ఆకాశంలో అద్భుతం ఆవిష్క్రుతం కాబోతోంది. పౌర్ణమి సందర్భంగా ఇవాళ రేపుచంద్రబింబం (Moon) ప్రకాశవంతంగా, శోభాయమానంగా వెలుగులీనబోతోంది.దీనినే సూపర్ బ్లూ మూన్ అని పిలుస్తారు. నాసా శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం వరకూ పూర్ణ చంద్రబింబం దర్శనం కాబోతోంది. సాధారణంగా ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తే దానిని బ్లూ మూన్ గా పిలుస్తారు.
ఈసారి వచ్చిన సూపర్ బ్లూ మూన్ రాఖీ పౌర్ణమి నాడు ఏర్పడనుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు మరింత పెద్దగా, కాంతులీనుతూ,ప్రకాశిస్తూ కనిపిస్తాడు. నేచర్ లవర్స్ కు ఇవాళ కన్నుల పండుగే.. ఎందుకంటే ఇవాళ రాత్రి ఆకాశంలో పూర్ణచంద్రబింబం కనిపిస్తుంది. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు పౌర్ణమి రావడం వల్ల ఈ అద్భుతం మనకు కనిపిస్తుంది. ఇవాళ చంద్రుడు భూమికి 3,57,244 కి.మీ దూరంలో ఉంటాడు.
ఎప్పుడు చూడోచ్చు
బ్లూ మూన్ ను ఈసాయంత్రం సంధ్యా సమయం దాటాక ఆకాశంలో చూడొచ్చు. అయితే భారత్ లో మాత్రం 8.37 నిమిషాలకు చంద్రుడు మరింత పెద్దగా, వెలుగు లీనుతూ కనిపిస్తాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ బ్లూమూన్ ను వివిధ దేశాల్లో ఇంచుమించుగా అదే సమయంలో చూడొచ్చు.. యూరప్ వాసులు ఈ ఘట్టాన్ని గురువారం సాయంత్రం ఉదయం దాకా చూడొచ్చు.లండన్ లో 8:08 నిమిషాలకు న్యూయార్క్ లో 7:45 నిమిషాలకు బ్లూ మూన్ ను చూడవచ్చు. లాస్ఏంజెలెస్ లో 7:36 నిమిషాలకు సూపర్ బ్లూమూన్ దర్శనమీయనుంది.
బ్లూమూన్ అనే ఎందుకు? (Moon)
నిజానికి చంద్రుడు ఈరోజు కనిపించేది ఆరెంజ్ కలర్ లో కానీ..దీనిని బ్లూ మూన్ అని ఎందుకంటారు? అంటే దీనికి ఒక కారణమంటూ లేదు. చాలా అరుదుగా జరిగే ఘటన కాబట్టి బ్లూ మూన్ అని పిలుస్తారు. దీనిని బట్టే ఆంగ్లంలో వన్స్ ఇన్ ఏ బ్లూమూన్ అనే నుడికారం పుట్టింది. ఒకే నెలలో రెండు పౌర్ణమిలు సంభవిస్తే దానిని బ్లూమూన్ అంటారు. అయితే ఈసారి ఒకే నెలలో బ్లూ మూన్,సూపర్ మూన్ రావడం చాలా చాలా అరుదు.
టెక్నికల్ భాషలోచెప్పాలంటే భూమికి, శని గ్రహానికి దగ్గరగా చంద్రుడు రావడాన్నే బ్లూ మూన్ అంటారు. ఈ సమయంలో చంద్రుడు పెద్దగా, కాంతి వంతంగా దర్శనమిస్తాడు. చంద్రుడు తన కక్ష్యలో పరిభ్రమిస్తూ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు బ్లూ మూన్ ఏర్పడుతుంది. రోజూ కంటే ఈరోజు చంద్రుడు ఏడు రెట్లు పెద్దగా కనిపిస్తాడు.
ఇది ఈ ఏడాదిలో మూడోసారి కనిపించిన అద్భుతం. ఈరోజు చంద్రుడు తెల్లగా,ఆరెంజ్ కలర్ లేదా లైట్ ఎల్లో కలర్ లో కనిపిస్తాడు. కాంతిలో ఎరుపు రంగుని ఫిల్టర్ చేసే అంశాలు గాలిలో ఉన్నప్పుడు చంద్రుడు నీలిరంగులో కనిపిస్తాడని నాసా శాస్త్రవేత్తల అధ్యయనంలో బయటపడింది. సూపర్ బ్లూ మూన్ ప్రతీ పదేళ్లకు ఒకసారి కనిపిస్తుందని నాసా లెక్కలు చెబుతున్నాయి. ఒక్కోసారి 20 ఏళ్లు కూడా పట్టొచ్చు. 2009 లో సూపర్ బ్లూ మూన్ ఏర్పడగా మళ్లీ ఇప్పుడే మరోటి ఏర్పడుతోంది. నాసాలెక్కల ప్రకారం 2037 లో మళ్లీ సూపర్ బ్లూ మూన్ దర్శన మివ్వనున్నాడు..అంటే మళ్లీ 14 ఏళ్లవరకూ సూపర్ బ్లూ మూన్ ను మనం చూడలేమన్నమాట.