ఓహ్… కావాలయ్యా.. నువు కావాలయ్యా అంటూ హాట్ హాట్ సాంగ్ తో కవ్వించిన మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) భాటియా కి కోపమొచ్చింది.. కనిపించిన ప్రతీవాళ్లు పెళ్లెప్పుడంటూ ఆరాలు తీస్తుండటంతో ఈ అమ్మడు చిరాకుపడుతోంది.
నాకులేని తొందర వీళ్లకెందుకో అని సణుక్కుంటోంది. ఏ బాదర బందీ లేకుండా హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే ఫ్యాన్స్ ఎందుకిలా ప్రశ్నిస్తున్నారంటూ మండిపడుతోంది.
మీకెందుకు ఆరా !
ప్రస్తుతం విజయ్ వర్మ తో డేటింగ్ లో ఉన్న ఈ మిల్కీ బ్యూటీని చెన్నైలో ఓ ప్రెస్ మీట్ లో అభిమానులు ఈ ప్రశ్న అడిగారు. లస్ట్ సీరీస్ -2 షూటింగ్ సమయంలో చాలా క్లోజ్ గా మూవ్ అయిన వీళ్లిద్దరూ ఎట్టకేలకు తాము డేటింగ్ లో ఉన్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఎక్కడ జంటగా కనిపించినా అభిమానులకు న్యూస్ గా మారుతున్నారు.
చెన్నైలో ఫ్యాన్స్ తో ఓ ఈవెంట్ లో పాల్గొన్న తమన్నాను ఓ అభిమాని పెళ్లెప్పుడంటూ ఆరా తీశాడు. దాంతో ఈ అందాల సుందరి ముఖం ఎర్రగా కందిపోయింది.ఫ్యాన్ అడిగిన ప్రశ్న అసహనానికి గురి చేసింది. అసలు నా పేరెంట్సే ఇంత గట్టిగా అడగరు అంటూ విసవిసలాడిందిట పబ్లిగ్గా.. అయినా పబ్లిక్ వదులుతారా? ఇప్పటికైనా మీకు నచ్చిన వ్యక్తి తారసపడ్డారా అంటూ మరో కొనసాగింపు ప్రశ్న వేశారు.
దాంతో నా జీవితంలో నేనిప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ రిప్లయ్ ఇచ్చింది ఈబ్యూటీ.
కలిసొచ్చిన 2023 (Tamannah)
2023 తమన్నాకు చాలా కలిసొచ్చిన ఏడాది అనే చెప్పాలి.జీ కర్దా అనే రొమాంటిక్ వెబ్ సీరీస్ లో తమన్నా నటించింది. ఆ సీరియల్ ఆమెకు చాలా మంచిపేరు తెచ్చింది. ఆతర్వాత లస్ట్ స్టోరీస్ 2 సీరియల్ కు ఒప్పుకుని తమన్నా మళ్లీ వార్తల్లోకెక్కింది. ఈసీరీస్ లో ఆమె విజయ్ వర్మతో కలసి నటిస్తోంది. అంతేకాక ఆఖరీ సచ్ అనే క్రైమ్ సీరీస్ కూడా తమన్నా యాక్టింగ్ కు మంచిపేరు తెచ్చిపెట్టింది.
ఇలా ఈ ఏడాదంతా తమన్నాలైమ్ లైట్ లోనే ఉంది. ఒకదాని తర్వాత మరోటి వెబ్ సీరీస్ లు చేస్తూ ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
డేటింగ్ లో ఉన్నా… (Tamannah)
సరైన సినిమాలు లేక వెబ్ సీరీస్,క్రైమ్ థ్రిల్లర్ల వైపు దృష్టి మళ్లించిన తమన్నా.. నిజానికి ఈ మధ్య కాలంలో బాగా డల్ అయిపోయింది.
తన ఈడు వారందరూ పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కని మాతృత్వపు మధురిమలను చవిచూస్తుంటే తాను మాత్రం అటు పెళ్లి లేక, ఇటు సినిమాలు రాక చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. అలాంటి టైమ్ లో వెబ్ సీరీస్ దక్కడం, అందులోనూ విజయ్ వర్మతో పెయిర్ గా నటించాల్సి రావడంతో తమన్నా మనసు పారేసుకుంది. ఇద్దరికీ కెమిస్ట్రీ బాగా కుదిరినట్లుంది ఎట్టకేలకు డేటింగ్ ను థృవీకరించింది ఈ బ్యూటీ.
” అభిమానులైనా, జనం అయినా ఒక్కోసారి చేసే కామెంట్లు మనల్ని బాధిస్తాయి. కానీ చివరికి మనం ఎంత సంతృప్తితో జీవితం గడుపుతున్నాం అన్నది ముఖ్యం.. నామటుకు నాకు నా కెరీర్ కు, నా వ్యక్తిగత జీవితానికి స్పష్టమైన అడ్డుగోడలున్నాయి. నేనెప్పుడూ చాలా ముక్కుసూటిగా మాట్లాడుతుంటాను. నామనస్సులో ఉన్నది స్పష్టంగా చెబుతాను.. ఒక్కోసారి కొన్ని నిజాలు చేదుగా ఉండొచ్చు.. గతంలో అయితే నా పేరెంట్స్ ఏమనుకుంటున్నారో అన్న బెంగ నాకు ఉండేది.కానీ ఇప్పుడు నేనుస్పష్టతను సాధించాను. నాపేరెంట్స్ కూడా స్పష్టంగా ఉన్నారు ఏ విషయమైనా ఇది నేను సాధించిన విజయంగా భావిస్తాను”
అని కామెంట్ చేసింది తమన్నా..
ఈ మధ్య కాలంలో ఎక్కడా సినిమాలు లేక డల్ అయిపోయిన ఈ బ్యూటీ తొందరలోనే మూడు ముళ్లూ వేయించుకుని అందరిలా సెటిల్ అయిపోతుందని ఆశిద్దాం..