వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టీం యంగ్ ఇండియాపై ట్రోలింగ్ ఎక్కువయింది. వరసగా రెండు టీ 20 మ్యాచ్‌లు ఓడిపోవడంతో వారికి ఇంకా జట్టులో ఎందుకు స్థానం అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఆట మనది కాదు. ప్రతి మ్యాచ్‌నూ మనం గెలవలేం. గెలుపోటములు అప్పటి పరిస్థితులు.. అప్పటికప్పడు జరగబోయే పరిణామాలను బట్టి ఉంటాయి. ఏ క్రీడలోనైనా అంతే. దిగ్గజ ఆటగాడు అయినా తేలిపోవచ్చు. అంచనాలు లేకుండా మైదానంలోకి దిగిన వారు విజృంభించవచ్చు. అందుకని గెలుపోటముల గురించి పెద్దగా పట్టించుకోవద్దు. అలాగని వరసగా ఫెయిల్యూర్ అవుతున్న ఆటగాడిని ఏ దేశమైనా భరించలేదు.
వరసగా రెండు మ్యాచ్‌లు…
అందులో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న క్రికెట్లో అది సాధ్యం కాదు. వెస్టిండీస్‌తో ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లు ఆడి భారత్ పరువును కోల్పోయింది. రెండు మ్యాచ్‌లోనూ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. వెస్టిండీస్‌లో వన్డే, టెస్ట్ సిరీస్ ను దక్కించుకున్న భారత్ టీ 20 లలో మాత్రం తన పట్టును నిలుపుకోలోకపోతుంది. వాస్తవానికి టీ 20లలో వెస్టిండీస్ జట్టు బలంగా ఉంది. ఇటు బౌలింగ్ పరంగా, అటు బ్యాటింగ్ పరంగా ఆ జట్టును ఎదుర్కొనడం కష్టమే. ఇటువంటి పరిస్థితుల్లో నేడు మూడో మ్యాచ్ జరగబోతుంది.
యువ జట్టుతో…
గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. టీం ఇండియా అంతా యువజట్టుతో నిండి పోయింది. ఐపీఎల్లో సత్తా చాటిన వారందరినీ ఏర్చి కూర్చి జట్టుగా చేర్చి ఒక ప్రయోగం బీసీసీఐ చేసిందనే అనుకోవాలి. కానీ ఈ ప్రయోగం విఫలమయిందంటున్నారు. ఐపీఎల్లో సత్తా చాటిన యువ ఆటగాళ్లందరూ ఫెయిల్యూర్ బాట పట్టారు. శుభమన్ గిల్ పై అంచనాలు పెద్దగా పెట్టుకున్నా ఫలితం లేదు. సూర్యకుమార్ యాదవ్ అంతే. తిలక్ వర్మ తప్పించి ఎవరూ అంచనాలకు మించి ఆశించిన ఆటతీరును కనపర్చకపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ వారిని ట్రోల్ చేస్తున్నారు.
మార్పులు తప్పవా?
మొత్తం ఐదు మ్యాచ్‌లు వెస్టిండీస్‌తో ఆటాడాల్సి ఉండగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లను భారత్ చేజార్చుకుంది. ఈరోజు జరిగేది మూడో మ్యాచ్. ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ కోల్పోయినట్లే. అందుకే ఈ మ్యాచ్ కీలకం అని అంటున్నారు. అందుకే జట్టులో కొన్ని మార్పులు చేస్తారంటున్నారు. యశస్వి జైశ్వాల్ ను ఈ మ్యాచ్‌లో ఆడిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద ఈ మ్యాచ్ భారత్‌కు చావో రేవో అన్నట్లుగా ఉంటుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి పూర్తి కాన్ఫడెన్స్‌తో ఉన్న వెస్టిండీస్‌ను ఎదుర్కొనాలంటే శ్రమించక తప్పదు. జట్టు కూర్పులో మార్పులు తప్పదు. మరి ఏంజరుగుతందనేది చూడాలి.