గత ఆసియా కప్ Asia Cup ను చేజార్చుకున్న టీం ఇండియా ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలని భావిస్తుంది. ఆసియా కప్ గెలుచుకోవాలన్న కసి కనిపిస్తుంది. అందుకోసం కుర్రాళ్లను ఎంపిక చేయాలన్న డిమాండ్ ఎక్కువగా వినపడుతుంది. ఆసియా కప్ లో బలమైన పాకిస్థాన్, శ్రీలంక జట్లున్నాయి. వీటిని మట్టికరిపించాలంటే యువరక్తం అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. యువకులు చెలరేగి ఆడితే కప్ మనదేనన్నది క్రీడాపండితుల అభిప్రాయం. అందుకే బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బలమైన జట్టును ఎంపిక చేయాలంటే అందులో కుర్రోళ్ల అవసరం ఎక్కువన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతుంది. వాళ్లయితేనే దూకుడుతో ఆడతారన్న ఒపీనియన్ సోషల్ మీడియాలో వ్యక్తమవుతుంది.
ఈ నెల 30 నుంచి…
ఆసియా కప్ ఈ నెల 30 వ తేదీ నుంచిప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అనేక జట్లను దేశాలు ప్రకటించాయి. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ జట్టులను ఇప్పటికే ప్రకటించాయి. భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. ఇటీవల వెస్టిండీస్ టూర్ లో కొందరు ఆటగాళ్లు సక్సెస్ అయ్యారు. ఐర్లాండ్ పర్యటనలో మరికొంత మంది చెలరేగిపోయారు. కూర్పులో యువకులకు ప్రాధాన్యమివ్వాలన్ని బీసీసీఐ ఉద్దేశ్యంగా ఉంది. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆసియా కప్ కోసం మొత్తం 17 మంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేయనుంది. వీరిలో ఎవరు సెలెక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
టాప్ ఆర్డర్… Asia Cup
భారత్ టాప్ ఆర్డర్ బలంగా ఉండేలా చూడాల్సి ఉంది. అలాగే బౌలింగ్ పరంగా కూడా ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్ల అవసరం కూడా ఉంది. అందుకే జట్టు కూర్పులో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఆసియా కప్ లో బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ టీంలు బలంగా ఉన్నాయి. వీరిర సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే సరైన ఆటగాళ్లను ఎంపిక చేయడం అవసరం. టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉండి తీరాల్సిందే. అందుకోసమే బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తుంది. నేడు అజిత్ అగార్కర్ నేతృత్వంలో భారత సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే తుది జట్టును ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే కసరత్తు పూర్తయినా చివరి నిమిషంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
దూకుడున్న ఆటగాళ్లను… Asia Cup
ఆసియా కప్ కు ఎవరెవరు సెలక్టవుతారన్నది ఆసక్తిగా మారనుంది. ఇటీవల మైదానంలో దూకుడు ప్రదర్శిస్తున్న యువ ఆటగాళ్లను ఎంపిక చేయాలన్నది టీం సమిష్టి నిర్ణయంగా కనిపిస్తుంది. పాకిస్థాన్, శ్రీలంక వంటి బలమైన జట్లను ఎదుర్కొనాలంటే బెదరు లేకుండా బ్యాట్ ఝుళిపించే ఆటగాళ్ల అవసరం ఉంటుందన్న అభిప్రాయం వ్య్తమవుతుంది. బుమ్రా ఐర్లాండ్ పర్యటనతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. బౌలర్లు, బ్యాటర్లు అధికంగా ఉన్న మన యువజట్టు నుంచి కొందరినే ఎంపిక చేయడమంటే సెలక్టర్లకు కత్తిమీద సామే అవుతుంది. మరి చివరకు ఆసియా కప్ కు ఎవరు సెలక్టర్ అవుతారన్న విషయంపై క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Asia Cup