Big
బంగారం ధరలు పెరిగితే ఎంత బాధో అందరికీ తెలుసు.
ముఖ్యంగా మహిళలకు మక్కువగా నిలిచే బంగారం ధరలు తగ్గినా, నిలకడగా సాగినా ఆనందమే. బంగారానికి ఎప్పుడూ వన్నె తగ్గన్నట్లుగానే డిమాండ్ కూడా తగ్గదు. బంగారం పట్ల అభిరుచి ఎప్పటికీ తగ్గదు. ఎంత కొన్నా తనివి తీరదు. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తారు. పైసా.. పైసా కూడబెట్టి మరీ పసిడిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎంత బంగారం ఉంటే సాటి మహిళ తమను అంత గౌరవిస్తుందన్న నమ్మకంతో పాటు స్టేటస్ సింబల్ గా మారడంతో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఒక్కసారి పెరిగిన ధరలు తగ్గడం అరుదుగా జరుగుతుంటాయి. అందుకు అనేక కారణాలున్నా వాటిని మాత్రం జనం అడగరు. పట్టించుకోరు.
తగ్గని గిరాకీ…
ప్రపంచ దేశాల్లో పసిడికి గిరాకీ ఎప్పుడూ తగ్గదు. అయితే కొన్ని చోట్ల కొన్ని విధానాల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ప్రధానంగా విదేశాల్లో ఎవరూ పెద్దగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపరు. అక్కడ ఎక్కువగా గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. భద్రంగా ఉండటంతో పాటు పెరిగిన వెంటనే వాటిని విక్రయించుకుని నగదుగా మార్చుకునే అవకాశాలున్నాయి. ఇక భారత్ లో అందునా ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో మాత్రం బంగారు ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. కొత్త కొత్త డిజైన్లతో పసిడి ఆర్నమెంట్స్ ఊరిస్తుండటంతో వాటిని సొంతం చేసుకునేందుకే ప్రయత్నిస్తారు.
24 క్యారెట్ల… Big
ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం బిస్కెట్లకు కూడా డిమాండ్ అధికంగా ఉంటుంది. ధనవంతులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేసి పెట్టుబడిగా చూస్తుంటారు. తమకు అవసరమైన సమయాల్లో వాటిని ఆభరణాలుగా మలచుకుంటారు. అందుకే ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ బిస్కెట్లతో పాటు గ్రాముల వారీగా ఏటీఎంలు వెలిశాయి. గోల్డ్ ఏటీఎంల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు నివేదికలు అందుతున్నాయి. అయితే అది కొద్దిమందికే పరిమితమయింది. భారతీయ సంప్రదాయాలను అనుసరించి పెళ్లిళ్ల సీజన్ లో బంగారం వాడకం ఎక్కువగా ఉండటం కూడా అందుకు కారణంగా చూడాలి.
ధర స్థిరంగా…
గత కొద్ది రోజులగా స్వల్పంగానో ధరలు పెరుగుతుండటం, నిలకడగానో కొనసాగుతుండటం ఒకింత ఊరట కల్గించే అంశమే. వెండి కూడా భారతీయ సంస్కృతిలో భాగమైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల మాత్రం పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మార్కెట్ లో 54,500 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,450 రూపాయలుగా నమోదయింది. ఇక వెండి ధర మాత్రం సామాన్యుడికి అందనంతగా మారిపోయింది. కిలో వెండి ధర ప్రస్తుతం 76,900 రూపాయలుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ వచ్చేయడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో తొందరపడి కొనుగోలు చేయడమే మంచిదన్న సూచనలు నిపుణుల నుంచి వెలువడుతున్నాయి. Big