార్పిక్ అవసరమే ఎక్కువ ఉంటుంది.
ముఖ్యంగా రోజూ పొద్దుటే లేచి బ్రేక్ ఫాస్ట్, తరవాత లంచ్, సాయంకాలానికి స్నాక్స్, రాత్రికి మళ్ళీ భోజనం.. ఇన్ని వండే బాధ తప్పేది.
అదే నిత్య తలంటైతే పొద్దుటే చిన్నగా తలంటి, మళ్ళీ సాయంత్రం మరో మారు తలంటి…. అహా.. భలే.
నేను ఎప్పుడైనా మంగళవారం నెత్తి మీద నుంచి పోసుకుంటే మాకు తెలిసినావిడ అనేది “వరసగా నాలుగు మంగళవారాలు తలంటుకుంటే ఐదో వారం పుట్టుక్కుమంటావు (పాపి చిరాయువు ఏమీ అవ్వలేదు మనకి) ” అని. ఇప్పుడు ఆవిడ “వరసగా నాలుగు వారాలు రోజూ భోజనం చేస్తే ఐదో వారం పుట్టుక్కుమంటారు” అనేదేమో!
ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఇన్ని వెరైటీలు వండి పెడుతున్నారు కదా, అదే తలంటి రోజులైతే.. “వదినా… వాళ్ళు ఎంత గొప్పవాళ్ళనుకున్నావు? ఎన్ని వెరైటీలు పెట్టారనుకున్నావు? కుంకుడు కాయలు, షాంపూలు, షీకాకాయలు, షీకాయి సబ్బు, అదేదో ఆయుర్వేదం షాపూట.. బహ్లే ఉందనుకో” అని ఒకావిడ అంటే…
ఆ అన్నీ పెట్టి ఏం లాభం ముష్టి వాళ్ళల్లా మనమే తీసుకోవాలి. మొన్నీ మధ్య మా మరిది కూతురు పెళ్ళి చేశారు. ఎంత సంప్రదాయంగా చేసారో తెలుసా? వచ్చినవారందరికీ వాళ్ళే దగ్గరుండి తలకి నూనె రాశారు, వాళ్ళకి ఏ షాంపు కావాలంటే ఆ షాంపు, కుంకుడి కాయలు కావాలంటే కుంకుడుకాయలు వాడి, దగ్గరుండీ మరీ తలంటారు.
తలంటాక తల్లో పేలు కూడా వాళ్ళే స్వయంగా చూశారు తెలుసా? ఇది మర్యాదంటే” అని ఇంకో వదిన గారు అంటారు.
ఇక ప్రభుత్వాలు “రెండు రూపాయిలకే కిలో కుంకుడు కాయలు, కిలో షికాయ్ కాయలు. అర లీటర్ షాంపూ ఇస్తాము మాకు వోటు వేస్తే” అంటూ ప్రచారం చేస్తారు.
ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగు పరచాలంటే బీర్లు, మొదలైనవాటితో తలంటుకోండి అంటూ ప్రకటనలు వస్తాయి.
పక్కింట్లో, ఎదిరింట్లో అరుగు మీద కూర్చునే ఇంతులు “దీనికి ఈ మధ్య షోకులు ఎక్కువయ్యాయి రోజూ భో చేసేస్తోందిట, పొట్ట నొప్పి వస్తే తెలుస్తుంది పెద్దలు ఎందుకు చెబుతున్నారో అని (షోకులెక్కువయ్యాయి రోజూ షాంపు చేస్తుంది.. ఉన్న నాలుగు వెంట్రుకలు ఊడితే తెలుస్తుంది” అనేవారు)
ఇవన్నీ బాగున్నాయి కానీ కొత్త కొత్త వంటకాలు చేసేవారు, డైటింగ్ టిప్స్ చెప్పేవారు ఏవయ్యిపోతారు?
వాళ్ళు కూడా…
- నెత్తికి కొబ్బరి నూనే మంచిది, మరేది వాడకండి మన తాత ముత్తాతలు ముత్తవ్వలు అదే వాడేవారు. మీరు కూడా కొబ్బరి నూనే రాసుకొని, నీళ్ళతో స్నానం చేయండి అంతే చాలు… అని ఒకరు.
- “రోజూ పొద్దుట రెండు టమాటాలతో, మధ్యాహ్నము కొబ్బరి కాయ గుజ్జుతో, సాయంత్రం ఆకుకూరతో తలంటుకోండి నిగనిగలాడే కురులు మీవే” అంటూ ఒకరు…
- ఈ ఆకుకూరల్లో, కూరగాయల్లో బలమేమీ లేదు రోజూ కోడిగుడ్డు ఇంకా మాంసం ముద్దలు నెత్తికి పట్టించుకొని స్నానం చేయండి (ఎవ్వరూ మీ దగ్గరకు రారు).. అని ఇంకోకరు.
- మట్టి కుండలో కుంకుడు కాయలు నానబెట్టి మరునాడు ఆ కుంకుడు కాయలతో తలంటుకోండి. మట్టి పాత్రలో వాడే షాంపు, కుంకుడుకాయలే శ్రేష్టము … అంటూ మరొకరు…
ఇలా చెప్పేవాళ్ళు చెబుతూనే ఉంటారు.
వీధికి నాలుగు బ్యూటీ సెలూన్లు వచ్చేస్తాయి… “వాళ్ళింట్లో ఇల్లాలికి ఎంత బద్ధకమో తెలుసా? రోజూ బ్యూటీ సెలూన్ తలంటుకుంటారు అందరూ, ఇంట్లో చేయడానికి బద్ధకం… ” అనేవాళ్ళూ ఉంటారు.
ఏ మాటకామాట తిండి లేకుండా ఉంటే ఇన్ని రకాలు వండే వాళ్ళము కాము, ఇన్ని రకాలు వండకపోతే సింక్ లో ఇన్ని గిన్నెలొచ్చేవి కావు, అసలు ఇంట్లో ఇన్ని గిన్నెలుండేవి కావు, ఈ కడిగే బాధ తప్పేది కదా! లెక్కల్లో రికరింగ్ యూనిట్ గా అలా వస్తూనే ఉంటాయి ఈ అంట్లు అదేంటో! పందిపిల్లలు, చిన్నపిల్లలు స్నానం చేయించాక బురదలో పొర్లుతూ ఉన్నట్లు, కడిగిన వెంటనే సింక్ లో తేలుతూ “ఏయ్ నేనిక్కడున్నాను… మిస్ యూ” అంటూ ఉంటాయి గ్లాస్ లు, చెంచాలు.
ఆ వరం కోరుకునేవాడు ఎందుకు కంగారు పడాలి.. హ్మ్మ్… హతవిధి… మనమెందుకు ఇన్నిసార్లు అంట్లు కడగాలి… ఎవరో జ్వాలను రగిలించారు.. వేరెవరో దానికి బలి అయినారు..
(story) (story) (story) (story)