New Delhi: భారతీయ రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ప్రజలు తమ యొక్క క్లెయిమ్ చేయని డిపాజిట్లని సులువుగా కనిపెట్టేందుకు UDGAM (Unclaimed Deposits – Gateway to Access inforMation) పేరుతో ఒక వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. RBI
దీని పై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ, దేశంలోని అనేక బ్యాంకుల్లో ఉన్న క్లెయిమ్ చేయని డబ్బుని ఒకే వెబ్ పోర్టల్ లో సులభతరంగా కనిపెట్టవచ్చని చెప్పారు. UDGAM పోర్టల్ లో ప్రస్తుతానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్, DBS బ్యాంక్ ఇండియా మరియు సిటీ బ్యాంక్. ఈ ఏడు బ్యాంకులలో క్లెయిమ్ చేయని డిపాజిట్ లకు సంబందించిన వివరాలు పొందు పరిచారని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు.
ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం ఇలా చేశారు.దేశంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు క్లెయిమ్ చేయని డిపాజిట్ల విలువ ఫిబ్రవరి 2023 నాటికి రూ. 35,012 కోట్లని తెలిపారు. ఈ మొత్తం డబ్బుని ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSB) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి (RBI) బదిలీ చేశాయన్నారు.
దేశంలోనే అతి పెద్ద బ్యాంకు SBI RBI
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రమే దాదాపుగా రూ. 8,086 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్ లు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. SBI తరువాత స్థానాల్లో కెనరా బ్యాంక్ (రూ. 4,558 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ. 5,340 కోట్లు) మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 3,904 కోట్లు) క్లెయిమ్ చేయని డిపాజిట్ లు ఉన్నాయి.
10 సంవత్సరాల పాటు క్లెయిమ్ చేయని మొత్తం డబ్బుని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఆద్వర్యంలోని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (DEAF) కు బదిలీ చేయబడుతుంది అని ఆర్బీఐ తెలిపింది.
అక్టోబర్ 15, 2023 నాటికి దేశంలోని మిగతా బ్యాంకులు కూడా UDGAM పోర్టల్ లో డిపాజిట్ల కు సంబందించిన పూర్తి వివరాలు అందుబాటులోకి తీసుకు వస్తాయని ఆర్బీఐ పేర్కొంది. ఈ పోర్టల్ కు సంబందించిన పూర్తి వివరాలు https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/register లో లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. RBI