అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ OCD అనేది ఒక మానసిక సమస్య. చాలా మంది దీనితో బాధపడుతున్నారు, కానీ దీని బారిన పడ్డట్లు వారికి తెలియదు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా అవసరమని నిపుణులు అంటున్నారు. మీ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచడం మరియు మీ ఇంటిని చక్కగా సర్దుకోవడం ఆరోగ్యకరమైన అలవాట్లు, కానీ ఈ ఆరోగ్యకరమైన అలవాట్లతో మీకు అబ్సెషన్ ఏర్పడడం మొదలైతే, అది సమస్యాత్మకంగా మారుతుంది. ఇది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి సంబంధించిన ఎక్కువ కేసులు 15 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లలో కనిపిస్తాయి. అతిగా ఆలోచించేవారిలోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఓసిడి రోజువారీ దినచర్యలు, వ్యక్తిగత సంబంధాలు మరియు మానసిక ఆరోగ్యం పై మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. ఓసిడి అనేది ప్రపంచ జనాభాలో 2నుండి 3శాతం మందిని ప్రభావితం చేసే ఒక విస్తృతమైన మానసిక ఆరోగ్య సమస్య.. ఇది వ్యక్తుల రోజువారీ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది రోజువారీ జీవితం, వ్యక్తిగత సంబంధాలు మరియు మెుత్తం మానసిక ఆరోగ్యంపై ప్రభావాలను చూపుతుంది.
ఓసిడి (OCD) అంటే ఏమిటి…
ఈ సమస్య ఒక వ్యక్తి రోజువారీ జీవితంపై ప్రభావం ఉంటుందట. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రతి 100 మందిలో ఇద్దరు తమ జీవితంలో ఎప్పుడైనా ఈ వ్యాధిని ఎదుర్కొంటారు. దీని కారణంగా, రోజువారీ జీవితం కూడా ప్రభావితమవుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ వ్యాధికి ట్రీట్మెంట్ చాలా ముఖ్యం. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగి ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు.
రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది..
ఈ సమస్యతో భాధపడేవారు విలువైనది ఏదైనా పోతుందనే భయం, తమకు ప్రమాదం జరగుతుందేమో అన్న భయం, ఏదైనా జబ్బు చేసిందేమో అన్న భయం లాంటివి వెంటాడుతున్నట్లు భ్రమపడుతుంటారు. చేసిన పనినే మళ్లీ, మళ్లీ రిపీట్ చేయడం ఇందులో ప్రధానంగా కనిపించే లక్షణం. ప్రతి చిన్న విషయాన్ని చాలా సార్లు చెక్ చేయడం, రోజులో చాలా సార్లు చేతులు కడుక్కోవడం కొన్ని పనులు చేసిన తర్వాత కూడా చేశామా లేదా అని గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఇటువంటి లక్షణాలు అన్ని ఎక్కువగా కనిపిస్తుంటాయి. OCD
చికిత్స ఎలా?
ఒక వ్యక్తి ఈ సమస్యతో భాధపడుతుంటే మానసిక వైద్యుడిని సంప్రదించాలి. ఈ సమస్య కొందరికి థెరపీ, కౌన్సిలింగ్ ద్వారా క్యూర్ అవుతుంది, మరికొందరికి లక్షణాలు తీవ్రంగా ఉంటే కచ్చితంగా మెడిసిన్ వాడాల్సిందేనని డాక్టర్లు చెబుతున్నారు. కొందరికి కౌన్సిలింగ్‌తో నయమవుతుంది. మరికొంతమందికి యోగా, మెడిటేషన్ వంటివి సజిస్ట్ చేస్తారు. ఈ సమస్య ఇటీవల మీలో ప్రారంభమైతే, మీరే దానిని కంట్రోల్ చేయవచ్చు. ఓసీడీ లక్షణాలు మీలో ఉంటే మీ మనస్సులో వచ్చే ఆలోచనలను పదే పదే నియంత్రించడానికి ప్రయత్నించండి. మీరు దేనికైనా భయపడితే మీలొ మీరు ఇబ్బందిపడకుండా ఇతరులతో చెప్పుకోవడం వల్ల కొంతవరకు ఈ సమస్యని నియంత్రించుకోవచ్చు. OCD