ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ ఉగ్రసంస్థ మధ్య జరుగుతున్న భీకర పోరులో గాజా Gaja స్ట్రిప్ పై ఇజ్రాయెల్ వైట్ ఫాస్సరస్ ను ప్రయోగిస్తోందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిషేధిత వైట్ ఫాస్ఫరస్ బాంబులను వినియోగిస్తోందన్న దుమారం రేగుతోంది. జనసాంద్రత దట్టంగా ఉన్న ప్రాంతాల్లోఈ బాంబులను వినియోగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గాజా స్ట్ట్రిప్ అనేది ఇజ్రాయెల్ అధీనంలో ఉన్న పాలస్తీనా భూభాగం. దీనిని చాలా ఏళ్లుగా హమాస్ పరిపాలిస్తున్నారు. గాజా స్ట్రిప్ లో కనీసం 20 లక్షల మంది నివసిస్తున్నారు.
వైట్ ఫాస్ఫరస్ అంటే ?
ఆర్మీ ఆయుధాల్లో వినియోగించే వైట్ ఫాస్ఫరస్ అనేది ఒక కెమికల్.. ముక్కుపుటాలదిరిపోయే వెల్లుల్లి వాసనతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఇది ఒక మండే రసాయన పౌడర్.. గాలిలోకి ప్రయోగించినప్పుడు వెంటనే మండిపోతుంది. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో వెలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మిలటరీ వ్యవస్థలు ఈ ఆయుధాలను శత్రువుల స్థావరాలు బాగా కనిపించేలా తెలుసుకునేందుకు ఈ బాంబులను వాడతాయి. సెన్సిటివ్ జోన్స్ లో స్మోక్ స్క్రీన్ లు క్రియేట్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇవి ప్రయోగించిన వెంటనే విపరీతమైన కాంతితో, వేడితో వెలుగు వస్తుంది. తెల్లని దట్టమైన పొగ ఆవరించి శత్రువుకు ఏం కనిపించకుండా పోతుంది.
ఈ ఫాస్పరస్ ను ఒకసారి ప్రయోగిస్తే మంటలు వేగంగా వ్యాపిస్తాయి. ఒకసారి మండిస్తే దానిని ఆర్పడం చాలా కష్టం. మనిషి ఒంటిపై ఈ పొగ పడితే చర్మం, బట్టలు కూడా కాలిపోతాయి. ఈ గాయాలు ఒక్కోసారి మన చర్మాన్ని, ఎముకలని కూడా దాటి శరీరానికి డ్యామేజ్ చేస్తాయి. శ్వాస కోస వ్యాధులు వస్తాయి.
గత యుద్ధాల్లో వైట్ ఫాస్పరస్ వినియెగం Gaja
వైట్ ఫాస్ఫరస్ ను చరిత్రలో చాలా మందే వాడారు. బ్రిటీష్ దళాలు 18వ శతాబ్దంలో ఐరిష్ జాతీయవాదులపై వీటిని ప్రయోగించారు. బ్రిటీష్ ఆర్మీ రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ ఈ బాంబులు వాడింది. ఇరాక్ ను అమెరికా దురాక్రమించేందుకు ఇవే బాంబులు ప్రయోగించింది. 2006లో లెబనాన్ తోయుద్ధంలో తాము ఈ బాంబులు వాడామని ఇజ్రాయెల్ గతంలో ప్రకటించింది. గాజా యుద్ధంలో 2008లో కూడా వైట్ ఫాస్పరస్ బాంబుల ప్రయోగం జరిగింది. సిరియా సంక్షోభంలో కూడా బషర్ ఆల్ అసద్ ప్రభుత్వం వీటని వాడటంపై అంతర్జాతీయ సమాజం అభ్యంతరం తెలిపింది. 1972లో ఐక్యరాజ్యసమితి ఈఆయుధాలను వాడరాదని నిషేధం ప్రకటించింది.
యుద్ధాలలో పౌరులకు నష్టం కలిగించే ఇలాంటి ప్రమాదకర ఆయుధాలను వినియోగించరాదని ప్రపంచ దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. వాటిపై కొన్ని దేశాలు నిషేధం విధించగా మరికొన్ని దేశాలు వాటి వినియోగాన్నిపరిమితం చేశాయి. అగ్ని కీలలను వ్యాపింప చేసే ఈ బాంబులను వాడొద్దని ప్రోటోకాల్3 అగ్రిమెంట్ ఉంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలోనూ ఈ బాంబులను రష్యా ప్రయోగించిందనే విమర్శలున్నాయి. ఇలాంటి బాంబులను ప్రయోగిస్తే ఆ ప్రాంతం మొత్తం జనావాసాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ప్రజలు గాయాలపాలై అనారోగ్యం పాలవుతారు. Gaja