పఠాన్ సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న షారుఖ్ ఖాన్(SRK)… ఇప్పుడు జవాన్ తో గ్లోబల్ హిట్టును అందుకోబోతున్నాడు. సినిమాలో షారుఖ్ ఖాన్ యాక్షన్ ఎలివేషన్స్ తో పాటు ఆయన కామెడీ టైమింగ్ మరియు కథలోని మెయిన్ ఎమోషన్ అండ్ మెసేజ్ కూడా చాలా బాగుందంటున్నారు ప్రేక్షకులు.. ఈసినిమాలో షారూక్ డబుల్ రోల్ లో కనిపించడం ఒక అట్రాక్షన్ కాగా రెండు పాత్రల్లోనూ తనసత్తాను చాటాడు కింగ్ ఖాన్. అలాగే, విక్రమ్ రాథోడ్ పాత్రలో షారుఖ్ ఖాన్ నయనతార మధ్య సాగే సీన్స్ ను, అలాగే ప్లాష్ బ్యాక్ లోని సీనియర్ షారుఖ్ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో షారూక్ ను ఆకాశానికెత్తేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
పఠాన్ ను మించిన జవాన్ (SRK)
ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన షారుక్ ఖాన్ ఈ సారి జవాన్ సినిమాతో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. షారుక్ నటించిన ఈ సినిమా కోసం ప్రక్షకులు ఎంతగానో ఎదురు చుశారు. దర్శకుడు అట్లీ సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగ్గట్టుగానే.. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో సాగిన ఈ సినిమా రికార్డులను కొల్లగొట్టనుంది. గురువారం ఒక రోజే 120 కోట్లు వసూళ్లు వచ్చినట్లు సమాచారం. దాదాపు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరనున్న జవాన్ మూవీ పఠాన్ రికార్డులను తిరగరాయనుంది.
షారూక్ అంటేనే సెన్సేషన్ (SRK)
కింగ్ ఖాన్ స్టైల్ కు, నటనకు ఫిదా అవని ప్రేక్షకులుండరు.తనదైన శైలితో సొంత గుర్తింపు సంపాదించుకున్న ఖాన్ బాగా ఆస్తులను కూడా వెనకేసుకోగలిగాడు.ప్రపంచంలో సంపన్న నటుల గురించి చర్చకు వస్తే భారత్ నుంచి కేవలం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పేరొక్కటే వినిపిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. రూ. 6 వేల కోట్లకుపైగా నికర సంపదతో కింగ్ ఖాన్ ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ సారి షారుఖ్ ఖాన్ ముందస్తుగా ఐదు కోట్ల రూపాయలను ఐటి శాఖకు చెల్లించారు. కాగా.. గత ఏడాది ఇదే సమయానికి షారుఖ్ రూ. 3.5 కోట్లు మాత్రమే చెల్లించాడు. అంటే జవాన్ మూవీకి షారూక్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతై ఉంటుదన్నది ఊహించుకోవచ్చు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన జంట షారూక్(SRK), గౌరీల జంటే. షారూక్ తో పాటు సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ కూడా అయిన గౌరీ భారీగానే సంపాదిస్తుంది.షారూఖ్(SRK)గౌరీ జంట ఇంత ధీమాగా,హాయిగా ఉండగలుగుతున్నారంటే వారి మేనేజర్ పూజా దద్లానీయే కారణం.. ఎందుకంటే వీరి కుటుంబానికి సంబంధించిన ప్రతీ ఆర్థిక లావాదేవీలు ఆమె చూస్తుంటారు.చివరకు మూవీ ప్రమోషన్స్ కూడా ఆమే స్వయంగా చూసుకుంటారు.పూజా 2012 నుండి కింగ్ ఖాన్ మేనేజర్ గా ఉన్నారు. ఒక దశాబ్ద కాలంగా అంకితభావంతో పని చేస్తూ, అతని ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు.ఆమె షారూఖ్ సినిమా వ్యవహారాలే కాదు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా చూసుకుంటారు.జవాన్ మూవీ ప్రమోషన్స్ లో పూజా కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఆమె జీతం గురించిన విషయాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
జవాన్ కు ప్రిన్స్ అభినందనలు
సినిమా విడుదలకు ముందు జవాన్ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన టాలివుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమా విడుదల తర్వాత, ఆ సినిమాని చూసి ఎలా ఉందో ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, షారుఖ్‌ని లెజెండ్ అంటూ సంభోధించి బాలీవుడ్ అభిమానులను, ముఖ్యంగా షారుఖ్ అభిమానులను ఖుషి చేశారు.