(Vijay)
బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగు, తమిళ భాషల్లో ఊహించని స్థాయిలో విజయ్ ఆంటోని పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలో బిచ్చగాడు2 సినిమాతో విజయ్ ఆంటోని మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ ప్రముఖ నటుడి ఇంట విషాదం చోటు చేసుకుంది. 17 సంవత్సరాల వయస్సు ఉన్న విజయ్ ఆంటోని కూతురు లారా ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
చెన్నైలోని డీడీకే రోడ్డులో విజయ్ ఆంటోని ఫ్యామిలీ నివాసం ఉంటోంది. ఈరోజు ఉదయం తెల్లవారు జామున 3 గంటల సమయంలో లారా బలవన్మరణానికి పాల్పడింది. మీరా ఉరివేసుకోవడం ఇంట్లోని మొదటిగా పనిమనిషి చూడటంతో వెంటనే అందరికి విషయం చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే అమె మరణించిందని డాక్టర్లు నిర్ధారించారు.
డిప్రెషన్ లో ఉందంటున్న కుటుంబం
చెన్నైలోని చర్చ్ పార్క్ స్కూల్లో మీరా 12వ తరగతి చదువుతోంది. గత కొంతకాలంగా డిప్రెషన్ సమస్యలతో బాధ పడుతోందని గుర్తించిన కుటుంబం ఆమెకు వైద్య చికిత్స కూడా చేయిస్తోంది. ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా డిప్రెషన్ నుంచి కోలుకోలేకపోయిందని తెలుస్తోంది. చదువుల వల్ల లారా ఒత్తిడికి గురయ్యేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. లారా ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్ ఆంటోని కుటుంబ సభ్యులతో పాటు విజయ్ ఆంటోని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సూసైడ్ థాట్స్ పై విజయ్ ఆంటోనీ కామెంట్లు (Vijay)
గతంలోనే విజయ్ ఆంటోని సూసైడ్ థాట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయ్ అనేదానిపై మాట్లాడాడు. ఎవరినైనా ఎక్కువగా నమ్మి మోసపోయినప్పుడు, చెప్పినట్టుగా, కమిట్మెంట్ ఇచ్చినట్టుగా పని చేయలేకపోయినప్పుడు. చిన్నపిల్లలకు అయితే చదువు విషయం వల్ల వచ్చే ఒత్తిడితో సూసైడ్ థాట్స్ వస్తాయని విజయ్ ఆంటోని తెలిపాడు. అయితే తన ఇంట్లోనే ఇలాంటి విషయం జరగటం విషాదం.
ఒత్తిడి పెట్టొద్దు : విజయ్ (Vijay)
స్కూల్ నుంచి వచ్చాక పిల్లల్ని ట్యూషన్‌కి పో అక్కడికి ఇక్కడికిపో అంటూ ఉంటాం. వాళ్లని సొంతంగా ఆలోచించుకోనివ్వడంలేదు. మన చుట్టు పక్కల వాళ్ల వల్లే మనం కూడా అలా చేస్తున్నాం పిల్లలను కాస్త ఫ్రీగా వదిలేయాలి. అంటూ విజయ్ ఆంటోని అప్పట్లో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వేళ విజయ్ ఆంటోని తన కూతురి విషయంలోనూ సాధారణ తండ్రిగానే ప్రవర్తించాడా పైన చెప్పినట్టుగా వ్యవహరించలేదా ? అసలు విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్యకి అసలు కారణాలు ఏంటి అన్నది తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు.
ఈ ఘటన జరిగిన సమయంలో విజయ్ ఆంటోనీ ఇంట్లో లేడు. బిచ్చగాడు సినిమాతో పాపులర్ అయిన విజయ్ ఆంటోనీకి ఇటు తెలుగులోనూ,అటు తమిళంలోనూ అనూహ్యమైన అభిమానులున్నారు. మనసును తాకే సున్నితమైన అంశాలను పట్టుకుని సినిమాలు తీసే విజయ్ కు పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమధ్యనే బిచ్చగాడు2 సినిమా కూడా వచ్చింది.