(US)
గన్ కల్చర్ కు ఆలవాలమైన అమెరికా లో మరోసారి కాల్పుల మోతతో హోరెత్తిపోయింది. ఓ ఉన్మాది జరిపిన కాల్పులకు ఏకంగా 22 మంది బలైపోయారు. పరారీలో ఉన్న ఆ నిందితుడి కోసం వెతుకుతున్నారు. లీవెస్టన్ సిటీలో నిన్న సాయంత్రం ఈ కాల్పులు జరిగినట్లు22 మంది చనిపోగా, అనేక మంది ఈ క్రమంలో గాయపడినట్లు తెలుస్తోంది. తుపాకీ గాయాలతో రక్త మోడుతూ ఆస్పత్రులకు పరుగు తీసిన బాధితులతో స్థానిక ఆస్పత్రులు నిండిపోయాయి. బౌలింగ్ అలీ, మరో లొకేషన్ లోనూ, స్థానిక రెస్టారెంట్ బార్ లోనూ ఈ కాల్పులు జరిగినట్లు సిటీ కౌన్సిలర్ రాబర్ట్ తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశానికి అంబులెన్సులు, రెస్క్యూ దళాలు చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. క్షత గాత్రులను ఆదుకోడానికి శెలవుల్లో ఉన్న ఆస్పత్రి సిబ్బందిని కూడా విధులకు రప్పించారు.
బైడెన్ ఆరా
కాల్పుల విషయం తెలియగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మైనే గవర్నర్ కు ఫోన్ చేశారు. పరిస్థితిపై ఆరా తీశారు. బౌలింగ్ ఆలీలో సెమీ ఆటోమేటిక్ వెపన్ తో ఉన్న షూటర్ ఫొటోను స్థానిక పోలీసులు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. ఈ కాల్పులకు కారణం 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్ అని తాత్కాలికంగా అంచనాకు వచ్చారు. నిందితుడి దగ్గర భారీ సంఖ్యలో మారణాయుధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. నిందితుడి గురించి సమాచారం తెలిసిన వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అలాగే తెల్లని SUV వాహనం ఫొటోను కూడా పోలీసులు విడుదల చేశారు. ఆ వాహనం ఎక్కడైనా కనిపించినా ట్రేస్ చేయాలని కోరారు.
షాపుల మూసివేత (US)
కాల్పులు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరగడంతో పోలీసులు కఠినమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా షాపులు, బిజినెస్ ఎస్టాబ్లిష్ మెంట్లను మూసి వేశారు. అనుమానితులపై నిఘా పెంచారు. మైనే గవర్నర్ జానెట్ మిల్స్ కు ఎప్పటి కప్పుడు సమాచారాన్ని తెలియ చేస్తున్నారు. కాల్పుల ఘటనల్లో కనీసం 50,60 మంది గాయపడినట్లు సమాచారం.నిందితుడు గతంలో యూఎస్ ఆర్మీలో పని చేసిన రిజర్వ్ మెంబర్ రాబర్ట్ గా అనుమానిస్తున్నారు. యూఎస్ ఆర్మీ, రిజర్వ్ ట్రైనింగ్ సెంటర్ లో ఫైర్ ఆర్మ్స్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేసి రిటైర్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది మొదట్లో గృహ హింస కేసులో అరెస్టయి విడుదలైన రాబర్ట్ మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఓ వెల్ నెస్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
పోలీసుల సమాచారం ప్రకారం నిన్న సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం 7.15 నిమిషాలకు బౌలింగ్ ఆలీలో కాల్పులు జరిగాయని, ఆ తర్వాత స్కిమెంజెస్ బార్ అండ్ గ్రిల్ రెస్టారెంట్ లో మరోసారి కాల్పులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. అయితే రెండోసారి కాల్పులు 8.15 నిమిషాలకు ఒక లోకల్ వాల్ మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో జరిగాయని స్థానికులు చెబుతున్నారు. జరిగిన సంఘటనలు భీతి గొలిపేవిగా ఉన్నాయని, చనిపోయిన 22 మందికి తన ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నానని మైనే కాంగ్రెస్ మెన్ జారెడ్ గోల్డెన్ తెలిపారు. 2017 తర్వాత అత్యంత దారుణమైన షూటౌట్ గా దీనిని ఆయన అభివర్ణించారు. అప్పట్లో లాస్ వేగాస్ లో ఒక మ్యూజిక్ ఫెస్టివల్ లో కి ఒక సాయుధుడు చొరబడి 60 మందిని కాల్చి చంపాడు.
అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.
అమెరికాలో గన్ కల్చర్ సర్వ సాధారణం. అక్కడ ప్రజల కన్నా ఎక్కువ సంఖ్యలో తుపాకులు ఉంటాయనే ప్రచారం కూడా ఉంది. గన్ వయలెన్స్ ఆర్కైవ్ నివేదిక ప్రకారం అమెరికాలో ఈ ఏడాది 500 మాస్ షూటింగ్స్ జరిగాయి. (US)