పసిడి ప్రియులు బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతుందా? అని చూస్తుంటారు. బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. పెరిగితే ఎక్కువగా తగ్గితే స్వల్పంగా ధరలు బంగారం విషయంలోనే మనం చూస్తుంటాం. బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటంతో వీధి వీధికి ఒక జ్యుయలరీ షాపు మనకు కనపడుతూనే ఉంటుంది. సీజన్, ధరలను చూడకుండా పసిడిని కొనుగోలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువయింది.
పెట్టుబడిగా…
బంగారాన్ని పెట్టుబడిగా చూడటమే కొనుగోళ్లు పెరగడానికి కారణమని చెప్పొచ్చు. ఇక పెళ్లిళ్ల సీజన్ అయితే చెప్పాల్సినపనిలేదు. భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలకు బంగారం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే బంగారు ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువగా ఉండటంతో పెద్ద పెద్ద సంస్థలు చిన్నపాటి నగరాల్లోనూ తమ శాఖలను తెరుస్తున్నారు.
ధరలు ఎంతంటే…
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై వందరూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,450 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,410 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 76,800 రూపాయలకు చేరుకుంది. విశాఖ, విజయవాడ మార్కెట్ లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.