surya’s kanguva
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా చూడడానికి చాలా సైలెంట్ గా కనిపించినా కెమెరా ముందుకు వస్తే మాత్రం క్యారెక్టర్ లో జీవించేస్తాడు. నటించేది చిన్న పాత్ర అయిన కానీ ఆయన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. సూర్య నటనకి, లుక్స్ కి ఫిదా కానీ వారంటూ ఎవరు ఉండరు. ఇప్పటి వరకు సాలిడ్ పాత్రల్లో నటించిన సూర్య ఇప్పుడు తన కెరీర్ లో ఓ బిగ్గెస్ట్ సినిమాతో రానున్నాడు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ శివ-సూర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కంగువ. సూర్యకి జోడిగా దిశా పటానీ నటిస్తుంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా రానుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే విడుదలైన టీజర్ పై భారీ రెస్పాన్స్ అందుకుంది. సూర్య గెటప్, టీజర్ చూసిన ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కంగువ లో సూర్య పాత్ర ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉందట.ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే 10 భాషల్లో రిలీజ్ అంటూ యాక్టివ్ అప్డేట్ ఇచ్చారు. కంగువ మూవీ నిర్మాత జ్ఞానవేల్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు. అది విన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యనికి గురయ్యారు.
38 భాషల్లో, త్రీడీ ఎఫెక్ట్ లో surya’s kanguva
పాన్ ఇండియా సినిమా అంటే ఓ అయిదారు భాషల్లో రిలీజ్ చేయడం సహజం. మహా అయితే ఇంకో రెండు మూడు అదనంగా ఉంటాయి. కానీ కంగువ మూవీ స్టార్టింగ్ లోనే 10 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించారు చిత్ర బృందం. ఇప్పుడు నిర్మాత ఏకంగా వరల్డ్ వైడ్ వాడుకలో ఉన్న 38 భాషల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం… అంతేకాకుండా ఐమ్యాక్స్, 3డీ వర్షన్ లోనూ కంగువ మూవీని రిలీజ్ చేస్తున్నాం అన్నాడు జ్ఞానవేల్.
38 భాషల్లో రిలీజ్ అంటే తమిళ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచేలా చేస్తుందన్నాడు.జ్ఞానవేల్ మాట్లాడిన మాటలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ వార్తతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 38 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం అనే మాట నిజం అయితే పాన్ వరల్డ్ స్థాయిలో అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదే అవుతుందని చెప్పవచ్చు.
కంగువ 38 భాషల్లో రిలీజ్ అవుతుందా?
పాన్ ఇండియా మూవీ రిలీజ్ అంటేనే కష్టం…. అలాంటిది ఏకంగా 38 భాషల్లో రిలీజ్ అంటే థియేటర్స్ లోకి వచ్చే వరుకు వేచి చూడాలి. దీనికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. గతంలో సూర్య నటించిన ఈడీ మూవీని పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలని చూశారు చివరకు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు కంగువ మూవీ 38 భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.