తెలుగు హీరోయిన్లలో ప్రస్తుతం టాప్ రేంజ్ లో బిజీగా దూసుకుపోతున్న హీరోయిన్లెవరైనా ఉన్నారంటే శ్రీలీల (Sreeleela) అనే చెప్పాలి. పేరున్న హీరోయిన్లు కూడా ఏడాదంతా బిజీగా కనపడిన దాఖలాలులేవు.. కానీ శ్రీలీల మాత్రం వచ్చీరాగానే చాలా స్పీడ్ గా కెరీర్ లో నిలదొక్కుకుంది.అందం, అభినయం, చిన్నవయసు, మంచి డాన్సర్ కావడంతో ఈ చెలాకీ చిన్నది అతి తక్కువ టైమ్ లో అగ్రహీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది.
అచ్చొచ్చిన పెళ్లిసందడి
2021లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను తన నటనతో, చలాకీ తనంతో ఆకట్టుకుంది. నిజానికి హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ గ్రాండ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసిన మూవీ ఇది. అయితే రోషన్ కు అనుకున్నంత పేరు ఈసినిమా తేకపోయినా.. శ్రీలీల మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయింది. మంచి ఫిగర్,చెలాకీ తనం, హుషారుతనంతో ఈ అమ్మడు అభిమానులను సంపాదించే సుకుంది.
ఓ రకంగా చెప్పాలంటే లక్కీ హీరోయిన్. అతి తక్కువ కాలంలోనే రవితేజ లాంటి హీరో పక్కన ధమాకాలో దడ దడలాడించింది. ముద్దుగుమ్మ హుషారు చూసిన వారంతా ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి.. శ్రీ లీలను మహేష్ బాబు సరసన ఓసినిమాకు హీరోయిన్ గా ఎంపిక చేసినా అంత చిన్నవయసు అమ్మాయిలతో నటించేందుకు ప్రిన్స్ అభ్యంతరం వ్యక్తం చేశాడట. ధమాకా ఇచ్చిన కిక్ తో శ్రీలీల ఇప్పుడు ఇండస్ట్రీలోకే బిజీస్టార్ అయిపోయింది. శ్రీలీల హీరోయిన్ గా వచ్చే ఏడాది విడుదల కు ఏకంగా తెలుగు లో 9 సినిమాలు , కన్నడలో 2 సినిమాలు షూటింగ్ జరుపు కుంటున్నాయి.
నట సింహ బాల కృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎనర్జిటిక్ హీరో రామ్ ఇలా అగ్ర హీరోల తో నే కాకుండా నితిన్, విజయ్ దేవరకొండ, పంజా వైష్ణవ్ తేజ్ నేటితరం హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఈ బ్యూటీ. ఈ ఏడాది వినాయక చవితి నుంచి వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఈ చిన్నదినటించిన సినిమాలన్నీ పండగకి ఓ సినిమా చొప్పున రిలీజ్ కానున్నాయి.
శ్రీలీల హీరోయిన్ గా అప్ కమింగ్ థియేటర్ రిలీజ్ మూవిస్: (Sreeleela)
- స్కంద- రామ్ పోతినేని సరసనా
- భగవత్ కేసరి-బాలకృష్ణ సరసనా
- ఉస్తాద్ భగత్ సింగ్- పవన్ కల్యాణ్ సరసనా
- ఎక్స్ ట్రా-ఆర్డినరీ మ్యాన్- నితిన్ సరసనా
స్కంద ప్రిరిలీజ్ ఈవెంట్లలో బిజీ
వీటిల్లో ప్రస్తుతం స్కంద సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. హై యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కావడంతో ప్రీ రీలిజ్ ఈవెంట్ లోనే శ్రీలీలతన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ఎన్నో అంచనాలున్న ఈసినిమాకు తమన్ సంగీతం అందించారు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్స్ వేగం పుంజుకున్నాయి.
అసలు సినిమాల్లోకి శ్రీలీల ఎంట్రీయే విచిత్రంగా జరిగింది. సినిమాటోగ్రాఫర్ భువన గౌడ తీసిన షార్ట్ రీల్స్, ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో చూసిన దర్శకుడు ఏ.పి. అర్జున్ ఆమెను కిస్ సినిమాతో కన్నడ ప్రేక్షకులకు పరిచయం చేశారు.తెలుగు చిత్ర పరిశ్రమతో కొద్దిగా పరిచయాలున్నా బెంగళూరులో పెరిగినందున కన్నడ సినిమాల్లోనే అద్రుష్టం పరీక్షించుకోవాలని అనుకుంది ఈ యువ హీరోయిన్. అయితే పెళ్లిసందడి సినిమా ఈ చిన్నదాని కెరీర్ నే మలుపు తిప్పింది.