సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో విలన్ గా కనిపించినప్పటికీ.. రియల్ లైఫ్ మాత్రం హీరో అనిపించుకున్నాడు. కరోనా టైంలో అనేక మందికి సహాయంగా నిలిచి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు . సాహయం అని తన దగ్గరకి వచ్చిన వారికి తన వంతు సహకారం అందిస్తూ మంచి వ్యక్తి గా మానవత్వం ఉన్న మనిషి గా అయన చేసిన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అద్దం పట్టాయి .
ఆయన సేవలు అంతటితో ఆగిపోలేదు .. ఏదో రూపంలో ఎన్నో సహకార కార్యక్రమాలు చేపట్టి పేదలకు అండగా నిలుస్తున్నారు సోనూసూద్. ఈ క్రమంలోనే సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.సివిల్స్ కోర్స్ చదవాలంటే చాలా ఖర్చు అవుతుందన్న విషయం మనకందరికీ తెలిసిందే .ఆ విద్య ని పేద వారికి కూడా అందాలనే మంచితాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ సైతం ఇచ్చారు.
ఫ్రీ కోచింగ్ స్కాలర్ షిప్ కోసం ఈనెల 17 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ‘ఇది సువర్ణావకాశం. మీరు IAS కావాలన్న కలను ఇలా నెరవేర్చుకోండి. soodcharityfoundation.org సైట్లో అప్లై చేసుకొని స్కాలర్ షిప్ పొందండి’ అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన హీరోయిజాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు.
IAS Scholarship Alert 👇🏻
'A golden opportunity, don't let it fade; 💫
Sambhavam 2023, where IAS dreams are made.' ✍🏼Due to large number of requests received, the Registration dates for Sambhavam IAS Coaching Scholarship have been extended till 17th July.
Register on -… pic.twitter.com/WkGEKjUeBq
— sonu sood (@SonuSood) July 11, 2023