SA vs PAK
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్తాన్, చెన్నైలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మంచి స్కోరు చేసినా విజయంమాత్రం పొందలేకపోయింది. సఫారీల దూకుడు ముందు, పకడ్బందీ ఫీల్డింగ్ ముందు పాకిస్థాన్ జట్టు వెల వెలబోయింది. వెరసి సెమీస్ రేస్ లో అట్టడుగుకు పడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, 46.4 ఓవర్లలో 270 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఉత్కంటంగా నిలబడి చూసిన మ్యాచ్. చివరి వరకూ పోరాడినా పాకిస్థాన్‌కు విజయం దక్కలేదు. విజయాన్ని అంత తేలిగ్గా వదులుకునేందుకు సిద్ధంగా లేని దక్షిణాఫ్రికా ఆఖరి వికెట్ తో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ 9 ఇమామ్ అల్ హక్ 12 లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో 38 పరుగులకే పాకిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది. వీరిద్దరిని కూడా జాన్సెన్ ఔట్ చేశాడు. ఈ దశలో సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ బాబర్ ఆజాం, మహ్మద్ రిజ్వాన్ 31 లు ఇద్దరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరి మధ్య 48 పరుగుల భాగస్వామ్యం నెలకొన్న తరుణంలో జట్టు స్కోరు 86 పరుగుల వద్ద రిజ్వాన్‌ను కొయిట్జీ ఔట్ చేశాడు. ఇఫ్తికార్ అహ్మద్ 21 బాబర్ ఇద్దరూ కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో పాకిస్థాన్ 141 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే షాదాబ్ ఖాన్, సౌద్ షకీల్ లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షాదాబ్ సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగగా సౌద్ నిలకడగా ఆడాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరు కీలక సమయంలో ఔట్ అయ్యారు. ఆఖర్లో మహ్మద్ నవాజ్ 24 రాణించడంతో పాక్ 270 పరుగులు చేయగలిగింది. SA vs PAK
మ్యాచ్ ను మలుపు తిప్పిన మార్ క్రమ్ SA vs PAK
అనంతరం 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 34 పరుగుల వద్ద భీకర ఫామ్‌లో ఉన్న డికాక్ వికెట్ కోల్పోయింది. బవుమా కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 67 పరుగులకు ప్రొటీస్ రెండో వికెట్ కోల్పోయింది. వరుసగా వికెట్లు పడుతున్నా మార్క్రమ్ పోరాటం ఆపలేదు. మార్క్రమ్ ఒంటరి పోరాటంతో దక్షిణాఫ్రికాను విజయం దిశగా నడిపించాడు. 93 బంతుల్లో 91 పరుగులు చేసి జట్టును సునాయసంగా గెలిపించేలా కనిపించాడు. కానీ పాక్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వరుసగా వికెట్లు తీసి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చారు. అరు వికెట్లకు 225 పరుగుల వద్ద ఉన్న ప్రొటీస్‌ను 259కి ఎనిమిది వికెట్లు ఉన్న స్థితికి తెచ్చారు. రెండు వికెట్లు చేతిలో ఉండగా 38 బంతుల్లో దక్షిణాఫ్రికా 12 పరుగులు చేయాల్సి వచ్చింది. అంతే మ్యాచ్ ఏమవుతుందో అన్న ఉత్కంఠ పెరిగిపోయింది. విజయానికి మరో మూడు పరుగులు అవసమైన దశలో పాక్ మరో వికెట్ తీసింది. కేశవ్ మహరాజ్ బౌండరీ బాది సఫారీ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో పాక్ సెమీస్ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయాయి.
సెమీస్ రేస్ నుంచి పాకిస్థాన్ ఔట్ ?
ప్రపంచకప్ చరిత్రలో వరుసగా నాలుగు మ్యాచ్లుా ఓడిపోవటం పాకిస్థాన్‌కు ఇదే తొలిసారి. ఈ ప్రపంచకప్లోు తొలి రెండు మ్యాచ్లు్ గెలిచిన పాక్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లోక పరాజయం చెందింది. దీంతో సెమీస్ రేసు నుంచి పాకిస్థాన్ దాదాపు ఔట్ అయినట్టే. ఆరు మ్యాచ్ల్లోో నాలుగింట ఓడి ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పాక్ ఉంది. ఇంకా గ్రూప్ స్టేజీలో బాబర్ ఆజమ్ సేన మూడు మ్యాచ్లు్ ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్లుప గెలిచినా పాకిస్థాన్ సెమీస్కు్ చేరడం దాదాపు అసాధ్యమే. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. అన్ని గెలుపు కోసం చివరి దాకా పోరాడుతుండటంతో మ్యాచులు ఉత్కంఠంగా సాగుతున్నాయి. శుక్రవారం మ్యాచు ముగిసిన తర్వాత పాయింట్ల టేబుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా టాప్-4లో కీలక మార్పులు చోటు చేసుకోవడం విశేషం. పాకిస్తాన్ పై అద్భుత విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో చేరింది. ఇండియా రెండో స్ధానం లో ఉంది న్యూజిల్యాండ్ మూడో స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా నాలుగో స్థానం లో ఉంది.