విరాట్ కోహ్లీ – IND Vs WI: వెస్టిండీస్‌ను ఓడించిన తర్వాత టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆనందంలో డ్యాన్స్ చేశాడు. కోహ్లీ చాలా కూల్ గా డ్యాన్స్ చేశాడు. మైదానంలో పైకి చూస్తూ చేతులు కదుపుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వెస్టిండీస్‌లోని డొమినికాలో జరిగిన ఈ టెస్టులో కోహ్లీ 76 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఏడు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ బ్యాటర్ల వెన్ను విరిచాడు. అంతే కాకుండా యశస్వి జైస్వాల్ 171 పరుగులు, రోహిత్ శర్మ 103 పరుగులు చేయడంతో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది.వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకు ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 421/5కి డిక్లేర్ చేసింది. మూడు రోజుల్లోనే భారత్ ఆటను ముగించింది.