వెల్లుల్లి (Garlic) గురించి తెలియని వారు దాదాపు ఉండరనే చెప్పాలి. దీనిని ఇష్టపడేవాళ్లు చాలా తక్కువ. వెల్లుల్లిని ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. మనం చేసుకునే వంటల్లో దాదాపు అన్నింటిలో వెల్లుల్లి వేసుకుంటాం. ముఖ్యంగా భారతీయ వంటల్లో ఎక్కువగా ఉపయోగించే మసాలా. వెల్లుల్లి వేస్తే ఆ రుచి వేరేలా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
పోషకవిలువలు..
వెల్లుల్లిలో ఎన్నో రకాల మిటమిన్లు అయోడిన్ ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6, సల్ఫర్, మాంగనీస్, సెలీనియం, పాస్పరస్, క్యాల్షియం, కాపర్, పొటాషియం, ఐరన్ వంటి అనేక రకాల పోషకాలున్నాయి. ఇందులో యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లి వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి దీనిని వేసవి కాలంలో పరిమితంగా వాడాలి.
వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు… (Garlic)
ఇది బరువును ఆటోమేటిక్గా తగ్గిస్తుంది. రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్కెళ్లినంత లాభం. జీర్ణ సమస్యలను నివారిస్తుంది. జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాం. కీళ్ళ నొప్పుల్ని నివారిస్తుంది. తల్లిపాల ఉత్పత్తిని పెంచడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని ఆహరంలో తిసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఉండవు. ఎముకలను బలపరుస్తుంది. మన శరీరంలో మెదడు అనేది చాలా కీలకమైనది. మెదడు చురుగ్గా పనిచేయటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. ప్లేట్లెట్లును పెంచుతూ రక్తాన్ని గడ్డకట్టనివ్వకుండా సహయపడుతుంది. మైగ్రేన్ తలనొప్పి, క్యాన్సర్ ను తగ్గిస్తుంది. మలబద్దక సమస్యలను నివారిస్తుంది.
ఈ మధ్యకాలంలో వయసుతో సంభంధం లేకుండా చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ అటాక్ అవుతోంది.డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలను ఉదయం సమయంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. చెవి పోటు వంటి సమస్యలతో బాధపడే వారు తగ్గడానికి వెల్లుల్లిని నూనెలో కాల్చి గోరువెచ్చని నూనెను చెవిలో వేస్తే చెవిపోటు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. (Garlic)
చర్మనికి కూడా ఔషధంగా.. వెల్లుల్లి
చర్మసమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని కాపాడటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటి వాటిని దూరం చేయడంలో సహయపడుతుంది. చర్మం కాంతివంతంగా మెరవాలంటే పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చని నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది. నేతిలో వేయించిన వెల్లుల్లిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు చర్మ ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది. జుట్టు రాలిపోవడం వంటి సమస్యలను దూరం చేయడంలో వెల్లుల్లి ఎంతో సహయపడుతుంది. జుట్టు పెరుగడంలోనూ బాగా పని చేస్తుంది.
అతిగా తీసుకుంటే నష్టాలూ ఉన్నాయ్.. (Garlic)
దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంత హాని కలిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీనిని అతిగా తినడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. అందువలన పరిమితిలో తీసుకోవాలి. తక్కువ రక్తపోటు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇది మరింతగా రక్తపోటు తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల బలహీనత, అలసట వచ్చే అవకాశముంది. ఎక్కువ తినడం వల్ల గుండె మంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. (Garlic)